సత్యాలపాడు

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా గ్రామం

సత్యాలపాడు, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం ఇది సముద్రమట్టానికి 73 మీ.ఎత్తులో ఉంది.

సత్యాలపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం గంపలగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 403
ఎస్.టి.డి కోడ్ 08673

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

పెనుగొలను, ఊటుకూరు నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేన్: విజయవాడ 60 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 2017, జనవరి-3 నుండి 7 వరకు నిర్వహించు 104వ జాతీయ సైన్స్ సమావేశాలలో పాల్గొనేటందుకు, ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న వేముల వంశీ అను విద్యార్థి ఎంపికైనాడు. [4]

గ్రామ పంచాయతీ మార్చు

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పి.కోటేశ్వరరావు, ఉప సర్పంచిగా ఎన్నికైనాడు. [3]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయం వద్ద 2014, మే-12 సోమవారం (వైశాఖ శుక్ల త్రయోదశి) నాడు, ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవం వేడుకగా నిర్వహించారు. పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకొని ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆలయంలో గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామివార్ల శాంతి కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటా బంధుమిత్రుల సందడి నెలకొన్నది. ఆలయం వద్ద భక్తులు కిటకిటలాడినారు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

రాళ్ళబండి వెంకటప్రసాదరాజు మార్చు

కవితా ప్రసాదుగా తెలుగువారందరికీ చిరపరిచితుడైన వీరు, ఈ గ్రామంలోనే, తెలుగు భాషా పండితులైన రాళ్ళబండి కోటేశ్వరరాజుగారి ప్రథమ సంతానంగా జన్మించారు. ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులుగానూ, తెలంగాణా రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖ అదనపు డైరెక్టరుగానూ పనిచేసారు. తెలుగు పద్యానికి పంచెకట్టినట్లున్న ఆయన అవధాన కళా కిరీటి. వీరు 2015, మార్చి-15వ తేదీన దివికేగినారు. [2]

మూలాలు మార్చు