రెంటచింతల
రెంటచింతల పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మాచర్ల నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4234 ఇళ్లతో, 16523 జనాభాతో 2170 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8426, ఆడవారి సంఖ్య 8097. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2790 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1370. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589833.[1]
రెంటచింతల | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°33′8.5554″N 79°33′10.3766″E / 16.552376500°N 79.552882389°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | రెంటచింతల |
విస్తీర్ణం | 21.7 కి.మీ2 (8.4 చ. మై) |
జనాభా (2011) | 16,523 |
• జనసాంద్రత | 760/కి.మీ2 (2,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 8,426 |
• స్త్రీలు | 8,097 |
• లింగ నిష్పత్తి | 961 |
• నివాసాలు | 4,234 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 522421 |
2011 జనగణన కోడ్ | 589833 |
సమీప గ్రామాలు
మార్చురెంటాల 3 కి .మీ పాలువాయి 3 కి.మీ, గోలి 3 కి.మీ, పసర్లపాడు 4 కి.మీ, మల్లవరం 4 కి.మీ, జెట్టిపాలెం 5 కి.మీ.
విశేషాలు
మార్చువాతావరణ నమోదు కేంద్రం - రెంటచింతల గ్రామం ఉష్ణోగ్రత కేంద్రం ఉంది. ఈ కేంద్రాన్ని తొలుత ఇక్కడ, 1936, ఫిబ్రవరి-21న ఏర్పాటుచేసారు. స్థానిక సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలలో, పాఠశాలవారు విరళణంగా ఇచ్చిన స్థలంలో, నూతనంగా ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఈ కేంద్రం నిర్మాణానికి, 2016, జనవరి-7వ తేదీనాడు శంకుస్థాపన జరిగింది. ఈ కేంద్రాన్ని, 2016, జనవరి-14న ప్రారంభించారు. ఈ కేంద్రంలో, శాటలైట్ ద్వారా గంటగంటకూ, ఉష్ణోగ్రత, వర్షపాతం నమోదవుతవి. ఈ కేంద్రంద్వారా వివరాలను ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. అన్నదాతలు ఈ వాతావరణ కేంద్రంలో పేర్లు రిజిస్టరు చేసుకుంటే, ప్రతి మంగళవారం, శుక్రవారం, వారి చరవాణి (సెల్ ఫోన్) లో వాతావరణ వివరాలు పంపిస్తారు. ఈ కేంద్రంలో నమోదయిన వివరాల ప్రకారం, 1964, సెప్టెంబరు-29న రెంటచింతలలో అత్యధికంగా, 227 మి.మీ.వర్షపాతం నమోదయింది.
నరిశెట్టి లిపిక - రెంటచింతల ప్రాంతానికి చెందిన నరిశెట్టి లిపిక, తల్లిదండ్రులతోపాటు అమెరికాలో ఉంటూ అక్కడే చదువుకొంటుంది. ఆమె ఇటీవల అమెరికాలో నిర్వహించిన స్పెల్లింగుల పోటీలలో విశేషప్రతిభ చూపినది. 2015, జూన్-17న గుంటూరు వచ్చిన ఆమెను కలెక్టర్ శ్రీ కాంతీలాల్ దండే ప్రశంసించారు.
గాంధీజీ అడుగడిన రెంటచింతల - పూజ్య బాపూజీ పాదస్పర్శతో పులకించిన పల్నాట ఏకైక పల్లె, రెంటచింతల. గాంధీజీ ఈ గ్రామములో 1929, ఏప్రిల్-21న పర్యటించారు. విదేశీవస్త్ర బహిష్కరణ చేయాలని స్థానికులను కోరితే, వేలాదిమంది వస్త్రాలను నడివీధిలో వేసి, పెట్రోలుపోసి తగులబెట్టినారు. వై.ఆర్.ఎస్.ఉన్నత పాఠశాల ప్రాంగణంలో, తాటాకు పందిరివేసినారు. ఖద్దరు ఉద్యమంలో భాగంగా, జాతిపిత సుమారు 500 రాట్నాలతో రోజంతా నూలు నేసినన అరుదైన సన్నివేశం, రెంటచింతల గ్రామస్థులకు ఒక తీపి గురుతుగా నిలిచిపోయింది.
గణాంకాలు
మార్చు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 15,707. ఇందులో పురుషుల సంఖ్య 8,110, స్త్రీల సంఖ్య 7,597, గ్రామంలో నివాస గృహాలు 3,459 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 2,170 హెక్టారులు
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల గురజాలలోను, ఇంజనీరింగ్ కళాశాల మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
విద్యాసంస్థల జాబితా
మార్చు- వై.ఆర్.ఎస్.ఉన్నత పాఠశాల: ప్రస్తుత ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి గొల్లపల్లి నాగేశ్వరరావు, ఈ పాఠశాలలో 1968 నుండి 1973 వరకు, ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు, తెలుగు మాధ్యమంలోనే విద్యనభ్యసించారు.
- కస్తూర్బా బాలికల పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు - 3.
- సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాల.
- రామకృష్ణ గురుకుల పాఠశాల:- ఈ పాఠశాల ఆవరణలో 2016, జనవరి-31న, ఒక వృద్ధాశ్రమం, ఒక గోశాల ప్రారంభించారు.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చురెంటచింతలలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ఒకపశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో 5 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.
పారిశుధ్యం
మార్చుగ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చురెంటచింతలలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది.సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.రైల్వే స్టేషన్ ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.ఈ ఊరికి రైల్వే స్టేషను సదుపాయం ఉంది. (గుంటూరు- మాచర్ల రైలు మార్గం)
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామములోని శాఖా గ్రంథాలయాన్ని తొలుత 12 సంవత్సరాల క్రితం స్థానికంగా ఒక అద్దె భవనంలో ఐదువేల పుస్తకాల్తో ప్రారంభించారు. దీనికితోడు నిత్యం దినపత్రికలు రావడంతో విద్యార్థులకు, వృద్ధులకు, మహిళలకు, విశ్రాంత ఉద్యోగులకు విజ్ఞానాన్ని పెంచుకునేటందుకు చాలా ఉపయోగంగా ఉండేది. అనంతరం ఈ భవనానికి అద్దె చెల్లించకపోవడంతో, భవనం ఖాళీచేసి పుస్తకాలను పంచాయతీ భవనంలోనికి చేర్చి, గ్రంథాలయాన్ని మూసివేసినారు.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చురెంటచింతలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 33 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 34 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 255 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 168 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూ క్షేత్రం: 1680 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 1136 హెక్టార్లు
- నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 544 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చురెంటచింతలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది
- కాలువలు: 420 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 124 హెక్టార్లు
గ్రామములోని మౌలిక సదుపాయాలు
మార్చుప్రాథమిక ఆరోగ్య కేంద్రం
మార్చుఅతిదూతల వృద్ధాశ్రమం
మార్చుఅంగనవాడీ కేంద్రాలు:
మార్చుఈ గ్రామాలో మొత్తం 7 అంగనవాడీ కేంద్రాలు ఉన్నాయి.
త్రాగునీటి సౌకర్యం
మార్చుఈ గ్రామములోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ మరియూ గ్రామంలోని 7 అంగనవాడీ కేంద్రాలలోనూ ఉన్న మొత్తం 500 మంది విద్యార్థులకు ఉచితంగా శుద్ధిజలం అందించడానికి, ఎం.పి.టి.సి.సభ్యులు శ్రీ మర్రి రాజ్ కుమార్ నిర్ణయించి అమలుపరచుచున్నారు.
బ్యాంకులు
మార్చుదర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం:- రెంటచింతల గ్రామంలోని సుబ్బయ్యతోటలో నెలకొన్న ఈ దేవాలయంలో స్వామివారి ఉత్సవాలు, 2014, మార్చి-20, గురువారం నాడు, ఘనంగా జరిగినవి. భక్తులు స్వామివారిని దర్శించుకొని, పూజలు నిర్వహించారు. మద్యాహ్నం శాంతికల్యాణం, రాత్రికి స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.
- శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం.
- శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2016, మే-20వ తేదీ శుక్రవారం, వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు, ఆలయ 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఊదయాన్నే దేవతామూర్తులకు రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రికి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నసమారాధన ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.
- శ్రీ శివరామ మందిరం.
- శ్రీ చొడేశ్వరీ అమ్మ వారి ఆలయం:- గ్రామములోని రెవెన్యూ కార్యాలయం సమీపంలోని ఈ ఆలయ నవమ వార్షికోత్సవం, 2017, జూన్19వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాతం, వేదపారయణ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, శాంతిహోమం, బోనాల సమర్పణ, సహస్ర నామార్చన నిర్వహించారు. భక్తులు వేకువఝాముననే అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉదయం పది గంటలకు మహిళలు వీధులలో కలియదిరుగుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామంలో మంగళ వాయిద్యాలు మార్మ్రోగినవి. సహస్ర నామార్చన అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
- శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.
- గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ ఆలయం:- ఈ ఆలయం స్థానిక మండల పరిషత్తు కార్యాలయం ఎదురుగా ఉంది.
- శ్రీ గంగమ్మ తల్లి ఆలయం:- స్థానిక మండల పరిషత్తు కార్యాలయ సమీపంలో ఉన్న ఈ ఆలయంలో 2015, మార్చి-8వ తేదీ ఆదివారం నాడు, ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి, అమ్మవారిని దర్శించుకొన్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగులతో సుందరంగా అలంకరించారు. రాత్రి ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.
- శ్రీ అభయవీరాంజనేయస్వామివారి విగ్రహo:- స్థానిక రేగులమాన్యం కాలనీలో, 2017, జూన్-8వతేదీ గురువారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, భక్తుల సమక్షంలో, శ్రీ అభయవీరాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. 7వతేదీ బుధవారం రాత్రి, ప్రతిష్ఠించనున్న స్వామివారి విగ్రహానికి గ్రామోత్సవం నిర్వహించారు. గురువారం మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
ప్రధాన పంటలు
మార్చుప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు