సర్వర్ సుందరం
సర్వర్ సుందరం (Server Sundaram) ఒక 1966 జులై 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనికి మాతృక ఇదే పేరుతో నున్న తమిళ సినిమా సర్వర్ సుందరం. దీని కథను దర్శకుడు కె.బాలచందర్ అందించారు. తెలుగులో ఈ చిత్ర దర్శకుడు కృష్ణన్ - పంజు.
సర్వర్ సుందరం (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణన్ - పంజు |
---|---|
నిర్మాణం | నెల్లూరు కాంతారావు పహిల్వాన్ |
కథ | కె.బాలాచందర్ |
తారాగణం | నగేష్, కె.ఆర్.విజయ, ముత్తురామన్ |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి పామర్తి |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల |
గీతరచన | అనిసెట్టి |
సంభాషణలు | అనిసెట్టి |
ఛాయాగ్రహణం | ఎం.మారుతీరావు |
కూర్పు | ఎన్.ఎస్.ప్రకాశం |
నిర్మాణ సంస్థ | టైగర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
దీనిని మై సుందర్ హూ పేరుతో మహమూద్ హీరోగా 1971 సంవత్సరం హిందీలో నిర్మించారు.[2]
కథాంశం
మార్చుసుందరం (నగేష్) ఒక హోటల్ లో సర్వర్ గా పనిచేస్తుంటాడు. ఇతడు తన తల్లితో హాయిగా జీవిస్తుంటాడు. అదే హోటల్ కు రాధ (విజయ) ఎక్కువగా వస్తుంటుంది. సుందరం రాధను ప్రేమిస్తుంటాడు. అయితే రాధ మాత్రం ఏ మాత్రం ఇష్టపడదు. ఆమెను ఆకర్షించడానికి రాఘవన్ (ముత్తురామన్) సహాయంతో సినిమాలలో ప్రవేశిస్తాడు. సినిమా అంతా చివరికి ఏ విధంగా అతడు రాధ ప్రేమను సంపాదిస్తాడని చూపిస్తుంది.
నటీనటులు
మార్చు- నగేష్ - సర్వర్ సుందరం
- కె.ఆర్. విజయ - రాధ
- ముత్తురామన్ - రాఘవన్
- ఎస్.వి.రంగారావు
- హరనాథ్ రాజు
పాటలు
మార్చు- కసి కసిలే ఒక కన్నె పడుచై ఇలలోనే దివి వెలియించే - పి.సుశీల బృందం - రచన: అనిసెట్టి
- నవయువతి చక్కని ప్రియ నవ యువతి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అనిసెట్టి
- పర బ్రహ్మ పరమేశ్వర...పాడిపంటలు ,మాధవపెద్ది, సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ ఆర్ ఈశ్వరి బృందం, రచన:అనిశెట్టి
- పూత పూచే హృదయం ఇది, పి.బి.శ్రీనివాస్, పి సుశీల , రచన:అనిశెట్టి
- కన్నె డెందం మోహలందే కరుగదా, పి.సుశీల, రచన: అనిశెట్టి
- మోహిని ఇలపై వేలసేనే ఎమ్మా , పి.సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: అనిశెట్టి
అవార్డులు
మార్చుతమిళ సర్వర్ సుందరం సినిమాకు ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం, పిలింఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నది.[3]
వెలుపలి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 19.
- ↑ ఐ.ఎమ్.బి.డి.లో మై సుందర్ హూ పేజీ
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-05-04. Retrieved 2011-09-27.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)