సాక్షి మాలిక్
సాక్షి మాలిక్ (జనన: సెప్టెంబరు 3, 1992) భారతదేశంలోని హర్యానా కు చెందిన మల్ల యోధురాలు. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ పోటీలలో కాంస్య పతకం సాధించింది. ఈ పోటీలలో భారతదేశానికి ఇది మొట్టమొదటి పతకం.[4]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | రోహతక్,[1] హర్యానా | 1992 సెప్టెంబరు 3||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 162 cమీ. (5 అ. 4 అం.) (2016)[2] | ||||||||||||||||||||||||||||||||
బరువు | 58 కిలోగ్రాములు (128 పౌ.)[2] | ||||||||||||||||||||||||||||||||
క్రీడ | |||||||||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||||||||||||||||||||
క్రీడ | కుస్తీ | ||||||||||||||||||||||||||||||||
పోటీ(లు) | 58 kg freestyle | ||||||||||||||||||||||||||||||||
కోచ్ | ఈశ్వర్ దహియా | ||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
బాల్యం
మార్చుసాక్షి హర్యానా రాష్ట్రం లోని రోహతక్ దగ్గర్లోని మోఖ్రా అనే గ్రామంలో సుదేష్, సుఖ్‌బీర్ దంపతులకి సెప్టెంబరు 3, 1992 లో జన్మించింది. తనకి చిన్నప్పటి నుంచీ క్రీడలంటే ఆసక్తి ఉండేది.[5] పన్నెండేళ్ల వయసులో గురువు ఈశ్వర్ దహియా వద్ద శిక్షణకు చేరింది. ఆ క్రీడలో మెలకువల్ని అభ్యసించింది. అప్పటికి ఆమె ఉన్న ప్రాంతంలో కుస్తీ ఎక్కువగా అబ్బాయిలు మాత్రమే ఆడేవారు. ఆ ఆటను సాధన చేయాలన్నా, సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలన్నా అబ్బాయిలతో పోటీ పడాల్సిందే. అలా తర్ఫీదు పొందుతున్న ఆమెకు స్థానికులూ బంధువుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఆ సమయంలో కోచ్ ఈశ్వర్ ఆమెకు అండగా నిలిచాడు. నెమ్మదిగా స్థానిక పోటీల్లో విజయాలు సాధించడం మొదలుపెట్టింది.
పోటీలు
మార్చుఅంతర్జాతీయ పోటీల్లో అడుగుపెట్టిన ఆమెకు ప్రారంభంలోనే విజయం వరించింది. 2010 జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. తరవాత 2014 డేవ్ షుల్జ్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించింది. అదే ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలిచిన సాక్షికి ఒలంపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాధన చేసింది. 2015 ఆసియా రెజ్లింగ్ పోటీల్లో కాంస్యం సొంతమయ్యాక సమ్మర్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కి సన్నద్ధమైంది. అందులో కాంస్యం నెగ్గి రియోలో పోటీలకి అర్హత సాధించింది.
రియోలో 58 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీకి దిగిన సాక్షి మాలిక్ తొలి రౌండ్‌లో జొహాన్న మాట్సన్ (స్వీడన్)తో తలపడ్డ సాక్షి 0-4తో వెనుకబడింది. కానీ ఆఖరి పది సెకన్లలో ప్రత్యర్థిని రింగ్‌లోంచి బయటకు నెట్టేసి కింద పడేసి పాయింట్లు సాధిస్తూ 5-4తో విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో మరియానా చెర్దివరాతో హోరాహోరి పోరు సాగింది. ఇద్దరికీ 5-5 పాయింట్లు వచ్చాయి. కానీ ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించిన సాక్షినే విజయం వరించింది.
తరవాత జరిగిన క్వార్టర్స్‌లో రష్యా ప్రత్యర్థి కోబ్లోవా చేతిలో ఓడిపోయింది. కోబ్లోవా ఫైనల్ చేరడంతో రెపిచేజ్ రౌండ్లలో తలపడే అవకాశం సాక్షికి లభించింది. తొలి రౌండ్‌లో మంగోలియాకు చెందిన పురెవ్‌డోర్జిన్ ఓర్కాన్‌ని 12-3 తేడాతో ఓడించి. కిర్గిజిస్థాన్‌కి చెందిన బెకావోతో తుది పోరుకు సిద్ధమైంది. మొదట్లో బెకావో 0-5తో ముందంజ వేసింది కానీ సాక్షి వరుసగా 8 పాయింట్లు సాధించి చెకావోను ఓడించి కాంస్యం సాధించి పతకాల పట్టికలో భారత్‌ని చేర్చింది.
మూలాలు
మార్చు- ↑ "SAKSHI MALIK". Commonwealth Games Federation. Archived from the original on 1 ఆగస్టు 2016. Retrieved 7 March 2016.
- ↑ 2.0 2.1 "Sakshi Malik profile". rio2016.com. Archived from the original on 17 August 2016. Retrieved 18 August 2016.
- ↑ "Commonwealth Championship: Female wrestling Seniors: 2013-12-05 Johannesburg (RSA): 63.0 kg". iat.uni-leipzig.de. United World Wrestling. Archived from the original on 11 ఏప్రిల్ 2016. Retrieved 17 August 2016.
- ↑ "Rio Olympics: Wrestler Sakshi Malik wins India's first medal - bronze in 58kg freestyle". ది టైమ్స్ ఆఫ్ ఇండియా. 18 August 2016. Retrieved 18 August 2016.
- ↑ ఈనాడు వార్త