సంతోష్ ఇస్రం
సంతోష్ ఇస్రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామజిక సేవకుడు, రూరల్ ఫోటోగ్రాఫర్. ఆయన తన మిత్రులతో కలిసి భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ ను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునందుకున్నాడు.[1]
సంతోష్ ఇస్రం | |
---|---|
జననం | సంతోష్ ఇస్రం 12 అక్టోబర్ 1995 |
విద్యాసంస్థ | ఉస్మానియా యూనివర్సిటీ |
వృత్తి | సామజిక సేవకుడు, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2010 - ప్రస్తుతం |
జననం, విద్యాభాస్యం
మార్చుసంతోష్ ఇస్రం 12 అక్టోబర్ 1995లో తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, నార్లపూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం డిప్లొమా ఇన్ సైబర్ లా విద్యను అభ్యసించి ప్రస్తుతం ఓయూలో జర్నలిజం చేస్తున్నాడు.[2]
వృత్తి జీవితం
మార్చుసంతోష్ ఇస్రం చదువుతో ఫాటు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. మారుమూల ప్రాంతం నుండి వచ్చిన సంతోష్ కు అక్కడి వాళ్లందరి జీవితాలను వెలుగులోకి తీసుకురావాలనుకున్నాడు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్న సంతోష్ ఆదివాసీలు, గుత్తికోయలు పడుతున్న ఇబ్బందులను, బాధలను బందించి హైదరాబాద్ రవీంద్రభారతిలో 2018లో ఆర్ట్ ఆఫ్ లైఫ్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆదివాసీ జీవితాలను ప్రపంచానికి పరిచయం చేశాడు.
సంతోష్ ఇస్రం 2020లో కరోనా మొదటి వేవ్‌లో లాక్‌డౌన్ సమయంలో తన సొంతూరు నార్లపూర్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో తన మిత్రులు వీరెల్లి షెషీందర్ రెడ్డి, నరేష్ దూడపాక, గున్మంతరావులతో కలిసి ‘నీలం తోగు’ అనే గూడెంలో పర్యటించాడు. అక్కడి వారితో గడిపి అక్కడి పరిస్థితులను తెలుసుకొని ఆదివాసీల చేత అక్షరాలు దిద్దిస్తేనే వాళ్ల జీవితాలు బాగుపడతాయని ఆలోచించిన వారు అక్కడ ఒక చిన్న గుడిసెలో 24 జూన్ 2020న భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ ను తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు. ఈ విషయాన్నీ సంతోష్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అతని ప్రయత్నం నచ్చిన దాతలు ముందుకు వచ్చి పిల్లలకు బట్టలు, పుస్తకాలు, స్టడీ మెటిరీయల్ ను అందజేశారు.[3]
భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ గురించి తెలుసుకున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంతోష్ మిత్రబృందాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా అభినందించడంతో భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ కు మరింత ప్రాచుర్యం దక్కింది. భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ ను మొదట తన మిత్రులతో కలిసి 'నీలంతోగు'లో ఏర్పాటు చేసి తరువాత దాతల సహాయంతో బండ్ల పహాడ్, సారలమ్మ గుంపు, ముసలమ్మ పెంట, తక్కెళ్లగూడెం, కాల్వపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేశారు.[4]భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ ప్రస్తుతం ఆరు గ్రామాల్లో విస్తరించింది.[5]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (5 June 2021). "అడవిలోఅక్షర యజ్ఞం!". Archived from the original on 12 October 2021. Retrieved 12 October 2021.
- ↑ TV9 Telugu (15 July 2020). "ఆ గిరిజన గ్రామంలో పిల్లలు మొదటిసారి పాఠశాలను చూశారు." Archived from the original on 12 October 2021. Retrieved 12 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telangana Today (14 July 2021). "How an Osmania University grad started a school for Adivasis". Archived from the original on 12 October 2021. Retrieved 12 October 2021.
- ↑ The Hindu (2 July 2020). "Youth brings education to tribal hamlet" (in Indian English). Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
- ↑ Sakshi (21 March 2022). "అడవిని చేరిన అక్షరం". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.