సత్తెకాలపు సత్తెయ్య
సత్తెకాలపు సత్తెయ్య , తెలుగు చలన చిత్రo ,1969 జూన్ 19 నవిడుదల. కె.బాలచందర్ దర్శకత్వంలో, ప్రసాద్ ఆర్ట్ నిర్మించిన ఈ చిత్రంలో చలం, శోభన్ బాబు, రాజశ్రీ, రోజా రమణి మున్నగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎం. ఎస్. విశ్వనాధన్ అందించారు.
సత్తెకాలపు సత్తెయ్య (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాలచందర్ |
---|---|
నిర్మాణం | వి.కె. ప్రసాద్ |
తారాగణం | చలం, రాజశ్రీ, విజయలలిత, గుమ్మడి వెంకటేశ్వరరావు, బేబీ రోజారమణి |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాధం |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రోజారమణి
- చలం
- శోభన్ బాబు
- గుమ్మడి
- రాజశ్రీ
- రావి కొండలరావు
- విజయలలిత
- ఎస్.వరలక్ష్మి
- హేమలత
- ఋష్యేంద్రమణి
- ఆనంద్ మోహన్
- కూచిభొట్ల శివరామకృష్ణయ్య
- నగేష్
- మనోరమ
కథ
మార్చుఅయినవాళ్లు ఎవ్వరూలేని అమాయకపు ఒంటరి వ్యక్తి సత్తెయ్య. క్యారేజీలు అందిస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనిలాగే క్యారేజీలు అందించే మరో యువతి సుబ్బులు (విజయలలిత). ఆ ఊరిలోని కోటీశ్వరుడు, వ్యాపారవేత్త, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసరావు (గుమ్మడి). అతని భార్య స్నేహలతాదేవి (ఎస్ వరలక్ష్మి). వారి ఏకైక సంతానం శాంతి (రోజారమణి). ఆ ఊరి పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ (శోభన్‌బాబు), అతని తల్లి శాంతమ్మ (హేమలత). క్యారేజీలు మోసుకునే సత్తెయ్యను శాంతమ్మ కన్నకొడుకులా ఆదరిస్తుంటుంది. అదే వూరిలో మంచితనం, అందం కలబోసిన కాలేజీ విద్యార్థిని రాధ (రాజశ్రీ). కాలేజీ ఫీజు కట్టమని రాధ ఇచ్చిన డబ్బులు సత్తెయ్య అమాయకంగా పోగొడతాడు. ఆ సంఘటన ద్వారా రాధకు, ప్రసాద్‌కు పరిచయం కలిగి ప్రేమగా మారుతుంది. తమ తమ కార్యక్రమాలలో బిజీగా వున్న తల్లిదండ్రులతో సమయం గడిపే అవకాశం లేక, ఇంట్లో నౌకర్లు, అమ్మమ్మ (ఋషేంద్రమణి)తో ఉండే శాంతి ఒంటరిగా బాధపడుతుంటుంది. మీటింగ్‌లోవున్న తల్లిని కలుసుకోవాలని వెళ్ని శాంతి జనంలో తప్పిపోయి సత్తెయ్య గుడిసెకు చేరుకుంటుంది. అతని అమాయకత్వం చూసి అతనిపై అభిమానం పెంచుకుంటుంది. తన తల్లితండ్రులను కలిశాక కూడా సత్తెయ్య, శాంతిని ఆమె స్కూలువద్ద కలుసుకోవటం, వారి వాత్సల్యం అభివృద్ధి చెందటం జరుగుతుంది. ప్రసాద్‌కు పెళ్లి కుదిరిన సందర్భంగా శాంతమ్మ ఇచ్చిన మిఠాయిలో ఎవరో దొంగ విషం కలపటం, అది తెలియక శాంతికి సత్తెయ్య ఇవ్వటంతో.. శాంతి ఆరోగ్యం విషమిస్తుంది. దీంతో శాంతిని కలుసుకోవద్దని ఆమె తల్లితండ్రులు శాసిస్తారు. శాంతి కోరినట్టు పోలీసు అయి శాంతిని కలుసుకోవాలని సత్తెయ్య ప్రయత్నాలు చేయటం, ఒక దొంగల ముఠాను పట్టిచ్చినందుకు అతనికి పోలీసుగా ప్రభుత్వం ఉత్తర్వు ఇవ్వటం, అ డ్రెస్‌తో శాంతిని చూడటానికి వెళ్లిన సత్తెయ్య పిలుపు, పాటవిని శాంత కోలుకోవటం, సుబ్బులుతో సత్తెయ్యకు వివాహం జరగటంతో చిత్రం ముగుస్తుంది[1].
పాటలు
మార్చు- అలాగా చూడు ఇలాగ చూడు బలే మంచి శాంతమ్మ[2] - పిఠాపురం - రచన:శ్రీశ్రీ
- ఈ ఇంటి పంటవు ..ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు (బిట్) - పి.బి. శ్రీనివాస్, రచన: ఆత్రేయ
- నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి, చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి- ఘంటసాల,సుశీల - రచన: ఆరుద్ర
- ప్రజలంతా కొలిచేటి భగవంతుడు నివసించే పసిపిల్లల - ఎస్.పి. బాలు, బి. వసంత , రచన: రాజశ్రీ
- ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లి పువ్వు - పి.బి. శ్రీనివాస్, రచన: ఆత్రేయ
- పదహారేళ్ళ వయసే వయసు, పి సుశీల బృందం , రచన: ఆరుద్ర.
రీమేక్స్
మార్చుఈ సినిమాను కె.బాలచందర్ తమిళంలో జెమినీ గణేషన్, నాగేష్, రాజశ్రీ, మణిమాల, విజయలలిత, సచ్చు, కాంబినేషన్‌లో పతమ్ పాశలీ పేరుతో నిర్మించాడు. ఈ సినిమా 1970, ఏప్రిల్ 11న విడుదలైంది.
ఇదే సినిమా 1970లోనే ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో హిందీలో పద్మిని, మహమూద్, వినోద్‌ఖన్నా, భారతి, రమేష్‌దేవ్, శ్యామా, మనోరమ, టి జయశ్రీల కాంబినేషన్‌లో మస్తానా పేరుతో నిర్మించబడింది.
1980లో కన్నడంలో మంకుతిమ్మగా హెచ్‌ఆర్ భార్గవ దర్శకత్వంలో రాజన్- నాగేంద్ర సంగీతంతో నిర్మాత ద్వారకేష్ రూపొందించి, దానిలో ఓ పాత్ర కూడా పోషించాడు. శ్రీనాథ్, మంజుల, పద్మప్రియ, బేబీ లక్ష్మి నటించారు. ప్రభాకరరెడ్డి అతిథి నటుడిగా నటించాడు[1].
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (8 June 2019). "ఫ్లాష్ బ్యాక్@50 సత్తెకాలపు సత్తెయ్య". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 3 ఆగస్టు 2019. Retrieved 3 August 2019.
- ↑ సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.