సలీం (రచయిత)

భారతీయ తెలుగు రచయిత

సయ్యద్ సలీం 1959 జూన్ ఒకటో తేదీన జాఫర్, అన్వర్ బీలకు జన్మించారు. భద్రిరాజు జన్మించిన ఒంగోలు సమీపంలో త్రోవగుంట అనే గ్రామంలో జన్మించారు. మానవత్వాన్ని మించిన మతం లేదనీ, అదే తన అభిమతంగా, కథలు, నవలలు, కవితలు రాశారు.

సలీం
అక్షరశిల్పులు.pdf
జననం1 జూన్ 1961.
త్రోవగుంట, భారతదేశం.
ఇతర పేర్లుసలీం
వృత్తిరచయిత
తండ్రిజాఫర్
తల్లిఅన్వర్ బీ

సాహితీ ప్రస్థానంసవరించు

ఇంటర్ చదివే రోజుల్లోనే 'సమర సాహితి' అనే సంస్థకి కార్యదర్శి అయ్యారు. కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్సీ. పట్టా పొందారు. 1996లో తొలిసారిగా స్వాతిచినుకులు పేరుతో కథల సంపుటి ప్రచురించారు. 1999లో నిశ్శబ్ద సంగీతం అనే కథల సంపుటి, నీలోకి చూసిన జ్ఞాపకం అనే తొలి కవితా సంపుటినీ ప్రచురించారు. 2001లో జీవన్మృతులు, 2003లో వెండిమేఘం అనే నవలలు రాశారు. 2004లో రూపాయి చెట్టు కథల సంపుటి ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. ఆయన రాసిన కాంచనమృగం నవల ఆటా సంస్థ నిర్వహించిన పోటీల్లో బహుమతి పొందింది. మెహర్, బురఖా, తలాక్, ఆరో అల్లుడు వంటి కథల ద్వారా ముస్లిం సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఉన్న రుగ్మతల్ని ఖండించారు. సలీం సంస్కరణవాది. ఇప్పటివరకు వీరు మూడు కవితా సంపుటాలు, 10 కథా సంపుటాలు , 25 నవలలు వెలువరించారు.

పురస్కారాలుసవరించు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ధర్మనిధి పురస్కారం ఇచ్చింది. 2003లో అధికార భాషా సంఘం భాషా పురస్కారం, 2005లో ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు వచ్చాయి. ఆయన కథలు పది కన్నడంలోకి అనువాదమయ్యాయి. మూడు కథలు హిందీలోకి వెళ్తే, పెంగ్విన్ బుక్స్ సంస్థ మెహర్ కథని ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించింది.2010 లో ఈయన రాసిన నవల కాలుతున్న పూలతోట కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్సిటీ సాహితీ పురస్కారం, వి ఆర్ నార్ల పురస్కారం లభించాయి. రూపాయి చెట్టు కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం, కథా రచనకు చాసో సాహిత్య పురస్కారం, నవలా రచనకు వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం, కొవ్వలి సాహితీ పురస్కారం లభించాయి. వెండిమేఘం నవల ఉస్మానియా యూనివర్సిటీ , పాలమూరు యూనివర్సిటీ , మహాత్మా గాంధీ యూనివర్సిటీల్లో ఎం.ఏ తెలుగు విద్యార్థులకు పాఠ్య పుస్తకం గా ఉంది.

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు