ముకేష్ రిషి
ముకేష్ రిషి (జ. ఏప్రిల్ 19, 1956) భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత. ప్రధానంగా హిందీ, తెలుగు సినిమాల్లో నటించాడు. ఇంకా పంజాబీ, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు. 1988 లో ఈయనకు హిందీ సినిమాతో గుర్తింపు లభించింది. మొదటగా ప్రతినాయక పాత్రలతో తన ప్రస్తానం మొదలు పెట్టినా తర్వాత సహాయనటుడిగా అనేక సినిమాల్లో నటించి తనను తాను నిరూపించుకున్నాడు.
ముకేష్ రిషి | |
---|---|
జననం | కతువా, జమ్మూ కాశ్మీరు, భారతదేశం | 1956 ఏప్రిల్ 19
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1988–ప్రస్తుతం |
తెలుగు మాతృభాష కాకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న అమ్రిష్ పురి, పరేష్ రావల్, శరత్ సక్సేనా, ప్రదీప్ రావత్, శాయాజీ షిండే, సోనూ సూద్, అశుతోష్ రాణా లాంటి వరసలో ముఖేష్ రిషి కూడా ఉంటాడు.
జీవితం
మార్చుముఖేష్ రిషి జమ్ములో జన్మించాడు. చంఢీఘడ్లో చదువు పూర్తయ్యాక, ముంబైలో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఫుజి వెళ్ళిపోయారు. అక్కడే ఆయన కాబోయే భార్యని కలుసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత భార్యతో కలిసి న్యూజిలాండ్ వెళ్ళిపోయి అక్కడే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టాడు.[1] 7 సంవత్సరాలు అక్కడే పనిచేశాక తిరిగి ముంబై వచ్చేసి తనేజ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు.
సినిమా ప్రస్థానం
మార్చు1988 లో హిందీ సినిమాలతో అతని ప్రస్థానం ప్రారంభమైంది. 1994 లో గాండీవం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు లభించింది. 1999 లో ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా వచ్చిన సర్ఫ్ రోష్ సినిమాలో ముఖేష్ ఇన్‌స్పెక్టర్ సలీం అహ్మద్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆయనకు చాలా అవకాశాలు వస్తాయని భావించాడు కానీ అలా జరగలేదు. అప్పుడే ఆయన దక్షిణాది పరిశ్రమ వైపు దృష్టి సారించాడు. ఆమిర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాలోనూ దేవ్ అనే పాత్రకు ముఖేష్ ను అనుకున్నారు. కానీ ఆ సినిమా కోసం కొన్ని నెలల పాటు డేట్లు కావాలని కోరారు. తనకు దక్షిణాది పరిశ్రమలో ఉన్న అవకాశాల కారణంగా ఆ సినిమాకు సమయం కేటాయించలేక ఆ పాత్రను వదులుకున్నాడు. తర్వాత ఆ పాత్రను ప్రదీప్ రావత్ పోషించాడు.[2] 2000 నుంచి చాలా తెలుగులో సినిమాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. తర్వాత తమిళం, మలయాళం, పంజాబీ, ఒరియా భాషల సినిమాల్లో కూడా నటించాడు.
నటించిన చిత్రాలు
మార్చుతెలుగు
మార్చు- కృష్ణాష్టమి (2016)
- షేర్ (సినిమా) (2015)
- శ్రీమంతుడు (2015 సినిమా) (2015)
- బీరువా (2015)
- సౌఖ్యం (2015)[3]
- లౌక్యం (2014)
- పవర్ (సినిమా) (2014)
- రేసుగుర్రం (2014)
- అత్తారింటికి దారేది (2013)
- రామయ్యా వస్తావయ్యా (2013)
- కంత్రి (సినిమా) (2008)
- బాద్షా (2013)
- రచ్చ (2012)
- బృందావనం (2010 సినిమా) (2010)
- శంభో శివ శంభో (2010)
- పాండవులు పాండవులు తుమ్మెద (2012)
- రెబెల్ (2012)
- డార్లింగ్ (2010 సినిమా) (2010)
- శంభో శివ శంభో (2010)
- నమో వెంకటేశ (2010)
- ఆర్య 2 (2009)
- ద్రోణ(సినిమా) (2009)
- మస్కా (2009)
- జల్సా (2008)
- స్టాలిన్ (సినిమా) (2006)
- బంగారం (సినిమా) (2006)
- పౌర్ణమి (సినిమా) (2006)
- బన్ని (2005)
- విజయేంద్ర వర్మ (2004)
- సూర్యం (2004)
- నేనున్నాను (2004)
- పల్నాటి బ్రహ్మ నాయుడు (2003)
- సింహాద్రి (సినిమా) (2003)
- ఒక్కడు (2003)
- ఇంద్ర (సినిమా) (2002)
- అధిపతి (2001)
- నరసింహ నాయుడు (2001)
- మనోహరం (2000)
- గాండీవం (1994)
హిందీ
మార్చు- ఏక్ థా సర్దార్ (2014) .... పోలీసు అధికారి
- మాజీ (2013) .... మల్హాన్ సింగ్
- ఖైది 786 (2012) .... ఇఖత్తర్ సింగ్
- ఫోర్స్ (2011) రెడ్డి (అన్న)
- రామాయణ - ది ఎపిక్ (2010) .... హనుమాన్
- హెల్ప్ (2010)
- లాహోర్ (2010) .... నూర్ మహమద్
- బంబూత్ (2008)
- క్రేజీ 4 (2008) .... రాణా
- నిహల్లే పె దెహల్లా (2007) .... దిల్హర్
- ఫౌజ్ మే మౌజ్ (2007)
- తీస్రీ అంఖ్ (2006) .... సుధామ పాండే
- విశ్వ (2006)
- బ్లాక్ మెయిల్ (2005) .... ఛోటా
- ఇట్ కుడ్ బి యూ (2005) .... మిస్టర్. సిద్దు
- ద వైట్ లాండ్ (2005) .... సామాజిక కార్యకర్త
- అసంభవ్ (2004) .... యోసాన్ బక్ష్
- గర్వ్ (2004) .... జాఫర్ సుపారీ
- రన్ (2004) .... రాజీవ్
- దిల్ పరదేశీ హో గయా (2003) .... టర్బీజ్ బైగ్
- కోయి... మిల్ గయా (2003) .... ఇన్ స్పెక్టర్ ఖుర్షద్ ఖాన్
- జాల్: ది ట్రప్ (2003) .... అఫ్గనీ
- ఓం (2003) .... డిఎస్పీ పఠాన్
- ఇండియన్ బాబు (2003) .... ఠాకూర్ సూరజ్ ప్రతాప్ సింగ్
- దమ్ (2003) .... రాజ్ దత్ శర్మ
- హమ్ కిసీసే కమ్ నహీ (2002) .... పిళ్ళైకి సోదరుడు
- యే కైసే మొహబ్బత్ (2002) .... ఎసిపి
- తుమ్కో నా భూల్ పాయేంగీ' (2002) .... ఇన్ స్పెక్టర్ ఎం.కె.శర్మ
- ఇండియన్ (2001) .... వాసిం ఖాన్
- జోడి నెం.1 (2001) .... బాబూరావ్
- ఆషిఖ్ (2001) .... సప్నాకి సోదరుడు
- ఖిలాడి 420 (2000)
- కురుక్షేత్ర (2000) .... ఇక్బాల్ పసినా
- హమారా దిల్ ఆప్కే పాస్ హై (2000) .... భవాని చౌధురి
- పుకార్ (2000) .... బక్షీ
- అర్జున్ పండిట్ (1999) .... రాము కాలియా
- కొహ్రమ్ (1999) .... ఘాఫూర్ చెంగజీ
- సూర్యవంశం (1999) .... దేశ్ రాజు ఠాకూర్ అలియాస్ కెవ్డా ఠాకూర్
- సఫారూష్ (1999) .... ఇన్ స్పెక్టర్ సలీం
- ఆర్జూ (1999) .... సి.ఎల్.మిశ్రా
- లాల్ బాద్షా (1999) .... ఎస్.పి.అజిత్ సింగ్
- న్యాయదాతా (1999)
- బంధన్ (1998) .... గజేంద్ర
- జులం-ఒ-సితం (1998)
- ఇస్కా టోపీ ఉస్కే సార్ (1998)
- హమ్సే బధ్కర్ కౌన్ (1998)
- వినాశక్ (1998)
- గుండా (1998)
- హత్యారా (1998)
- కభీ నా కభీ (1998)
- లాహు కే దో రంగ్ (1997)
- గుప్త్ (1997)
- జుడ్వా (1997)
- కాలియా (1997)
- మ్రిత్యదాతా (1997)
- నసీబ్ (1997)
- రామ్ ఔర్ శ్యామ్ (1996)
- ఘటక్: లేథల్ (1996)
- సపూత్ (1996)
- లోఫర్ (1996)
- భీష్మ (1996)
- సాజన్ చలే ససురాల్ (1996)
- శాస్త్ర (1996)
- రామ్ శాస్త్ర (1995)
- సంజయ్ (1995)
- బాజీ (1995)
- సురక్ష (1995)
- గర్దిష్ (1993)
- పరంపర (1992)
- హుమ్లా (1992)
- ఘ్యాల్ (1990)
- మిర్ సాదిక్ (1989)
బెంగాలీ
మార్చు- ఫైర్ అలం జోబబ్ దితె (2012)
- పగ్లు 2[4] (2012)
మలయాళం
మార్చు- ఒలంపియన్ ఆంథోనీ ఆడమ్ (2000)
- వార్ అండ్ లవ్ (2003) .... జఫ్ఫర్ ఖాన్
- గాంధర్వం (1992) .... రంగన్
తమిళం
మార్చు- సింగం 2 (2013)
- రమణ (2002)
- వల్లరసు (2000)
పంజాబీ
మార్చు- వారిస్ షా: ఇష్క్ దా వారిస్ (2006)
- తౌర్ మిత్తరన్ ది (2012)
- జట్ జేమ్స్ బాండ్ (2014)
అవార్డులు, నామినేషన్లు
మార్చు- 2000:నామినేటెడ్:ఫిలింఫేర్ సహాయ నటునిగా-సర్ఫరోష్
మూలాలు
మార్చు- ↑ Anuj Kumar (24 March 2007) Terror gets a name Archived 2014-06-27 at the Wayback Machine. Interview with Mukesh Rishi. Hindu.com.
- ↑ "Mukesh Rishi: 'లగాన్'లో ఛాన్స్ వదులుకుని.. సౌత్‌లో టాప్ విలన్ అయ్యారు". EENADU. Retrieved 2024-02-08.
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
- ↑ Paglu 2 Teaser (Bengali) (2012) (Full HD). YouTube (24 July 2012). Retrieved on 2015-08-08.