సురభి వాణి దేవి

విద్యావేత్త, చిత్రకారిణి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమార్తె.

సురభి వాణి దేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త,[1] చిత్రకారిణి,[2] మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమార్తె.[3] అనేక విద్యా సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులు అయిన వాణి దేవి, సామాజిక కార్యకర్తగా స్వామి రామానంద తీర్థ స్మారక కమిటీ ప్రధాన కార్యదర్శి లాంటి పలు పదవులను నిర్వహించింది. 2021 మార్చిలో జరిగిన మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందింది.[4]

సురభి వాణి దేవి
జననం1 ఏప్రిల్, 1952
విద్యబిఎ డిగ్రీ (ఉస్మానియా విశ్వవిద్యాలయం)
ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా (జెఎన్‌టియు)
వృత్తిచిత్రకారిణి, విద్యావేత్త
తల్లిదండ్రులుపివి నరసింహారావు (తండ్రి)
బంధువులుపి.వి. రంగారావు, పి.వి. రాజేశ్వర్ రావు (సోదరులు)

తొలి జీవితం

మార్చు

వాణి దేవి, భారతదేశ మాజీ ప్రధాన మంత్రి దివంగత పివి నరసింహారావు దంపతులకు 1952, ఏప్రిల్ 1న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించింది. హైదరాబాదు హైదర్‌గూడలోని ప్రభుత్వ బాలికల పాఠశాల నుండి హెచ్ఎస్సి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఎ డిగ్రీ, జెఎన్‌టియు నుండి ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా పూర్తిచేసింది. 1990 నుండి 1995 వరకు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేసింది.[5]

విద్యావేత్తగా

మార్చు

గత 3 దశాబ్దాలుగా విద్యారంగంలో కృషిచేస్తోన్న వాణి దేవి, శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్,[6] సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (1991) వంటి విద్యాసంస్థలను స్థాపించింది.

చిత్రకారిణిగా

మార్చు

చిత్రకారిణిగా 1973 నుండి దేశవిదేశాల్లో 15కి పైగా సోలో ఎగ్జిబిషన్లు, అనేక గ్రూప్ షోలు, సెమినార్లు నిర్వహించింది.

అవార్డులు

మార్చు
  1. ఇంటర్నేషనల్ విమెన్స్ అచీవ్‌మెంట్ అవార్డు - తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాదు, 2016[7]
  2. ప్రతిభా పురస్కారం - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2012[8]

రాజకీయ ప్రస్థానం

మార్చు

వాణి దేవి, మార్చి 14న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందింది.[9] ఆమె శాసనమండలి సభ్యురాలిగా 29 ఆగష్టు 2021న ప్రమాణ స్వీకారం చేసింది.[10]

మూలాలు

మార్చు
  1. Ali, Roushan (22 July 2020). "If offered, will accept MLC post, says PV's daughter | Hyderabad News - Times of India". The Times of India. Times of India. Retrieved 26 February 2021.
  2. Ifthekhar, J. S. (7 September 2015). "Art parallels Nature". The Hindu. Retrieved 26 February 2021.
  3. "TRS fields PV's daughter for MLC polls". Telangana Today. 21 February 2021. Retrieved 26 February 2021.
  4. Telangana Today, Telangana (20 March 2021). "TRS candidate Vani Devi wins Graduates MLC election". Archived from the original on 20 March 2021. Retrieved 20 March 2021.
  5. Ali, Roushan (22 February 2021). "KCR picks PV Narasimha Rao's daughter Vani for Hyderabad-Ranga Reddy-Mahbubnagar MLC poll | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 26 February 2021.
  6. correspondent, dc (22 February 2021). "KCR names P V Narasimha Rao's daughter Vani Devi as MLC candidate". Deccan Chronicle. Retrieved 26 February 2021.
  7. "TRS fields Surbhi Vani Devi, daughter of former PM PV Narasimha Rao, for MLC polls". The News Minute. 22 February 2021. Retrieved 26 February 2021.
  8. "Photos: Painting Exhibition by P.V.Narasimha Rao's Daughter Smt. S. Vani Devi at Salar Jung Museum, Hyderabad". www.ragalahari.com. Retrieved 26 February 2021.
  9. నమస్తే తెలంగాణ, వార్తలు (20 March 2021). "పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం". Archived from the original on 20 March 2021. Retrieved 20 March 2021.
  10. Sakshi (29 August 2021). "ఎమ్మెల్సీగా వాణీదేవి ప్రమాణ స్వీకారం". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.