1848
1848 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము. చారిత్రికంగా ఈ సంవత్సరం అనేక దేశాల్లో వచ్చిన విప్లవాలకు ప్రసిద్ధి చెందింది. బ్రెజిల్ నుండి హంగరీ దాకా అనేక దేశాల్లో విప్లవాలు వచ్చిన సంవత్సరం ఇది. చాలా విప్లవాలు తమ లక్ష్యాలను సాధించనప్పటికీ, తదనంతర శతాబ్దమంతా వీటి పర్యవసానాలు కనిపించాయి.
సంవత్సరాలు: | 1845 1846 1847 - 1848 - 1849 1850 1851 |
దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 1: సావిత్రిబాయి ఫూలే పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.
- జనవరి 12: డల్ హౌసీ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అయ్యాడు.
- జనవరి 24: జేమ్స్ మార్షల్ కాలిఫోర్నియాలో బంగారం కనుగొన్నాడు.
- ఫిబ్రవరి 21: కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ లు లండన్‌లో తమ కమ్యూనిస్టు మానిఫెస్టోను ప్రచురించారు.
- మార్చి 15: హంగరీ విప్లవం
- మార్చి 18: జర్మను విప్లవం కారణంగా కింగ్ ఫ్రెడరిక్విలియం ఒక లిబరల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు
- ఏప్రిల్ 18: రెండవ ఆంగ్లో-సిక్ఖు యుద్ధం మొదలైంది.
- జూన్ 17: ప్రాగ్‌లో కార్మికుల తిరుగుబాటును అణచేందుకు ఆస్ట్రియా సైన్యం కాల్పులు జరిపింది
- సెప్టెంబరు 12: స్విట్జర్లండులో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో ఆ దేశం ఒక ఫెడరల్ రిపబ్లిక్‌గా అవతరించింది. ఐరోపాలో తొట్టతొలి ఆధునిక గణతంత్ర రాజ్యం అది.
- నవంబరు 3: నెదర్లాండ్స్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో అక్కడి రాచరికపు అధికారానికి తీవ్రంగా కోత పడింది.
- నవంబరు 4: ప్రజా విప్లవం తరువాత రెండవ ఫ్రెంచి రిపబ్లిక్ అమల్లోకి వచ్చింది
- తేదీ తెలియదు: అహ్మదాబాదులో మొదటి ఇంగ్లీషు భాషా పాఠశాల మొదలైంది.
- తేదీ తెలియదు: జాన్ ఎలియట్ డ్రింక్‌వాటర్ బెథూన్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా నియమితుడయ్యాడు.
- తేదీ తెలియదు: కలివికోడిని మొదటిసారి బ్రిటిష్ సైనిక వైద్యాధికారి థామస్ జి జెర్ధాన్ తొలిసారి గుర్తించాడు
- తేదీ తెలియదు: బ్రిటిష్ ఇండియాలో గవర్నర్ జనరల్ గా లార్డు హార్డింజి పరిపాలన ముగిసింది
జననాలు
మార్చు- ఏప్రిల్ 16: కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేశాడు. (మ.1919)
- ఏప్రిల్ 29: రాజా రవివర్మ, భారతీయ చిత్రకారుడు. (మ. 1906)
- నవంబర్ 10: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1925)
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 23: జాన్ క్విన్సీ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.