షాదీ ముబారక్ (సినిమా)
షాదీ ముబారక్, 2021లో విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించగా, పద్మశ్రీ దర్శకత్వం వహించాడు.[1] ‘షాదీ ముబారక్’ థియేటర్లలో 2021 మార్చి 5న, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 2021 మార్చి 25న విడుదలైంది.[2]
షాదీ ముబారక్ | |
---|---|
దర్శకత్వం | పద్మశ్రీ |
రచన | పద్మశ్రీ |
స్క్రీన్ ప్లే | పద్మశ్రీ |
నిర్మాత | దిల్ రాజు శిరీష్ |
తారాగణం | సాగర్ దృశ్య రఘునాథ్ రాహుల్ రామకృష్ణ హేమ రాజశ్రీ నాయర్ బెనర్జీ అదితి మ్యాకాల్ ప్రియదర్శిని రామ్ ఝాన్సీ |
ఛాయాగ్రహణం | శ్రీకాంత్ నరోజ్ |
కూర్పు | మధు చింతల |
సంగీతం | సునీల్ కష్యప్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 5 మార్చి 2021 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ నేపథ్యం
మార్చుసున్నిపెంట మాధవ్ ( సాగర్) ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు పెళ్లి చూపుల కోసం వస్తాడు. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో పిన్ని బాబాయ్‌ల దగ్గరే హైదరాబాద్ లో పెరుగుతాడు. మాధవ్ మాత్రం ఉద్యోగ్య రీత్యా ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాధవ్ పిన్ని బాబాయ్ ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదిస్తారు. ఈ క్రమంలో ఆ మ్యారేజ్ బ్యూరోను నిర్వహించే మహిళ (రాజశ్రీనాయర్)కు కాలు బెణుకుతుంది. ఆమె పెళ్లి చూపులకు మాధవ్‌ను తీసుకెళ్లడానికి వీలు లేకుండా పోతుంది. దాంతో ఆమె మాధవ్‌ను పెళ్లి చూపులకు తీసుకెళ్లే బాధ్యతలను తన కుమార్తె తుపాకుల సత్యభామ (దశ్యా రఘునాథ్)కు అప్పగిస్తుంది. పుట్టినరోజు అయినప్పటికీ అమ్మ కోసం మాధవ్‌ను మూడు పెళ్లి చూపులకు తీసుకెళుతుంది సత్యభామ. ఈ ప్రయాణంలో మాధవ్, సత్యభామలకు ఒకరి గురించి ఒకరికి తెలిసే నిజాలేంటి? ఒకరిపై ఒకరు మనసుపడ్డ మాధవ్, సత్యభామ ఎలా ఒకటవుతారు? అనేదే సినిమా కథ.[3]
నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు
మార్చు- సాగర్ - సున్నిపెంట మాధవ్ [4]
- దృష్ట్యా రఘునాథ్ - తుపాకుల సత్య భామ
- ఆర్జే హేమంత్ - దినేష్ బాబు
- హేమ - హీరో తల్లిగా
- బెనర్జీ - హీరో తండ్రిగా
- ప్రియదర్శిని రామ్ - హీరోయిన్ తండ్రి
- రాజశ్రీ నాయర్- హీరోయిన్ తల్లి
- భద్రం - హీరో స్నేహితుడిగా
- రాహుల్ రమకృష్ణ - ఆటో డ్రైవర్ గా
- మధునందన్
- అజయ్ ఘోష్ - సి.ఐ అజయ్
- శత్రు - శ్రీనివాసరావు
- అదితి మ్యాకాల్ - గోమతి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: పద్మశ్రీ
- నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- సంగీతం: సునీల్ కశ్యప్
- సినిమాటోగ్రఫి: శ్రీకాంత్ నరోజ్
- ఎడిటింగ్: మధు చింతల
- కొరియోగ్రఫీ: భాను
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి రత్నకుమార్
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, బాలాజీ, వనమాలి
- ఆర్ట్: నాని
మూలాలు
మార్చు- ↑ Sakshi (6 March 2021). "'షాదీ ముబారక్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
- ↑ Eenadu (25 March 2021). "ఓటీటీ వేదికగా 'షాదీ ముబారక్'! - shadi mubarak movi streaming on amazon prime". www.eenadu.net. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
- ↑ Andhrajyothy (5 March 2021). "'షాదీ ముబారక్' మూవీ రివ్యూ". Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
- ↑ Eenadu. "అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.