షర్మిన్ సెగల్ (జననం 1995 సెప్టెంబరు 28) హిందీ చిత్రసీమకు చెందిన భారతీయ నటి. ఆమె తన మేనమామ సంజయ్ లీలా బన్సాలీకి సహాయ దర్శకురాలిగా తన వృత్తిని ప్రారంభించింది. అంతేకాదు, ఆయన రూపొందించిన మలాల్ (2019) చిత్రంలో ఆమె తొలిసారిగా నటించింది కూడా. దీంతో, ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కొరకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందింది. ఆ తరువాత, షర్మిన్ సెగల్ అతిథి భూతో భవ (2022)లో నటించింది.[1][2]

షర్మిన్ సెగల్
2019లో షర్మిన్ సెగల్
జననం (1995-09-28) 1995 సెప్టెంబరు 28 (వయసు 29)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
బంధువులుసంజయ్ లీలా భన్సాలీ (మేనమామ)

నేపథ్యం

మార్చు

బేలా సెగల్, దీపక్ సెగల్ దంపతులకు 1995 సెప్టెంబరు 28న ముంబైలో షర్మిన్ సెగల్ జన్మించింది.[3] ఆమె తల్లి ఫిల్మ్ ఎడిటర్, ఆమె బ్లాక్‌ (2005) చిత్రానికి క్రెడిట్ కలిగి ఉంది,[4] కాగా, ఆమె తండ్రి సినిమా నిర్మాత.

ఆమె ప్రముఖ నటి రేఖను పరిశ్రమకు పరిచయం చేసిన భారతీయ చలనచిత్ర దర్శకుడు మోహన్ సెగల్ మనవరాలు.[5]

ఆమె అమ్మమ్మ, తాతయ్యలు దివంగత సినీ నిర్మాత నవీన్ భన్సాలీ, లీలా బన్సాలీ.

ఆమె దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు.[6] ఆమె న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ (Lee Strasberg Theatre and Film Institute)లో తన నటనా కోర్సును పూర్తి చేసింది.[7]

కెరీర్

మార్చు

షర్మిన్ సెగల్ గోలియోన్ కి రాస్లీలా రామ్ లీలా (2013)తో సహాయ దర్శకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. మేరీ కోమ్ (2014), బాజీరావ్ మస్తానీ (2015), గంగూబాయి కతియావాడి (2022) వంటి చిత్రాలకు కూడా సహాయ దర్శకురాలిగా వ్యవహరించింది.[8]

ఆమె 2019లో సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన మలాల్‌ (2019)తో తొలిసారిగా నటించింది. ఆమె మీజాన్ జాఫ్రీ సరసన అస్తా త్రిపాఠి పాత్రను పోషించింది.[9] ఇది విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా అరంగేట్రం చేసిన మీజాన్, షర్మిన్‌ల తెరపై కెమిస్ట్రీని ప్రశంసించింది.[10] షర్మిన్ సెగల్ ఇందులో తన నటనకు గానూ ఫిలింఫేర్ ఉత్తమ మహిళా డెబ్యూ నామినేషన్‌ను అందుకుంది.[11]

2022లో, ఆమె జీ5 అతిథి భూతో భవలో ప్రతీక్ గాంధీ సరసన ఎయిర్ హోస్టెస్ నేత్రా బెనర్జీ పాత్రను పోషించింది.[12][13] ఇది విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఫిలింఫేర్ ఆమె, ప్రతీక్ ఇద్దరినీ నిజమైన జంటగా ఉందని పేర్కొన్నది.[14][15]

ఆ తర్వాత, ఆమె నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డ్రామా సిరీస్ హీరామండిలో చేసింది.[16]

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ మూలాలు
2013 గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా సహాయ దర్శకురాలు
2014 మేరీ కోమ్ సహాయ దర్శకురాలు
2015 బాజీరావ్ మస్తానీ సహాయ దర్శకురాలు[17]
2019 మలాల్ అస్తా త్రిపాఠి ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేషన్ పొందింది [18][19][20]
2022 గంగూబాయి కతియావాడి సహాయ దర్శకురాలు[21]
అతిథి భూతో భవ నేత్రా బెనర్జీ [22]

టెలివిజన్

మార్చు
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్ మూలాలు
2024 హీరామండి: డైమండ్ బజార్ TBA [23]

మూలాలు

మార్చు
  1. "Exclusive Interview! Known all about the Malaal and Atithi Bhooto Bhava actress Sharmin Segal". Times of India. 10 June 2019. Archived from the original on 10 June 2019. Retrieved 15 June 2019.
  2. "Star Power Actress: Sharmin Segal". Bollywood Hungama. Archived from the original on 3 June 2014. Retrieved 15 July 2020.
  3. "Won't rely on family name for work: Malaal actress Sharmin Segal". The Pioneer. Archived from the original on 23 October 2022. Retrieved 25 June 2019.
  4. "Won't rely on family name for work: Malaal actress Sharmin Segal". The Pioneer. Archived from the original on 23 October 2022. Retrieved 25 June 2019.
  5. "Rekha blesses Malaal star and Mohan Segal's granddaughter, Sharmin Segal". Mid Day. Archived from the original on 23 October 2022. Retrieved 10 July 2019.
  6. "Malaal actress Sharmin Segal: I have pressure to keep up tag of being Sanjay Leela Bhansali's niece". India Today. Archived from the original on 6 July 2019. Retrieved 5 July 2019.
  7. "A Timeline of Lee". newyork-strasberg.com. Archived from the original on October 11, 2010. Retrieved December 1, 2006.
  8. Peter John, Ali (15 September 2019). "Sanjay Bhansali's next Malaal goes on the floor". Bollywood Hungama. Archived from the original on 18 May 2019. Retrieved 18 May 2019.
  9. "Sanjay Leela Bhansali to launch niece Sharmin Segal opposite Javed Jaffrey's son Meezaan in Malaal". Hindustan Times. 16 May 2019. Archived from the original on 18 May 2019. Retrieved 18 May 2019.
  10. Sinha Jha, Priyanka (5 July 2019). "Malaal Movie Review: Meezaan, Sharmin's Film Lacks the Pathos It Needed". News18. Archived from the original on 24 October 2022. Retrieved 5 July 2019.
  11. "'Malaal' trailer: Newbies Meezaan Jaaferi and Sharmin Sehgal are all set to redefine love in their debut film". Times of India. 18 May 2019. Archived from the original on 19 May 2019. Retrieved 18 May 2019.
  12. "Pratik Gandhi and Sharmin Segal's starrer Atithi Bhooto Bhava goes on floors in Mathura". The Indian Express. 22 January 2021. Archived from the original on 22 January 2021. Retrieved 22 January 2021.
  13. "Atithi Bhooto Bhava Trailer: Jackie Shroff, Pratik Gandhi and Sharmin Segal starrer showcases love stories from different eras". Pinkvilla. Archived from the original on 21 September 2022. Retrieved 16 September 2022.
  14. "Atithi Bhooto Bhava Movie Review: The film leans heavily on Jackie Shroff's charm". Filmfare. Archived from the original on 24 September 2022. Retrieved 24 September 2022.
  15. "Atithi Bhooto Bhava review: Jackie Shroff, Pratik Gandhi and Sharmin Segal starrer will leave you emotional". DNA India. Archived from the original on 23 September 2022. Retrieved 25 September 2022.
  16. "Siddharth Gupta and Sharmin Segal are the leads in Sanjay Leela Bhansali's Heera Mandi – Exclusive". The Times of India. 24 June 2022. Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
  17. "Debutants of 2019: Ananya Panday to Sharmin Segal, the big Bollywood debuts of this year". India Today. Archived from the original on 25 December 2019. Retrieved 26 December 2019.
  18. "Malaal: Sharmin Segal, Meezaan's Bollywood debut film to now release on 5 July". Firstpost. 25 May 2019. Archived from the original on 25 May 2019. Retrieved 25 May 2019.
  19. "Debutants who ruled Bollywood in 2019: From Tara Sutaria, Ananya Pandey to Sharmin Segal". ANI News. Archived from the original on 27 October 2021. Retrieved 27 December 2019.
  20. "Filmfare Awards 2020 Nominations | 65th Filmfare Awards 2020". Filmfare (in ఇంగ్లీష్). Archived from the original on 3 February 2020. Retrieved 1 February 2024.
  21. "Meezaan Jafri and Sharmin Segal Turn Assistant Directors for Bhansali's Gangubai Kathiawadi". News18. 8 March 2021. Archived from the original on 8 March 2021. Retrieved 10 March 2021.
  22. "Sharmin Segal on Atithi Bhooto Bhava: 'It was one of my dreams to work with Jackie Shroff'". Firstpost. 22 September 2022. Archived from the original on 22 September 2022. Retrieved 22 September 2022.
  23. "Sonakshi Sinha, Manisha Koirala, Aditi Rao Hydari, Richa Chadha, and Sharmin Segal start Heeramandi's shoot". Bollywood Hungama. 2 September 2022. Archived from the original on 23 October 2022. Retrieved 20 October 2022.