షఫి

సినీ నటుడు
(షఫీ నుండి దారిమార్పు చెందింది)


షఫీ (1975 జులై 2) సినీ నటుడు. చంద్రగిరి మండలం చంద్రగిరి కోటలోపల గ్రామం అతని స్వస్థలం. తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివాడు. తెలుగులో నాటక రంగ ప్రముఖుడైన బళ్ళారి రాఘవ స్ఫూర్తితో తిరుపతిలో ప్రయోగాత్మక నాటక సంస్థ నెలకొల్పాలనుకున్నాడు. కానీ అది వీలు కాలేదు. నటనపైన ఉన్న మక్కువతో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, ఢిల్లీ లో చేరాడు. ఇతను ఖడ్గం సినిమాలో ప్రతినాయకుడు పాత్రతో మంచి పేరు సంపాదించాడు.

షఫి

జన్మ నామంమొహమ్మద్ షఫి
జననం (1975-07-02) 1975 జూలై 2 (వయసు 49)
ప్రముఖ పాత్రలు ఖడ్గం
ఛత్రపతి

నాటకరంగంలో ప్రముఖులైన గిరీష్ కర్నాడ్, బి.వి. కారంత్, రామ్ గోపాల్ బజాజ్ లాంటి వారితో కలిసి పనిచేశాడు. ఖడ్గం సినిమాలో తీవ్రవాది పాత్ర కోసం చార్మినారు సందుల్లో ఒక స్నేహితుడి ఇంట్లో ఒక నెలపాటు నివాసం ఉండి అక్కడ వారి అలవాట్లను గమనించాడు. [1]

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరము చిత్రం దర్శకుఁడు పాత్ర పేరు
2009 ష్
రెడీ
మాయాజాలం
మంగతాయారు టిఫిన్ సెంటర్
ఛత్రపతి
ప్రాణం
ఖడ్గం
2003 నీతో వస్తా
ప్రేమ కావాలి
లక్ష్మి
దూకుడు
బలుపు
బాద్‍షా
డేంజర్
గోల్కొండ హైస్కూల్
కరెంట్
2010 కారా మజాకా
2018 హైదరాబాద్ లవ్ స్టోరి
2020 రన్
2021 బజార్‌ రౌడి [2]
2021 అసలు ఏం జరిగిందంటే
2021 దృశ్యం 2
2021 ది ట్రిప్
2022 దర్జా
గాడ్ ఫాదర్ మురుగన్

మూలాలు

మార్చు
  1. K.V.S, Madhav. "thehindu". thehindu.com. Kasturi and Sons. Retrieved 16 June 2016.
  2. Sakshi (25 March 2021). "రౌడీయిజం ఎలా చేయాలో నేర్పుతున్న సంపూర్ణేశ్ బాబు‌". Sakshi. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=షఫి&oldid=3789809" నుండి వెలికితీశారు