త్రోవగుంట

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం లోని గ్రామం


త్రోవగుంట, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలంనకు చెందిన [1] పిన్ కోడ్: 523 262. ఎస్.టి.డి.కోడ్ = 08592.

త్రోవగుంట
రెవిన్యూ గ్రామం
త్రోవగుంట is located in Andhra Pradesh
త్రోవగుంట
త్రోవగుంట
నిర్దేశాంకాలు: 15°33′07″N 80°03′29″E / 15.552°N 80.058°E / 15.552; 80.058Coordinates: 15°33′07″N 80°03′29″E / 15.552°N 80.058°E / 15.552; 80.058 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంఒంగోలు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,402 హె. (3,464 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం7,992
 • సాంద్రత570/కి.మీ2 (1,500/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523262 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

ఈ గ్రామం ఒంగోలుకు అతిదగ్గరలో, 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మండలం పేరు ఒంగోలు
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్రపదేశ్
భాష తెలుగు
ఎత్తు: సముద్రమట్టానికి 12 మీటర్లు
పిన్‌కోడ్ 523262
తపాలా కార్యాలయం

సమీపంలోని గ్రామాలుసవరించు

నందిపాడు 2.6 కి.మీ, చేకూరుపాడు 2.6 కి.మీ, కొప్పోలు 2.6 కి.మీ, ఏడుగుండ్లపాడు 3.3 కి.మీ, కరవది 3.6 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

ఒంగోలు 7.3 కి.మీ, మద్దిపాడు 7.5 కి.మీ, నాగులుప్పలపాడు 9.4 కి.మీ, సంతనూతలపాడు 17.1 కి.మీ.

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

రక్షిత త్రాగునీటి సౌకర్యంసవరించు

ఈ గ్రామంలో 2014, అక్టోబరు-31న ఐ.టి.సి. మరియూ శ్రీజ సంస్థలు సంయుక్తంగా నిర్మించు సామాజిక రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన నిర్వహించారు. [2]

వృద్ధాశ్రమంసవరించు

ఈ గ్రామ సమీపంలో, కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో, 4.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని, 2015, నవంబరు-22న ఉదయం 8 గంటలకు ప్రారంభించెదరు. మొత్తం 150 మందికి వసతి గల ఈ ఆశ్రమానికి, దాత శ్రీ నల్లూరి వెంకటరావు, ఒక ఎకరం స్థలాన్ని వితరణ చేయగా, పలువురు దాతలు భూరివిరాళాలు సమకూర్చారు. [3]

గ్రామ పంచాయతీసవరించు

మండవ పిచ్చయ్య, మాజీ సర్పంచ్.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)సవరించు

గ్రామంలోని ఈ ఆలయం (శివాలయం) మహిమాన్వితమయినది.

శ్రీ రామాలయంసవరించు

శ్రీ అంకమ్మ తల్లి ఆలయంసవరించు

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఒంగోలు మండలం, సుందరయ్యనగర్, త్రోవగుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి విగ్రహా ప్రతిష్ఠా మహోత్సవం, 2017, మార్చి-16వతేదీ గురువారం 10-01 కి, మంగళవాయిద్యాలు, వేదమమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు, అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం 11-00 నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [4]

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

త్రోవగుంట గ్రామం పొగాకు కంపెనీలకు ప్రసిద్ధి.

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

  • త్రోవగుంట హసాన్ సాహెబ్ 1915 (చినమౌలా గురువుగారు), నాదస్వర విద్వాంసులు

గ్రామంలొని విశేషాలుసవరించు

ఆంధ్రజ్యోతి ముద్రణా ప్రెస్, ఒంగోలు ఆటొనగర్, ఈ గ్రామంలో ఉన్నాయి.

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,203.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,570, మహిళల సంఖ్య 3,633, గ్రామంలో నివాస గృహాలు 1,768 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,402 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

గ్రామ సంబంధిత వివరాలు [1] [2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, నవంబరు-1; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, నవంబరు-13; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, మార్చి-17; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=త్రోవగుంట&oldid=2845495" నుండి వెలికితీశారు