సర్దార్ మహల్, హైదరాబాదు లోని ఒక ప్యాలెస్. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన భార్యలలో ఒకరైన సర్దార్ బేగం కోసం 1900 లో యూరోపియన్ శైలిలో దీన్ని నిర్మించాడు. నిర్మాణం పూర్తయ్యాక దీన్ని చూసిన సర్దార్ బేగంకు అది నచ్చలేదు. దాంతో ఆమె అసలక్కడ నివసించనే లేదు. అనేక సంవత్సరాల పాటు అది అలాగే పడి ఉంది. అయితే, భవనానికి మాత్రం ఆమె పేరే వచ్చింది.

సర్దార్ మహల్
సాధారణ సమాచారం
రకంరాజ మందిరం
నిర్మాణ శైలియూరోపియన్
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1900

కొన్నాళ్ళ పాటు చార్మినార్ యునాని ఆసుపత్రి ఈ భవనంలో నడిచింది. ఆ తరువాత సిటీ సివిల్ కోర్టు ఇక్కడ పనిచేసింది. 1965 లో, దీని ఆస్తి పన్ను కట్టనందున గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సర్దార్ మహల్‌ను స్వాధీనం చేసుకుంది.[1] అప్పటి నుండి వారి సర్కిల్ కార్యాలయం ఈ భవనంలో పనిచేసింది. 2011 లో కార్పొరేషను ఈ భవనాన్ని మ్యూజియంగా మార్చింది. హెరిటేజ్ కన్సర్వేషన్ కమిటీ INTACH దీన్ని హెరిటేజ్ భవనంగా ప్రకటించింది.[2]

మూలాలుసవరించు

  1. "Sardar Mahal to house a museum, finally". The Hindu. 21 Jun 2011. Retrieved 2011-09-20.
  2. "Sardar Mahal will be a museum". The Times of India. 9 Jun 2008. Retrieved 2011-09-20.