షేర్ (సినిమా)

షేర్ 2015 అక్టోబరు 22 న విడుదలైన తెలుగు సినిమా.

షేర్
Kalyan Ram Sher Movie Poster.jpg
దర్శకత్వంమల్లికార్జున్
రచనడైమండ్ రత్న బాబు
నిర్మాతకొమర వెంకటేష్
నటవర్గంకళ్యాణ్ రామ్
సోనాల్ చౌహాన్
విక్రంజీత్ విర్క్
ఛాయాగ్రహణంసర్వేష్ మురారి
సంగీతంఎస్.ఎస్. తమన్
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

హైదరాబాద్‌లో గౌతమ్ (కల్యాణ రామ్) ఒక సివిల్ ఇంజనీర్. తల్లితండ్రులు (రావు రమేశ్, రోహిణి). తమ్ముడు చదరంగం ఆటగాడు . జీవితం సాఫీగా సాగిపోతున్నదశాలో పప్పీ (విక్రమ్‌జీత్ విర్క్)తో హీరో ఢీ అంటే ఢీ అనాల్సొస్తుంది. పప్పీ తండ్రి దాదా (ముకేష్ రిషి) కలకత్తాలో పెద్ద మాఫియా డాన్. తమ్ముడు ఛోటా (షఫీ), ఇంకా చాలా పరివారం ఉంటుంది. ఇంత నేపథ్యం ఉన్న పప్పీకేమో పెళ్ళి పిచ్చ. జీవితంలో ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనీ, అదే 'నా గోల్, ఎయిమ్, లక్ష్యం ' అని తిరుగుతుంటాడు. 'నాది అనేది నా దగ్గర ఎవడైనా తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా ' అన్నది పప్పీ పద్ధతి. అతని పెళ్ళి చెడిపోవడానికి గౌతమ్ కారణమవుతాడు. దాంతో ప్రతీకారం తీర్చుకోవడానికి గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సాయాజీ షిండే) కూతురు నందిని (సోనాల్ చౌహాన్)కీ, గౌతమ్ కీ మధ్య ప్రేమ సాగుతుంటుంది. ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని పప్పీఆరాట పడుతుంటాడు. ఈ క్రమంలో ఏకంగా హీరోయిన్ తండ్రి దగ్గరకే వెళ్ళి డి.జి.పి.ని చేస్తానని ఆశ చూపించి పెళ్ళికి ఒప్పిస్తాడు. అప్పుడిక గౌతమ్ కాబోయే మామగారి దగ్గరకు వెళ్ళి, మాఫియాగాళ్లను ఎన్‌కౌంటర్ చేసి, ఆ క్రెడిట్ మామగారికి వచ్చేలా చేసి, తానే డి.జి.పి.ని చేస్తానంటాడు. అలా ముందుగా పప్పీ బంధువును చంపడంతో ఎన్‌కౌంటర్ల పర్వానికి శ్రీకారం చుడతాడు. ఇక సినిమా రెండవ భాగంలో కూడా ఆ పర్వం కొనసాగిస్తూనే, గౌతమ్ వెళ్ళి పప్పీ పెళ్ళి ఇంట్లో తిష్ఠ వేస్తాడు. అక్కడ హాస్యానికి తోడు, గౌతమ్ ఎన్‌కౌంటర్లకు సంబంధించి ఒక ఉత్కంఠభరితమైన నేపథ్యము కూడా తెలుస్తుంది. గౌతమ్ కి అంత పగ ఎందుకు, పప్పీను అడ్డుపెట్టుకొని దాదాను గౌతమ్ ఏం చేశాడు, ఏమిటన్నది మిగతా సినిమా[1].

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

షేర్ చిత్ర పాటలు 2015 అక్టోబరు 10న విడుదలయ్యాయి.[4]

సంగీతంసవరించు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "రామ రామ హరే రామ"  దీపక్ 2:51
2. "సురగని"  Deepak, Mali 3:49
3. "చల్ చలోనా"  Suchith Suresan, Sameera Bharadwaj, Sanjana Kalmanje 3:39
4. "నైనా నైనా"  Anudeep Dev, Sanjaya Kalmanje 3:55
5. "నా పేరు పింకీ"  మ. మ. మానసి, సింహ 3:35

సెన్సార్సవరించు

ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కొమర వెంకటేష్‌. ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ - మా చిత్రం సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్‌ సభ్యులు మంచి సినిమా తీశారని అభినందించారు. కళ్యాణ్‌రామ్‌గారికి పటాస్‌ తర్వాత షేర్‌ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. బిజినెస్‌పరంగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ మల్లికార్జున్‌ టేకింగ్‌ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలోనే మా షేర్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తాం అన్నారు.

మూలాలుసవరించు

  1. "వెంటాడి... వేటాడే షేర్". సాక్షి (దినపత్రిక). 2015-10-31. Retrieved 2015-10-31.
  2. "Sonal Chauhan to replace Vanya Mishra in Kalyanram's Sher"
  3. "Kalyan Ram with 'Temper' girl"
  4. "Kalyan Ram's 'Sher' audio launch and release dates"

బయటి లంకెలుసవరించు