షాదాబ్ ఖాన్

పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెటర్

షాదాబ్ ఖాన్[3] పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెటర్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు, వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు.[4] పాకిస్తాన్ సూపర్ లీగ్,[5] దేశవాళీ క్రికెట్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.[6] ఆల్ రౌండర్ గా, పాకిస్తాన్ అత్యంత విజయవంతమైన టీ20 బౌలర్ గా రాణించాడు.[7] పాకిస్తాన్‌లోని అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకరిగా కూడా పరిగణించబడ్డాడు.[8][9] 2022 నాటికి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కేంద్రంగా కాంట్రాక్ట్ చేసిన ఆటగాళ్ళలో ఒకడిగా ఉన్నాడు.[10][11] 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాకిస్థాన్ జట్టులో ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు.

షాదాబ్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1998-10-04) 1998 అక్టోబరు 4 (వయసు 26)
మియాన్వాలి, పంజాబ్, పాకిస్తాన్
మారుపేరుషడ్డీ[1]
ఎత్తు5 అ. 10 అం. (178 cమీ.)[2]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
బంధువులుసక్లైన్ ముస్తాక్ (మామ)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 227)2017 ఏప్రిల్ 30 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2020 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 211)2017 ఏప్రిల్ 7 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 10 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.7 (formerly 29)
తొలి T20I (క్యాప్ 73)2017 మార్చి 26 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 ఏప్రిల్ 14 - న్యూజీలాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.7 (formerly 29)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015Rawalpindi Rams
2017–presentIslamabad United
2017Trinbago Knight Riders
2017Brisbane Heat
2019గయానా Amazon వారియర్స్
2019–2023Northern
2019/20Dhaka Platoon
2021/22Sydney Sixers
2022యార్క్‌షైర్
2022/23Hobart Hurricanes
2023ససెక్స్
2023San Francisco Unicorns
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I T20
మ్యాచ్‌లు 6 62 92 239
చేసిన పరుగులు 300 725 569 2,295
బ్యాటింగు సగటు 33.33 27.88 18.96 18.50
100లు/50లు 0/3 0/4 0/1 0/7
అత్యుత్తమ స్కోరు 56 86 52 91
వేసిన బంతులు 954 3,046 1,951 5,133
వికెట్లు 14 81 104 273
బౌలింగు సగటు 36.64 32.06 22.12 22.81
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/31 4/27 4/8 5/28
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 16/– 29/– 86/–
మూలం: ESPNcricinfo, 30 August 2023

వ్యక్తిగత జీవితం

మార్చు

2023 జనవరి 23న పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ అంతర్జాతీయ ఆటగాడు సక్లైన్ ముస్తాక్ కుమార్తె మలైకా సక్లైన్‌ను ప్రైవేట్ నికా వేడుకలో వివాహం చేసుకున్నాడు.[12]

క్రికెట్ రంగం

మార్చు

2020 డిసెంబరు 18న, బాబర్ గాయం సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ లో జట్టుకు నాయకత్వం వహించినప్పుడు ఖాన్ మొదటిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2016 ఆగస్టు 26న, 2016–17 జాతీయ టీ20 కప్‌లో రావల్పిండి తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[13] 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత, అతను 2017 కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడటానికి సంతకం చేసాడు.[14] తర్వాత 2017లో, షాదాబ్ బిగ్ బాష్ లీగ్ 7వ సీజన్ కోసం బ్రిస్బేన్ హీట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.[15] ఘనీ గ్లాస్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.

2019 జూన్ లో, ఖాన్ 2019 గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్‌లో ఎడ్మోంటన్ రాయల్స్ ఫ్రాంచైజీ జట్టు తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.[16] 2021 డిసెంబరులో, 2021 పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం ఆటగాళ్ళ డ్రాఫ్ట్ తర్వాత ఇస్లామాబాద్ యునైటెడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2017 మార్చి 26న వెస్టిండీస్‌పై పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[17]

2017 ఏప్రిల్ 7న వెస్టిండీస్‌పై పాకిస్తాన్ తరపున తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు.[18] 2017 ఏప్రిల్ 30న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు.[19] 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2017 సెప్టెంబరులో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[20]

2021 సెప్టెంబరులో, ఖాన్ 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[21]

2023 మార్చి 27న, ఆఫ్ఘనిస్తాన్‌పై తన 100వ టీ20 అంతర్జాతీయ వికెట్‌ను తీసుకున్నాడు,[22] టీ20లలో 100 వికెట్లు తీసిన పాకిస్తాన్ నుండి మొదటి క్రికెటర్ అయ్యాడు.[23]

మూలాలు

మార్చు
  1. "Pakistan Spinner Shadab Khan Finds Rohit Sharma And David Warner Most Difficult to Bowl to". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-04.
  2. Shadab Khan’s profile on Sportskeeda
  3. "وائرس کی تشخیص کے بعد شاداب دورۂ انگلینڈ سے باہر". BBC News اردو. Retrieved 29 July 2021.
  4. "'Dreams do come true', Shadab Khan on being named vice-captain". Batting with Bimal. 19 October 2020. Retrieved 21 April 2022.
  5. Shafique, Adnan (26 January 2020). "Shadab Khan Appointed Islamabad United Captain | Islamabad United". Archived from the original on 4 ఏప్రిల్ 2023. Retrieved 21 April 2022.
  6. "Shadab Khan to captain Northern Areas in National T20 Cricket Cup". Dialogue Pakistan. 22 September 2020. Archived from the original on 19 జనవరి 2022. Retrieved 21 April 2022.
  7. "Pakistan Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-09-28.
  8. "5 Best Fielders in History of Pakistan Cricket". propakistani.pk. 2022-05-10. Retrieved 2022-09-12.
  9. Singh, Gurpreet (2022-09-11). ""He is our best fielder": Shoaib Akhtar backs Shadab Khan despite having a poor day on field vs Sri Lanka in Asia Cup 2022 final". The SportsRush. Retrieved 2022-09-12.
  10. "PCB Central Contracts 2018-19". www.pcb.com.pk. Retrieved 2022-09-12.
  11. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPNcricinfo. Retrieved 2022-09-12.
  12. "Shadab Khan ties knot with Saqlain Mushtaq's daughter". Geo Super. 9 January 2023. Retrieved 23 January 2023.
  13. "National T20 Cup, Federally Administered Tribal Areas v Rawalpindi at Rawalpindi, Aug 26, 2016". ESPN Cricinfo. Retrieved 26 August 2016.
  14. H. Khan, Khalid (13 March 2017). "Shadab among seven Pakistanis signed up by CPL". Dawn. Retrieved 1 September 2017.
  15. "Shadab Khan signs BBL contract with Brisbane Heat". ESPNcricinfo. Retrieved 1 September 2017.
  16. "Global T20 draft streamed live". Canada Cricket Online. 20 June 2019. Archived from the original on 8 జూలై 2019. Retrieved 20 June 2019.
  17. "Pakistan tour of West Indies, 1st T20I: West Indies v Pakistan at Bridgetown, Mar 26, 2017". ESPN Cricinfo. Retrieved 26 March 2017.
  18. "Pakistan tour of West Indies, 1st ODI: West Indies v Pakistan at Providence, Apr 7, 2017". ESPN Cricinfo. Retrieved 7 April 2017.
  19. "Pakistan tour of West Indies, 2nd Test: West Indies v Pakistan at Bridgetown, Apr 30 – May 4, 2017". ESPN Cricinfo. Retrieved 30 April 2017.
  20. "Sarfaraz bags outstanding player of the year at PCB awards 2017". Dawn News. 14 September 2017. Retrieved 29 October 2017.
  21. "Sharjeel Khan dropped from T20 World Cup squad; Asif Ali, Khushdil Shah make 15-man cut". ESPN Cricnfo. Retrieved 6 September 2021.
  22. "Shadab leads Pakistan's consolation win as Afghanistan take series". Prothomalo (in ఇంగ్లీష్). Retrieved 2023-03-28.
  23. "Shadab Khan creates new Pakistan record in T20I cricket". Cricket Pakistan. Retrieved 2023-03-28.

బాహ్య లింకులు

మార్చు