షారూఖ్ ఖాన్ సినిమాలు

'''షారుఖ్ ఖాన్''' (జననం 2 నవంబరు 1965)  ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత టివీ ప్రముఖుడు.[1] దూరదర్శన్ లో ఫౌజీ(1988)  ధారావాహికలో  ఒక సైనికుడి పాత్ర ద్వారా బుల్లితెరలో  మొట్టమొదటిసారి నటించారు షారుఖ్. ఈ పాత్ర ద్వారా మంచి పేరు సంఫాదించుకున్న ఆయనకు ఆ తరువాత మరిన్ని సీరియళ్ళలో అవకాశాలు వచ్చాయి. ఆ వెంటనే సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. 1992లో దీవానా అనే సినిమాలో ఒక సహాయ నటుడి పాత్రతో తెరంగేట్రం చేశారు షారూఖ్.[2] 1993లో విడుదలైన బాజీగర్, దార్ సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించిన షారుఖ్ తన నటనతో బాలీవుడ్ లో తనదైన గుర్తింఫు తెచ్చుకున్నారు.[3] 1995లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో కాజోల్ తో కలసి ఆయన నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా అతి భారీ హిట్ అయింది. భారత సినీ రంగ చరిత్రలో అంతటి హిట్ మళ్ళీ రాలేదంటే ఆశ్చర్యం కాదు. మొన్నమొన్నటి వరకూ ముంబైలోని ఓ సినిమా హాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఆ తరువాత మాధురీ దీక్షిత్ తో కలసి నటించిన దిల్ తో పాగల్ హై(1997), కాజోల్ తో చేసిన కుచ్ కుచ్ హోతా హై(1998), కభీ ఖుషీ కభీ గమ్(2001) వంటి సినిమాలు బాలీవుడ్ లో ఆయనను రొమాంటిక్ హీరోగా నిలిపాయి.[4]

Shah Rukh Khan poses for the camera
2012లో జరిగిన మర్రకెచ్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో షారూఖ్ ఖాన్

నటించిన సినిమాల జాబితాసవరించు

 1. దీవానా (1992)
 2. బాజీగర్ (1993)
 3. డర్ (1993)
 4. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (1995)
 5. దిల్ తో పాగల్ హై (1997)
 6. కుచ్ కుచ్ హోతా హై (1998)
 7. కభీ ఖుషీ కభీ గమ్ (2001)
 8. ఓం శాంతి ఓం (2007)
 9. జబ్ తక్ హై జాన్ (2012)

మూలాలుసవరించు

 1. Saner, Emine (4 August 2006). "King of Bollywood". The Guardian. Retrieved 30 November 2013.
 2. "Then and now: How old were these heroines when Shah Rukh Khan made his debut?". CNN-IBN. 18 March 2013. Archived from the original on 21 మే 2014. Retrieved 14 May 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 3. "Playing villain, one of the greatest highs: Shah Rukh Khan". Daily News and Analysis. 18 December 2011. Retrieved 14 May 2014.
 4. Chhabra, Aseem (21 October 2011). "Shah Rukh Khan: The Lover Or The Superhero?". Rediff.com. Retrieved 4 February 2012.