షింగో లా
షింగో లా [1] (షింకు లా అని కూడా అంటారు), భారతదేశంలో లడఖ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న పర్వత మార్గం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ ప్రాంతాన్ని లడఖ్‌లోని జన్‌స్కార్ ప్రాంతంతో కలుపుతుంది. ఈ కనుమ కింద, రెండు గొట్టాలు, మొత్తం-4-వరుసలు ఉన్న షింగో లా సొరంగాన్ని, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న నిమ్ము-పదమ్-దర్చా రహదారిలో భాగంగా నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి పూర్తవుతుందని అంచనా వేసారు. దీని వలన మనాలి నుండి కార్గిల్ కు ఉన్న దూరం 522 కి.మీ. తగ్గుతుంది, [2] లెహ్-మనాలి హైవేకి ప్రత్యామ్నాయంగా లడఖ్‌కు సకల వాతావరణ మార్గాన్ని ఏర్పరచడం ఈ సొరంగ నిర్మాణానికి ఉన్న లక్ష్యం[3]
Shingo La | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 5,091 మీటర్లు (16,703 అ.) |
ప్రదేశం | హిమాచల్ ప్రదేశ్ |
శ్రేణి | హిమాలయాలు |
Coordinates | 32°54′16″N 77°11′52″E / 32.90444°N 77.19778°E |
భౌగోళికం
మార్చుకనుమకు 20 మీటర్ల దిగువన లోతులేని చిన్న సరస్సు ఉంది. ఈ కనుమ జన్‌స్కార్, లాహౌల్‌లను కలిపే కాలిబాటలో ఉంది. దీనిని స్థానికులు, ట్రెక్కర్లు ఉపయోగిస్తారు. ఈ దారిలో ప్రయాణానికి పది రోజులు పడుతుంది.[4] భారతీయ హిమాలయాలలో ట్రెక్కింగ్ చేసేవారికి సాంకేతికంగా సులభమైన 5000 మీటర్ల ఎత్తున ఉన్న కనుమలలో ఇది ఒకటి. ఇందులో హిమానీనదం ట్రెక్కింగ్ లేదా నిటారుగా ఎక్కడం ఉండదు. ఈ పాస్ సాధారణంగా అక్టోబరు నుండి ఏప్రిల్ వరకు ఉండే శీతాకాలంలో మంచు కింద కప్పడిపోయి ఉంటుంది. హిమపాతాలు వస్తూంటాయి.[5] ఈ కనుమ 16,615.500 అడుగుల ఎత్తున ఉన్నట్లు అధికారిక చిహ్నం ఉంది. వివిధ ట్రెక్కింగ్ వెబ్‌సైట్లు 4900 నుండి 5100 మీటర్ల వరకు ఎత్తు ఉన్నట్లు రాసాయి.
రోడ్డు
మార్చు1999 కార్గిల్ యుద్ధం తర్వాత షింగో లా కనుమ మీదుగా దార్చాను పదమ్‌తో కలిపే రహదారి నిర్మించాలని మొదట తలపెట్టారు. సన్నాహక పనులు 2002 లో ప్రారంభమయ్యాయి. 2004 లో ప్రాజెక్టు ఆమోదం పొందింది. 2012 నాటికి పూర్తవుతుందని అంచనా వేసారు.[6]
లాహౌల్‌లోని రామ్‌జాక్ నుండి షింగో లా మీదుగా జన్స్‌కార్‌లోని కార్గ్యాఖ్ వరకు ఒక కచ్చా బాటను మొదటిసారిగా 2014 మే, 2017 జూన్ ల మధ్య జన్స్కార్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి త్సుల్ట్రిమ్ చోంజోర్ తన స్వంత నిధులతో, స్థానిక గ్రామస్థుల సహాయంతో నిర్మించాడు. అతను రహదారిని నిర్మించమని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అతను తానే స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు గాను, అతను 2021 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[7] తర్వాత ఈ రహదారిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) స్వాధీనం చేసుకుని, తారు రోడ్డు వేసింది. ఈ కొత్త రోడ్డుపై 18 టన్నులకు పైగా వాహనాలు వెళ్ళగల సామర్థ్యం ఉంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) ఈ రోడ్డు ద్వారా పదమ్‌కు ఒక మినీబస్ సర్వీస్ ప్రారంభించింది.[7] BRO ఈ రహదారిని రెండు వరుసలకు పెంచుతోంది. సకల వాతావరణ కనెక్టివిటీ కోసం ఈ కనుమ కింద ఒక సొరంగం నిర్మించాలని యోచిస్తున్నారు. తద్వారా చలికాలంలో కూడా రహదారిని తెరిచి ఉంచడానికి సంస్థ ప్రయత్నిస్తోంది.[8]
షింకు లా సొరంగం
మార్చు2006-2007 సమయంలో షింగో లా కింద ఒక సొరంగం నిర్మించాలని తలపెట్టారు. 2009 నాటికి టెండర్లు పిలిచారు, నిర్మాణ సంస్థను నిర్ణయించారు. అయితే, ఎటువంటి పురోగతి జరగలేదు.[9] 2020 లో, భారత ప్రభుత్వం 13.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మాణం కోసం రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (NHIDCL) వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేసేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్హెచ్ఐడిసిఎల్ షింకున్ లా సొరంగంపై వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డిపిఆర్) పనిని వేగవంతం చేసింది.[10] అయితే, 2021 లో, "ప్రాజెక్ట్ యోజక్" లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ సొరంగం పొడవును 4.25 కి.మీ.కు తగ్గించింది. హిమాచల్ ప్రదేశ్, లడఖ్‌ల మధ్య రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా BRO చేపట్టిన ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ యోజక్.[11][12][13] ఈ సొరంగంలో రెండు ఏకదిశ విడివిడి సొరంగాలు ఉన్నాయి. ఒక్కొక్కదానిలో 2 వరుసలతో, మొత్తం 4 వరుసలు ఉన్నాయి.[14] ప్రస్తుతం ఉన్న అటల్ సొరంగం, నిర్మాణంలో ఉన్న షింకు లా టన్నెల్ పూర్తయిన తరువాత, నిమ్ము-పడుమ్-దర్చా రోడ్డు సకల వాతావరణ రహదారిగా మారుతుంది.[15]
2022 ఏప్రిల్‌లో BRO, ఆ సంవత్సరం జూలై నాటికి షింకు లా టన్నెల్ నిర్మాణాన్ని ప్రారంభించాలనీ, 2025 నాటికి పూర్తి చేయాలనీ భావిస్తున్నామని పేర్కొంది.[16] 2023 ఫిబ్రవరిలో కేంద్ర మంత్రివర్గం, ₹1,681 కోట్లతో, 2025 డిసెంబరు కల్లా పూర్తిచేయాలనే లక్ష్యంతో 4.1 కి.మీ. (2.5 మై.) సొరంగ నిర్మాణాన్ని ఆమోదించింది. దీని నిర్మాణంతో, లడఖ్‌లోని జన్‌స్కార్ లోయలోని దాదాపు 15 గ్రామాల ప్రజలకు ఉపశమనం లభిస్తుంది, ఎందుకంటే శీతాకాలంలో భారీ మంచు కురుస్తున్న కారణంగా లోయతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగం వలన రవాణా సౌకర్యం పెరిగి, జన్స్కార్ లోయలో వాణిజ్యం పెరుగుతుంది. వ్యూహాత్మక, రక్షణ ప్రయోజనాల రీత్యా కూడా ఇది ముఖ్యమైనది. [17] బనానా ఫ్యాన్‌లను ఉపయోగించి సొరంగంలో గాలి ప్రవహాన్ని పంపిస్తారు. దీనికోసం విద్యుత్తు, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
ఇవి కూడా చూడండి
మార్చు- భారత-చైనా సరిహద్దు రోడ్లు
- లేహ్ మనాలి రోడ్
- నిమ్ము–పదం–దార్చా రోడ్డు
మూలాలు
మార్చు- ↑ "Darcha – Padum (Shingo La) Trek". aquaterra.in. Retrieved 9 November 2016.
- ↑ "1,504.64 करोड़ की परियोजना के लिए 1,569 की बोली: HC ने BRO के 15 करोड़ जब्त करने के कदम को बरकरार रखा". jantaserishta. October 2023.
- ↑ Dey, Monidipa (23 November 2022). "Journey to Shinku-La pass connecting Lahaul valley in Himachal with the Zanskar valley in Ladakh". Financial Express. Retrieved 29 April 2023.
- ↑ Zurick, David; Pacheco, Julsun (2006), Illustrated Atlas of the Himalaya, University Press of Kentucky, pp. 183–184, ISBN 9780813173849,
A ten-day trek leads south from Padum into the Great Himalaya, crosses the 5,100- meter Shingola La pass, and descends to the village of Darcha, located on the main road from Manali to Leh.
- ↑ Dutta, Sanjay (23 January 2023). "Army Border Roads To Shinku La Pass Open Round The Year". Hill Post.
- ↑ Vats, Rohit (23 August 2023). "Connecting Ladakh: India's growing road network to link borders with the mainland". India Today.
- ↑ 7.0 7.1 "High-altitude Shinku La Pass connecting Lahaul with Zanskar Valley open for vehicles this time of year". Livemint. 17 December 2022. Retrieved 29 April 2023.
- ↑ Dutta, Sanjay (23 January 2023). "Army Border Roads To Shinku La Pass Open Round The Year". Hill Post.
- ↑ Vats, Rohit (23 August 2023). "Connecting Ladakh: India's growing road network to link borders with the mainland". India Today.
- ↑ "Work on Shinkun La Tunnel sped up: All you need to know about the world's longest high-altitude tunnel". 23 September 2020.
- ↑ Rogers, David (19 April 2022). "India plans world's highest tunnel in the Himalayas". Global Construction Review.
- ↑ "BRO develops Project Yojak in Himachal Pradesh to boost road infra". Construction World. 18 January 2022.
- ↑ "Defence ministry clears the BRO tunnel under Shinkun La in Ladakh". Hindustan Times (in ఇంగ్లీష్). 19 May 2021.
- ↑ "1,504.64 करोड़ की परियोजना के लिए 1,569 की बोली: HC ने BRO के 15 करोड़ जब्त करने के कदम को बरकरार रखा". jantaserishta. October 2023.
- ↑ Defence ministry clears the BRO tunnel under Shinkun La in Ladakh, Hindustan Times, 19 May 2021.
- ↑ "BRO to construct world's highest tunnel at Shinku La Pass to connect Himachal to Ladakh". The Economic Times. 24 April 2022.
- ↑ "Cabinet approves construction of Shinku La Tunnel to provide all-weather connectivity in Ladakh". All India Radio News. 15 February 2023. Retrieved 19 July 2023.