1708 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1705 1706 1707 - 1708 - 1709 1710 1711
దశాబ్దాలు: 1680లు 1690లు - 1700లు - 1710లు 1720లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలుసవరించు

 • జనవరి 1: స్వీడన్‌కు చెందిన చార్లెస్ XII 40,000 మంది సైనికులతో గడ్డకట్టిన విస్తులా నదిని దాటి రష్యాపై దాడి చేశాడు.
 • జనవరి 12: షాహు I భారత ఉపఖండంలోని మరాఠా సామ్రాజ్యానికి ఐదవ ఛత్రపతి అయ్యాడు.
 • ఏప్రిల్ 1: మొగలాయిల పాలనలో ఉన్న వరంగల్ కోటపై సర్వాయి పాపన్న దాడి.
 • ఏప్రిల్ 9: ఒట్టోమన్ యువరాణి, సుల్తాన్ ముస్తఫా II కుమార్తె అయిన ఎమీన్ సుల్తాన్ గ్రాండ్ విజియర్ కోరులు అలీ పాషాను వివాహం చేసుకుంది.
 • ఏప్రిల్ 28: జపాన్లోని క్యోటోలో గ్రేట్ హోయి అగ్నిప్రమాదం సంభవించి, ఇంపీరియల్ ప్యాలెస్ నూ, పాత రాజధానిలో ఎక్కువ భాగాన్నీ నాశనం చేసింది.
 • ఆగష్టు 3: ట్రెనాన్ యుద్ధంలో, హాబ్స్‌బర్గ్స్ యొక్క ఇంపీరియల్ ఆర్మీకి చెందిన 8,000 మంది సైనికులు ఫ్రాన్సిస్ II రాకాక్జీ యొక్క 15,000 హంగేరియన్ కురుక్ దళాలపై విజయం సాధించారు.
 • ఆగస్టు 18: స్పానిష్ వారసత్వ యుద్ధం: మెనోర్కాను బ్రిటిష్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. [1]
 • ఆగస్టు 23: మీడింగు పంహీబాకు మణిపూర్ రాజుగా పట్టాభిషేకం జరిగింది.
 • సెప్టెంబరు 3: లచ్మణ్ దేవ్, గురు గోవింద్ సింగ్ను కలిసాడు. ఆ తరువాత సిక్ఖు మతం స్వీకరించి.[2] బందా సింగ్ బహదూర్గా మారాడు.
 • అక్టోబర్ 12: స్పానిష్ వారసత్వ యుద్ధం : రెండు నెలల ముట్టడి తరువాత బ్రిటిష్ దళాలు లిల్లెను పట్టుకున్నాయి, అయినప్పటికీ కోట మరో ఆరు వారాల పాటు ఎదిరించి నిలబడింది. [3]
 • తేదీ తెలియదు
  • స్వీడిష్ దాడికి భయపడి, రష్యన్లు ఎస్టోనియాలోని టార్టు నగరాన్ని పేల్చివేశారు.
  • మసూరియా జనాభాలో మూడోవంతు ప్లేగుతో మరణించారు.
  • కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ( గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ సమ్మతితో) ఈస్ట్ ఇండీస్‌తోటి, ఈస్ట్ ఇండీస్‌కు ఇటీవల స్థాపించబడిన ఇంగ్లీష్ ట్రేడింగ్ కంపెనీ తోటీ విలీనమై, యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్రేడింగ్‌ టు ది ఈస్ట్ ఇండీస్‌ ఏర్పాటైంది. దీన్నే గౌరవనీయ ఈస్ట్ ఇండియా కంపెనీగా పిలుస్తారు. [4]
  • ఇంగ్లీషులో "కామన్ ఎరా" అనే మాటను మొదటిగా వాడారు.

జననాలుసవరించు

తేదీవివరాలు తెలియనివిసవరించు

మరణాలుసవరించు

 
గురు గోబింద్ సింగ్

తేదీవివరాలు తెలియనివిసవరించు

 • ఖల్సా పూర్వీకులైన ఐదు ఆరాధనీయులలో ఒకడైన భాయి ధరం సింఘ్ (జ.1606)

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

 1. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. p. 292. ISBN 0-304-35730-8.
 2. Ganda Singh. "Banda Singh Bahadur". Encyclopaedia of Sikhism. Punjabi University Patiala. Retrieved 27 January 2014.
 3. Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 205–206. ISBN 0-7126-5616-2.
 4. Landow, George P. (2010). "The British East India Company — the Company that Owned a Nation (or Two)". The Victorian Web. Retrieved 2011-11-22.
"https://te.wikipedia.org/w/index.php?title=1708&oldid=3685327" నుండి వెలికితీశారు