సరస్వతీ ఆకు

సరస్వతీ ఆకు (Centella asiatica) అంబెల్లిఫెరె కుటుంబానికి చెందిన ఒక ఔషధ మొక్క. ఇవి చెమ్మ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో, నీటివనరులకు దగ్గరలో పెరుగుతాయి. సరస్వతీ ఆకును 'మండూకపర్ణి' యని, సెంటెల్లా (Centella) యని వ్యవహరిస్తారు. 'సంబరేణు' అను వేరొక మొక్క ఇలాంటి కలిగియుంటాయి. దీనిని 'బ్రహ్మీ' యని, బకోపా (Bacopa) యని వ్యవహరిస్తారు.

సరస్వతీ ఆకు
Starr 020803-0094 Centella asiatica.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. asiatica
Binomial name
Centella asiatica

లక్షణాలుEdit

  • కణుపుల వద్ద అబ్బురపు వేళ్ళున్న సాగిలపడి పెరిగే బహువార్షిక గుల్మము.
  • మూత్రపిండాకారంలో గాని, ఇంచుమించు గుండ్రంగా గాని ఉన్న దూరస్థ దంతపుటంచుతో ఉన్న సరళ పత్రాలు. ఇవి పొడవైన కాడలు కలిగివుంటాయి.
  • గ్రీవస్థ గుచ్ఛాలలో ఏర్పడిన ఎరుపు రంగుతో కూడిన తెల్లని పుష్పాలు. ఇవి 4-5 ఒకే కాడపై ఉంటాయి.
  • గట్లుగాడులు గల క్రీమోకార్ప్ ఫలం.

వైద్యంలో ఉపయోగాలుEdit

ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మీమాత్రలు, బ్రాహ్మీఘృతము, సరస్వతారిష్ఠము, బ్రాహ్మరసాయనము, బ్రాహ్మీతైలము మొదలగు ఆయుర్వేద ఔషధాలు తయారుచేస్తారు. ఇవి నరాలకు బలాన్ని కలుగజేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఉన్మాదము, అపస్మారము మొదలగు మానసిన వ్యాధులలో ప్రయోజనకారి. జ్ఞాపక శక్తిని పెంచడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. విషయ గ్రహణం, విషయ ధారణ శక్తులను ద్విగుణీకృతం చేస్తుంది. ఒక కప్పు పాలతో చెంచా సరస్వతీ ఆకుల చూర్ణాన్ని కలిపి రోజూ రెండుపూటలా తాగాలి. సరస్వతీ ఆకు రసం కొద్దిగా పంచదారతో కలిపి నిత్యం సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి పొందుతుంది.నిత్యం కొద్దిగా వాముపొడిని, నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.నిత్యం కరివేపాకు ఆకులను లేదా పొడిని కొద్దిగా సేవిస్తూ వుంటే మధుమేహం కలవారికి ఉపయుక్తంగా వుంటుంది. మొక్క సమూలం నీడలో ఎండించి, పాలతో తీసుకుంటే, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. దేశీయ వైద్యంలో ఈ మొక్క పత్రాలను ఉపయోగిస్తారు. వీటిని మజ్జిగలో మూడు రోజులు నానబెట్టి (కొద్దిగా ఉప్పు వేసి) ఎండించి పొడిచేసి టానిక్ లాగా పిల్లలకు ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా బాలింతలకు ఇస్తే రక్తహీనత అరికట్టి, రక్తం వృద్ధి చెందుతుందని అంటారు. చర్మవ్యాధులకు, నరాల బలహీనతకు కూడా వాడుతారు. గొంతు బొంగురుగా ఉన్న పిల్లలకు, మొక్క పొడి చేసి, తేనెలో కలిపి ఇస్తుంటే, క్రమేపి స్వరపేటిక వృద్ధి చెంది మంచి కంఠ స్వరం కలుగుతుందని అంటారు.

సరస్వతీ ఆకులను వాడే విధానంEdit

సరస్వతీ ఆకులను నీడలో ఎండబెట్టాలి. అయిదు బాదంపప్పులు, రెండు మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి. తరువాత దానిని పలుచని వస్త్రంతో వడకట్టి, తగినంత తేనె కలిపి 40 రోజులపాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు. నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంది.

చిత్రమాలికEdit

మూలాలుEdit

  • ఔషధ మొక్కల సాగు - సావకాశాలు: అటవీ శాఖ మరియు శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మశీ, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2004.

ఇవి కూడా చూడండిEdit

బయటి లింకులుEdit