కృష్ణన్ - పంజు
ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ - పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.[1]
కృష్ణన్ - పంజు | |
---|---|
జననం | ఆర్.కృష్ణన్: 1909 జూలై 18 ఎస్.పంజు: 1915 జనవరి 24 |
మరణం | ఆర్.కృష్ణన్: 1997 జూలై 17 (వయసు 87) ఎస్.పంజు: 1984 ఏప్రిల్ 6 (వయసు 69) చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | సినిమా దర్శకులు |
క్రియాశీల సంవత్సరాలు | ఆర్.కృష్ణన్: 1944–1997 ఎస్.పంజు: 1944–1984 |
జీవిత విశేషాలు
మార్చుఆర్.కృష్ణన్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పట్టణంలో 1909, జూలై 18న జన్మించాడు.[2] మొదట్లో ఇతడు కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియో (అప్పట్లో కందన్ స్టూడియోగా పిలువబడేది) లో లాబొరేటరీ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు.[3] ఇతని కుమారుడు కె.సుభాష్ కూడా చలనచిత్ర దర్శకుడుగా పనిచేశాడు.[4]
ఎస్.పంజు అసలు పేరు పంచాపకేశన్. ఇతడు కుంభకోణం సమీపంలోణి ఉమయాల్ పురంలో 1915, జనవరి 24న జన్మించాడు.[2] ఇతడు దర్శకుడిగా మారడానికి పూర్వం పి.కె.రాజాశాండో వద్ద సహాయ ఎడిటర్‌గా, ఎల్లిస్ ఆర్. దంగన్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఇతడు పంజాబి పేరుతో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[3][5][6]
వృత్తి
మార్చువీరిరువురూ కందన్ స్టూడియోలో పి.కె.రాజా శాండో దర్శకత్వం వహించిన మనునీధి చోళన్ (1942) అనే తమిళ సినిమాలో పనిచేశారు.[5] ఆ సమయంలో వీరిరువురూ మంచి మిత్రులుగా మారారు. వీరి పనితనాన్ని గమనించి రాజాశాండో తన తరువాతి ప్రాజెక్టు పూంపావై వీరికి ఆప్పజెప్పాడు. ఆ విధంగా పూంపావై (1944) దర్శకులుగా ఈ జంట మొదటి చిత్రం అయ్యింది.[7] 1947లో ఈ జంట పైతియక్కరన్ అనే సినిమాకు దర్శకులుగా పనిచేశారు.[8] 1949లో వీరు మిష్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేరణతో నల్లతంబి అనే సినిమాను తీశారు. ఆ సినిమాకు సి.ఎన్.అన్నాదురై స్క్రిప్ట్ వ్రాశాడు. ఇది అతని మొదటి సినిమా. తరువాతి కాలంలో ఇతడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[9] 1952లో వీరు దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకు తమిళనాడుకు మరో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి సంభాషణలు వ్రాశాడు.[10][11] వీరు భాభీ, షాదీ వంటి హిందీ సినిమాలు కుడా దర్శకత్వం వహించారు. వీరికి 1960లో కలైమామణి పురస్కారం లభించింది.[1]
మరణాలు
మార్చు1984, ఏప్రిల్ 6వ తేదీన ఎస్.పంజు చెన్నైలో మరణించాడు.[8] పంజు మరణం తర్వాత కృష్ణన్ ఏ సినిమాను తీయలేదు. అతడు 1997, జూలై 15వ తేదీన మరణించాడు.[1]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా పేరు | భాష | బ్యానర్ | మూలం |
---|---|---|---|---|
1944 | పూంపావై | తమిళ | లియో పిక్చర్స్ | |
1947 | పైతియక్కరన్ | తమిళ | ఎన్.ఎస్.కె.పిక్చర్స్ | |
1949 | నల్లతంబి | తమిళ | ఎన్.ఎస్.కె.ఫిలింస్ & ఉమా పిక్చర్స్ | |
1949 | రత్త్నకుమార్ | తమిళ | మురుగన్ టాకీస్ | |
1952 | పరాశక్తి | తమిళ | నేషనల్ పిక్చర్స్ | |
1953 | కణగల్ | తమిళ | మోషన్ పిక్చర్స్ టీమ్ | |
1954 | రక్త కన్నీర్ | తమిళ | నేషనల్ పిక్చర్స్ | |
1955 | శాంతసక్కు | కన్నడ | శ్రీ పాండురంగ ప్రొడక్షన్స్ | |
1956 | కులదైవమ్ | తమిళ | ఎస్.కె.పిక్చర్స్ | |
1957 | పుదైయల్ | తమిళ | కమల్ బ్రదర్స్ | |
1957 | భాభీ | హిందీ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1958 | మామియర్ మెచ్చిన మారుమగళ్ | తమిళ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1959 | బర్ఖా | హిందీ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1960 | తిలకమ్ | తమిళ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1960 | దైవపిరవి | తమిళ | కమల్ బ్రదర్స్ | |
1960 | బిందియా | హిందీ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1961 | సుహాగ్ సిందూర్ | హిందీ | ||
1962 | షాదీ | హిందీ | ||
1962 | మన్-మౌజి | హిందీ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1962 | అన్నై | తమిళ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1963 | కుంకుమమ్ | తమిళ | రాజమణి పిక్చర్స్ | |
1964 | వళ్కై వళ్వతర్కె | తమిళ | కమల్ బ్రదర్స్ | |
1964 | సర్వర్ సుందరం | తమిళ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1964 | మేరే కసూర్ క్యా హై | హిందీ | ||
1965 | కుళందయం దైవమమ్ | తమిళ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1966 | పెట్రల్తాన్ పిళ్ళైయ | తమిళ | ఎమ్జీయార్ పిక్చర్స్ | |
1966 | లేత మనసులు | తెలుగు | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1966 | లాడ్‌లా | హిందీ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1968 | దో కలియాఁ | హిందీ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1968 | వుయరంద మనిధన్ | తమిళ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1969 | అన్నయుం పితవమ్ | తమిళ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1970 | ఎంగల్ తంగమ్ | తమిళ | మేకల పిక్చర్స్ | |
1970 | అనాదై ఆనందన్ | తమిళ | ముత్తువేల్ మూవీస్ | |
1971 | మై సుందర్ హూఁ | హిందీ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1971 | రంగరత్తినం | తమిళ | ఎస్.జె.ఫిలింస్ | |
1972 | పిళ్లైయొ పిళై | తమిళ | మేకల పిక్చర్స్ | |
1972 | ఇదయ వీణై | తమిళ | ఉదయం ప్రొడక్షన్స్ | |
1972 | అక్కా తమ్ముడు | తెలుగు | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ | |
1974 | సమయల్‌కరన్ | తమిళ | మెరీనా మూవీస్ | |
1974 | షాన్‌దార్ | హిందీ | ||
1974 | పత్తు మాద బంధం | తమిళ | శ్రీ నవనీత ఫిలింస్ | |
1974 | కలియుగ కన్నన్ | తమిళ | అజంతా ఎంటర్‌ప్రైజస్ | |
1975 | వాళంతు కాత్తుగిరెన్ | తమిళ | ఎస్.ఎస్.కె.ఫిలింస్ | |
1975 | కాశ్మీరు బుల్లోడు | తెలుగు | ||
1975 | అనయ విలక్కు | తమిళ | అంజుగం పిక్చర్స్ | |
1976 | వళ్వు ఏన్ పక్కం | తమిళ | ఎస్.ఎస్.కె.ఫిలింస్ | |
1977 | సొన్నతాయ్ సీవెన్ | తమిళ | ||
1977 | ఇలయ తలైమురై | తమిళ | యోగచిత్ర ప్రొడక్షన్స్ | |
1977 | ఎన్న తావం సీతన్ | తమిళ | నలందా మూవీస్ | |
1977 | చక్రవర్తి | తమిళ | పి.వి.టి ప్రొడక్షన్స్ | |
1978 | పేర్ సొల్ల ఒరు పిల్లై | తమిళ | వాణి చిత్ర ప్రొడక్షన్స్ | |
1978 | అన్నపూర్ణి | తమిళ | విజయాంబిక ఫిలింస్ | |
1979 | వెల్లి రథం | తమిళ | అష్టలక్ష్మీ పిక్చర్స్ | |
1979 | నీల మలర్గల్ | తమిళ | శబరి సినీ క్రియేషన్స్ | |
1979 | నాదగమె ఉళగమ్ | తమిళ | విజయాంబిక ఫిలింస్ | |
1980 | మంగళ నాయగి | తమిళ | జె.సి.చౌదరి ఆర్ట్స్ | |
1986 | మలారం నినైవుగళ్ | తమిళ | మీనాక్షి ఫిలింస్ |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Film director Krishnan dead". The Indian Express. 17 July 1997. Archived from the original on 26 April 2013. Retrieved 21 January 2020.
- ↑ 2.0 2.1 Narwekar, Sanjit (1994). Directory of Indian film-makers and films. Flicks Books. p. 156. Archived from the original on 2013-10-09. Retrieved 2020-01-21.
- ↑ 3.0 3.1 Guy, Randor (31 July 2011). "Kuzhandaiyum Deivamum 1965". The Hindu. Archived from the original on 22 May 2018. Retrieved 21 January 2020.
- ↑ Poorvaja, S. (24 November 2016). "Film director Subhash dead". The Hindu. Archived from the original on 22 మే 2018. Retrieved 21 January 2020.
- ↑ 5.0 5.1 Guy, Randor (1 March 2014). "Araichimani or Manuneethi Chozhan (1942)". The Hindu. Archived from the original on 25 October 2016. Retrieved 21 January 2020.
- ↑ Guy, Randor (15 August 2008). "Manamagal 1951". The Hindu. Archived from the original on 13 March 2014. Retrieved 21 January 2020.
- ↑ லெனின், கோவி. "இரட்டையர்கள் கிருஷ்ணன்-பஞ்சு". Nakkheeran (in Tamil). Archived from the original on 9 December 2013. Retrieved 21 January 2020.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 8.0 8.1 "பராசக்தி உள்பட பல வெற்றிப்படங்களை இயக்கிய கிருஷ்ணன்- பஞ்சு". Maalai Malar (in Tamil). 26 December 2011. Archived from the original on 4 March 2014. Retrieved 21 January 2020.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Guy, Randor (19 June 2009). "Scripting cinema's role in politics". The Hindu. Archived from the original on 7 November 2012. Retrieved 21 January 2020.
- ↑ Gokulsing, K. Moti; Dissanayake, Wimal (17 April 2013). Routledge Handbook of Indian Cinemas. Routledge. pp. 499–. ISBN 978-1-136-77291-7. Archived from the original on 29 జూన్ 2014. Retrieved 21 జనవరి 2020.
- ↑ Dwyer, Rachel (27 September 2006). Filming the Gods: Religion and Indian Cinema. Routledge. pp. 51, 139. ISBN 978-1-134-38070-1. Archived from the original on 29 జూన్ 2014. Retrieved 21 జనవరి 2020.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో R. Krishnan పేజీ
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో S. Panju పేజీ