సహాయం:విజువల్ ఎడిటరుతో బొమ్మల పరిచయం/2
పరిచయం
బొమ్మలు ఎక్కించడం
బొమ్మలను చేర్చడం
వివరాలను సవరించడం
గ్యాలరీలు
సారాంశం
|
బొమ్మలను వికీమీడియా కామన్స్‌లో భద్రపరుస్తారు. వీటిని వివిధ భాషల వికీపీడియాల్లో వాడుకోవచ్చు. వికీపీడియా సోదర ప్రాజెక్టుల్లో కూడా వాడుకోవచ్చు.
"ఎక్కించు" ట్యాబును నొక్కి మీ కంప్యూటరు లోని బొమ్మను ఎంచుకోండి (దస్త్రం పేరును టైపించండి లేదా బొమ్మను లాగి ఇక్కడీ పెట్టెలో పడెయ్యండి).
దానికి వివరణను చేర్చండి. మరెవరైనా ఆ బొమ్మను వేరే ఏదైనా పేజీలో వాడదలిస్తే ఆ బొమ్మ దేని గురించో వాళ్లకు తెలుస్తుంది. ఇక్కడ మీరిచ్చే వివరణ కామన్సులో బొమ్మతో పాటు భద్రమౌతుంది కాబట్టి, ఈ బొమ్మను చేర్చిన వ్యాసంలో రాసే వివరణ కంటే విపులంగా ఇక్కడి వివరణ ఉండవచ్చు. ఈ బొమ్మకు వర్గాలను కూడా చేర్చవచ్చు. తద్వారా ఇతర వాడుకరులు దీన్ని కనుక్కోవడం తేలికౌతుంది.
ముఖ్యమైన ఆటంకం: వికీమీడియా కామన్సు లోకి ఎక్కించే బొమ్మలపై ఎక్కించే వారికి కాకుండా మరెవరికీ కాపీహక్కులు ఉండరాదు. ఎక్కించగానే, వాటిని ఎవరైనా వాడుకునేలా (Creative commons license) స్వేచ్ఛ పొందుతాయి. ఒకవేళ బొమ్మ కాపీహక్కుల స్వంతదారు మీరు కాని పక్షంలో, ఆ బొమ్మను వాడుకోవడం 'సదుపయోగం' కిందకు వస్తుందని మీరు భావిస్తే, ఆ బొమ్మను వికీపీడియా లోనే ఎక్కింపు విజార్డు ద్వారా భద్రపరచవచ్చు. అంతేగానీ, కామన్సు లోకి ఎక్కించరాదు. మరింత సమాచారం కోసం, Help:Introduction to images with Wiki Markup చూడండి.
|