సహాయం:విజువల్ ఎడిటరుతో బొమ్మల పరిచయం/1
పరిచయం
బొమ్మలు ఎక్కించడం
బొమ్మలను చేర్చడం
వివరాలను సవరించడం
గ్యాలరీలు
సారాంశం
|
ఓ కొత్త బొమ్మను చేర్చడం, మీరు వ్యాసంలో దిద్దుబాటు చేస్తున్నపుడే చెయ్యవచ్చు. ఈసరికే వికీమీడియా కామన్స్‌లో ఉన్న బొమ్మను చేర్చవచ్చు, లేదా మీరే ఒక కొత్త బొమ్మను ఎక్కించవచ్చు. వికీమీడియా కామన్స్‌లో ఉన్న బొమ్మలను ఏ భాషకు చెందిన వికీపీడియా లోనైనా వాడుకోవచ్చు. వికీపీడియా బయటి వారు కూడా ఎవరైనా వాటిని ఉచితంగా, స్వేచ్ఛగా వాడుకోవచ్చు (కొన్ని షరతులకు లోబడి). ఈ పాఠం బొమ్మలను ఎక్కించడం, వ్యాసంలో చేర్చడం గురించి, సంబంధిత నియమాలూ మార్గదర్శకాల గురించీ పరిచయం చేస్తుంది.
|