నల్ల మిరియాలు (Black pepper) (Piper nigrum) పుష్పించే మొక్కలలో పొదలుగా పెరిగే మొక్క. ఇవి పైపరేసి కుటుంబంలో పైపర్ ప్రజాతికి చెందినవి. ఇవి ప్రాచీనకాలం నుండి భారతదేశంలో మసాలా దినుసుగా ఉపయోగపడుతుంది.

నల్ల మిరియాలు
Pepper plant with immature peppercorns
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
P. nigrum
Binomial name
Piper nigrum
ఈ చిత్రం గురించి-14వ శతాబ్దానికి చెందిన ఈ పెయింటింగ్ దక్షిణ భారత దేశంలో కోలియమ్ లో ఒకప్పుడు పండించిన మిరియాల తోటలకు సంబంధించింది. వీటిని ఒకప్పుడు యూరోపియన్లు చాలా ఎక్కువగా దిగుమతి చేసుకునేవారు

ప్రస్తావన

మార్చు

సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియం అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పిచెస్ అన్నారు. ఒకప్పుడు భారత దేశంలో అత్యధికంగా పండేవి. ప్రస్తుతం ఆస్థానాన్ని వియత్నాం స్వంతం చేసు కున్నది. ఆహారాల్లో రుచిని పెంచడానికి మిరియాలను వాడతారు. దీంతో ఆహారానికి మంచి రుచి వాసన వస్తుంది. అంతే కాదు మిరియాలను ముఖ్యంగా ఔషధంగా ఎక్కువగా వాడతారు. ఈ పద్ధతి మన దేశంలోనే ఎక్కువ. జలుబుకు, దగ్గుకు, గొంతు గర గరకు, ముక్కు దిబ్బడకు, అజీర్తికి ఇలా అనేక వ్యాధులకు మిరియాలను వాడతారు. ప్రస్తుతం మిరియాల వాడకంలో అమెరికన్లదే మొదటి స్థానం. మిరియాలను నూర్చే టప్పుడు వెలువడే పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని ఒక దిండుగా వాడతారు. దాని వలన తలనొప్పి వంటి దీర్ఘ వ్యాధులు దూరం అవుతాయి. సాధారణంగా మిరియాలంటే నల్లటి మిరియాలే తెలుసు. కాని వాటిలో తెల్లనివి, ఆకుపచ్చనివి, ఎర్రనివి అరుదుగా గులాబి రంగువి కూడా వుంటాయి. మిరియాలకు పుట్టిల్లు మనదేశంలో మలబార్ ప్రాంతమైనా చాల ప్రాంతాలలో వీటిని పండిస్తున్నారు. పోషకాల విషయానికొస్తే చిట్టి మిరియాలలో పీచు పదార్థం, ఐరన్, మాంగనీసు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో దొరుకు తాయి. అన్ని సుగంధ ద్రవ్యలకన్నా అత్యధిక విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. పలురకాల భూములు దీని సాగుకు అనుకూలమైనప్పటికీ 4.5-6.0 ఉదజని సూచికగల ఎర్ర లేటరైట్ నేలలు ఎక్కువ అనుకూలం. మిరియాలు తీగ జాతిపంట కనుక తీగలు పాకటానికి అనువుగా నిటారుగా పెరిగే చెట్లను పెంచుకోవాలి. సిల్వర్ ఓక్ అనే చెట్టు దీనికి సిరిపోతుంది. మిరియాల మొక్కలు నాటడానికి మూడేళ్లు ముందుగానే 2.5 - 3 మీటర్ల దూరంలో ఆధారపు చెట్లను నాటుకోవాలి. సాధారణంగా మిరియాల మొక్కల అడుగుభాగం నుంచి నేల బారున తీగలు పాకుతాయి. వీటిని రన్నర్ షూట్స్ అంటారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నారుమడులు పోసుకొని మే - జూన్ నెలల్లో మొక్కలు నాటుకునేందుకు అనుకూలం. మొక్కలు మూడో సంవత్సరం నుంచి క్రమబద్ధమైన దిగుబడినిస్తాయి. మార్చి నెలలో గింజలు తయారవుతాయి. సాధారణంగా ఒకటి రెండు బెర్రీలు ఎర్రగా మారితే గుత్తులను కోయాలి. గుత్తులను చిన్న కుప్పలుగా పోసుకుని కాళ్ళతో తొక్కుతూ బెర్రీలను వేరు చేయాలి. బెర్రీలను పై చర్మం ముడతలుపడి నల్లగా తయ్యారయ్యే వరకు వారం రోజులదాకా ఎండలో వుంచాలి. ఒక హెక్టారుకు సుమారుగా 600 నుంచి 800 కిలోల ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. ఈ పంటలో అధికంగా ఆశించే కుళ్ళు తెగులును నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో నీరు నిలువకుండా చూడాలి.

ఔషధ ఉపయోగాలు

మార్చు

ఇవి జీర్ణం కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఆయుర్వేదంలో కృష్ణమరీచంగా పిలిచే మిరియాలు అద్భుతమైన వంటింటి ఔషధం. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడతాయి. లాలాజలం ఊరేలా చేస్తాయి. ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాల సొంతం. శరీరంలో రక్తప్రసరణా వేగవంతం అవుతుంది. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. కండర నొప్పులు దూరం... జలుబు, దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే... గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడిచేసి.. చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని.. గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి.. తేనెతో రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి. అలాగే.. అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు.. మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాతబెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఉదరంలో వాయువులు ఏర్పడినపున్పడు... కప్పు మజ్జిగలో పావుచెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే.. ఫలితం ఉంటుంది. కండరాలు, నరాలు.. నొప్పిగా అనిపించినప్పుడు.. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకోవాలి. దప్పిక తీర్చే.... కఫం అధికంగా ఉన్నవారు.. అధికబరువుతో బాధపడుతున్నవారు.. భోజనానికి గంటముందు అరగ్రాము మిరియాలపొడిని తేనెతో తీసుకుని.. వేడినీళ్లు తాగితే.. గుణం ఉంటుంది. కొందరు అధిక దప్పికతో బాధపడుతుంటారు. ఇలాంటివారు.. కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే.. మంచిది. తరచూ జలుబు, తుమ్ములు వేధిస్తుంటే.. పసుపు, మిరియాలపొడిని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగాలి. చిగుళ్ల వాపు, నోటినుంచి నెత్తురు కారడం.. వంటి సమస్యలు బాధిస్తుంటే.. చిటికెడు రాళ్లఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి.. గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే ఉపశమనం ఉంటుంది. కీళ్లవాతంతో బాధపడే వారికి.. మిరియాలను నువ్వుల నూనెలో వేయించి.. పొడిచేసి నొప్పి ప్రాంతంలో కట్టు కడితే.. నొప్పి, వాపు తగ్గుతుంది. చర్మవ్యాధులు, గాయాలు :మిరియాల పొడిని, నెయ్యితో కలిపి రాసుకుంటే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మిరియాల పొడిని, పసుపుతో కలిపి మూడు, నాలుగు రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మొటిమలు ఇట్టే తగ్గిపోతాయి. గాయలు తగిలినపుడు మిరియాల పొడి పెడితే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తస్రావం ఆగిపోతుంది.

కడుపులో మంట ఉన్నవారు.. వేళకు ఆహారం సక్రమంగా తీసుకోనివారు.. అధిక శరీర వేడి ఉన్నవారు.. మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలోని ఘాటైన ద్రవ్యాలు మరీ వేడిని పెంచి.. సమస్య తీవ్రమయ్యే ఆస్కారముంటుంది. అందుకే ఈ సూచన. వైద్యుల సలహా ప్రకారం వాడితే.. ఏ ఇబ్బందీ ఉండదు. చిన్నపిల్లలకు పావుచెంచా.. పెద్దవాళ్లు అరచెంచా చొప్పున తీసుకోవచ్చు. మిరియాల పొడి...లాభాలు మరికొన్ని చిట్కాలు : మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు, మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు వైద్యులు.

కొన్ని రుగ్మతలకు

మార్చు
 
మిరియాలు
    • దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి.
    • దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.
    • చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే మిరియాల చారు తాగమంటున్నారు వైద్యులు. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.
    • శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది. దీనికి ఓ చిన్నగిన్నెలో నీరు తీసుకుని ఉప్పు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి మరిగించాలి. దీనికి ఒక చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి మరిగించాలి. ఈ నీటికి జీలకర్ర, ఆవాల పోపు పెట్టాలి. వీలైతే కరివేపాకు, కొత్తిమిరి, వెల్లుల్లి, అల్లం, టమోటా వేసుకోవచ్చు.
    • గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి తేనె ఒకచెంచా కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

ప్రయోగాలు, ఫలితాలు

మార్చు
 
నల్ల మిరియాలు

ముఖ్యంగా ఈ మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌లా ఉపయోగపడుతాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. విరుగుడు: నేతిలో వేయించి పొడిచేసిన మిరియాలు హాని చేయవు. పెరుగు, తేనె.. మిరియాలకు విరుగుడుగా పనిచేస్తాయి. మచ్చలకు మిరియాల మందు, pepper remidy for white skin patches (Depigmentation) : మిరియాలు తింటే కడుపులో మంటగా ఉంటుందేమోగానీ చర్మంపై వచ్చే తెల్లమచ్చల్ని తగ్గించటంలో మాత్రం ఇవి బాగా తోడ్పడుతాయని పరిశోధకులు అంటున్నారు. చర్మంపై కొన్నిచోట్ల రంగు తొలగిపోయి తెల్లని మచ్చల్లా ఏర్పడే బొల్లి వంటి మచ్చల్ని మిరియాలు తగ్గిస్తాయని లండన్‌ కింగ్స్‌ కాలేజీ పరిశోధకులు గుర్తించారు. నల్లమిరియాలకు ఆ ఘాటును అందించే 'పైపెరైన్‌' అనే రసాయనం చర్మకణాల్ని ప్రేరేపించటం ద్వారా రంగు వచ్చేలా చేస్తుందని ఈ పరిశోధనలో గుర్తించారు. భవిష్యత్తులో తెల్లమచ్చల చికిత్సపై చేపట్టే పరిశోధనలకు ఈ అధ్యయనం బాగా తోడ్పడుతుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఎలుకలపై చేపట్టిన ఈ ప్రయోగంలో తెల్లమచ్చలపై పైపెరైన్‌ను ప్రయోగించగా ఆరు వారాల్లో చర్మం ముదురు రంగులోకి మారినట్లు తేలింది. మిరియాల కషాయం ఎలా చేయాలంటే... ఒక స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా అల్లం ముద్దా, గుప్పెడు తులసాకులు ఒక కప్పు నీళ్ళలో వేసి ఐదు నిమషాలు సేపు తక్కువ మంటపై మరగనివ్వాలి. దానిని ఒక గిన్నె లోకి తీసికుని, దానిలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయమూ, సాయంత్రమూ తాగితే జలుబు తొందరగా తగ్గిపోతుంది .ఇది ఏరోజుకారోజే చేసుకోవాలి.

వంద గ్రాముల మిరియాలలో

మార్చు
  • పిండిపదార్థాలు: 49 గ్రా,
  • మాంసకృత్తులు: 10.5 గ్రా,
  • కొవ్వు: 6.8గ్రా,
  • ఖనియాలు: 4.4గ్రా,
  • పీచు: 14.9 గ్రా,
  • క్యాల్షియం: 460 మిల్లీగ్రా,
  • ఇనుము: 12.4మిల్లీగ్రా,
  • ఫాస్పరస్‌: 198 మిల్లీగ్రా,
  • కెరొటీన్లు: 1080 మిల్లీగ్రా,
  • మెగ్నీషియం: 171 మిల్లీగ్రా,
  • శక్తి: 304 కెలోరీలు

ఇవి కూడా చూడండి

మార్చు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు

(మూలం: ఈనాడు ఆదివారం: జూలై 17 2011)

  1. "Piper nigrum information from NPGS/GRIN". www.ars-grin.gov. Archived from the original on 23 డిసెంబరు 2008. Retrieved 2 March 2008.
  • నల్ల మిరియాలు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు