సనాల్ జార్జ్

కేరళకు చెందిన సౌండ్ డిజైనర్, ప్రొడక్షన్ సౌండ్ మిక్సర్

సనాల్ జార్జ్ కేరళకు చెందిన సౌండ్ డిజైనర్, ప్రొడక్షన్ సౌండ్ మిక్సర్. వాకింగ్ విత్ ది విండ్ అనే ఫీచర్ ఫిల్మ్‌కి ఉత్తమ సౌండ్ డిజైన్‌ విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు.[1] దక్షిణ కొరియాలోని బుసాన్‌లోని బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా 2013లో ఏషియన్ ఫిల్మ్ అకాడమీ ఫెలోషిప్ కూడా లభించింది. మలయాళం షార్ట్ ఫిల్మ్ చావెర్ కు కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డు 2016 లభించింది.[2]

సనాల్ జార్జ్
వృత్తిసౌండ్ డిజైనర్, ప్రొడక్షన్ సౌండ్ మిక్సర్
క్రియాశీల సంవత్సరాలు2010 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిసి.జె. అల్విత (వి. 2017)
పిల్లలు1

సనాల్ జార్జ్ కేరళ రాష్ట్రం, కాలికట్ సమీపంలోని పెరువన్నముళికి చెందినవాడు.[3] పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి సౌండ్ రికార్డింగ్ డిజైన్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తిచేశాడు.[4] అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ, రెసూల్ పూకుట్టి ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లను అందుకున్నాడు.[5][6]

సినిమారంగం

మార్చు

2010లో శశాంత్ షా తీసిన 'ఛలో ఢిల్లీ'లో అసిస్టెంట్ సౌండ్ మిక్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. సౌండ్ డిజైనర్, ప్రొడక్షన్ సౌండ్ మిక్సర్‌గా ఫీచర్ ఫిల్మ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ ప్రాజెక్ట్‌లలో పనిచేశాడు. అమీర్ ఖాన్ నటించిన దంగల్‌ సినిమాకు సుభదీప్ మిత్రకు అసిస్టెంట్ సౌండ్ రికార్డిస్ట్‌గా పనిచేశాడు. 2017 సంవత్సరంలో విడుదలైన వాకింగ్ విత్ ది విండ్ అనే లడఖీ భాషా సినిమాకి ఉత్తమ సౌండ్ డిజైన్‌ విభాగంలో 65వ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు.[1][3]

సినిమాలు

మార్చు
సినిమా పేరు సంవత్సరం భాష ఇతర వివరాలు మూలాలు
ఛలో ఢిల్లీ 2011 హిందీ హిందీ-ఇంగ్లీష్ ద్విభాషా

మొదటి అసిస్టెంట్ సౌండ్ రికార్డిస్ట్

[3][7]
చప్పా కురిష్ 2011 మలయాళం సౌండ్ ఎఫెక్ట్స్ రికార్డింగ్ [7]
అస్తు - అలా ఉండండి 2013 మరాఠీ ఏడిఆర్ సూపర్‌వైజర్ [7]
బంగిస్థాన్ 2015 హిందీ అసిస్టెంట్ సౌండ్ మిక్సర్ [7]
ఫితూర్ 2016 హిందీ అసిస్టెంట్ సౌండ్ మిక్సర్ [7]
శీష్ మహల్ 2016 తెలుగు సౌండ్ డిజైనర్ [7]
దంగల్ 2016 హిందీ అసిస్టెంట్ సౌండ్ రికార్డిస్ట్ [3][7]
గాలితో నడవడం 2017 లడఖీ బెస్ట్ సౌండ్ డిజైన్ విబాగంలో 65వ జాతీయ చలనచిత్ర అవార్డ్సులు [1]
హైజాక్ 2018 హిందీ అదనపు సౌండ్ రికార్డిస్ట్ [7]
వివాహ అతిథి 2018 ఆంగ్ల రెండవ యూనిట్ సౌండ్ రికార్డిస్ట్ [7]
సైలెన్స్ వెధవ 2018 ఉర్దూ సౌండ్ డిజైనర్ [7]
గుల్ మకై 2018 హిందీ సౌండ్ డిజైనర్ [7]
గాంధీ హత్య 2019 ఆంగ్ల ఉత్పత్తి సౌండ్ మిక్సర్ [7]
రోమ్ రోమ్ మెయిన్ 2019 హిందీ ఉత్పత్తి సౌండ్ మిక్సర్ [7]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "National Award Winners 2018: Here's The List Of Winners". HuffPost India (in ఇంగ్లీష్). 2018-04-13. Retrieved 2023-05-12.
  2. "Pokkuveyil adjudged best TV serial". The Hindu. Special Correspondent. 2017-10-21. ISSN 0971-751X. Retrieved 2023-05-12.{{cite news}}: CS1 maint: others (link)
  3. 3.0 3.1 3.2 3.3 "Malayali hands behind the best Ladakhi film". OnManorama. Retrieved 2023-05-12.
  4. "Sanal George". IMDb. Retrieved 2023-05-12.
  5. M, Athira (2018-04-26). "On the same wavelength". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-05-12.
  6. "Resul Pookutty announces scholarships for 3 FTII students". dailybhaskar (in ఇంగ్లీష్). 2011-06-19. Retrieved 2023-05-12.
  7. 7.00 7.01 7.02 7.03 7.04 7.05 7.06 7.07 7.08 7.09 7.10 7.11 7.12 "Sanal George". IMDb. Retrieved 2023-05-12.