సారాయి వీర్రాజు

డిఎస్ కన్నన్ దర్శకత్వంలో 2009లో విడుదలైన తెలుగు చలనచిత్రం

సారాయి వీర్రాజు, 2009 డిసెంబరు 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. విశాలాక్షి క్రియేషన్స్ పతాకంపై పి.ఆర్.కె. రావు నిర్మాణ సారథ్యంలో డి.ఎస్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్, రమ్య నంబీశన్, మధులిక ముఖ్యపాత్రల్లో నటించగా, శ్రీసాయి సంగీతం అదించాడు.[1][2][3] డిఎస్ కన్నన్ గతంలో ఎస్. ఎస్. రాజమౌళి, కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ (తమిళచిత్రం: వెట్టట్టం) భాషలలో చిత్రీకరించబడింది.

సారాయి వీర్రాజు
దర్శకత్వండి.ఎస్. కన్నన్
నిర్మాతపి.ఆర్.కె. రావు
తారాగణంఅజయ్
రమ్య నంబీశన్
మధులిక
ఛాయాగ్రహణండి.బి. విశ్వ
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంశ్రీసాయి
విడుదల తేదీ
2009 డిసెంబరు 4 (2009-12-04)
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

వీర్రాజు దుబాయ్ వెళ్ళడానికి డబ్బు ఆదా చేస్తుంటాడు. ఒక అమ్మాయిని రక్షించే ప్రయత్నంలో వీర్రాజు తన జీవితాన్ని కోల్పోవడమేకాకుండా కొత్త శత్రువులు ఏర్పడతారు. దుబాయ్ కి వెళ్ళేటప్పుడు ఎయిర్ హోస్టెస్ ప్రీతి (మధులిక)ను చూసి ఆకర్షితుడై, ఆమె ప్రేమకోసం తిరుగుతుంటాడు. విష్ణు అనే వ్యక్తిని చంపడంకోసం దుబాయ్‌ వెళ్ళిన వీర్రాజు, అతన్ని చంపడానికి ముందు నర్సిపట్నం, ధనలక్ష్మి (రెమ్య నంబీషన్) గుర్తుందా అని అడుగుతాడు. నర్సిపట్నంలో ఏం జరిగింది, ధనలక్ష్మి ఎవరు అనేది, విష్ణును వీర్రాజు ఎందుకు చంపాడు అనేది మిగతా కథ.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకుడు: డి.ఎస్. కన్నన్
  • సహాయ దర్శకుడు: అమిన్ జాఫరిజాదే
  • నిర్మాత: పి.ఆర్‌.కె. రావు
  • సంగీత దర్శకుడు: శ్రీసాయి
  • మ్యూజిక్ మిక్సర్: అమిన్ జాఫరిజాదే
  • కెమెరా: డి.బి. విశ్వ

పాటలు మార్చు

ఈ చిత్రానికి శ్రీసాయి సంగీతం అందించాడు.[4] కృష్ణ చైతన్య, ఉమామహేశ్వరరావు పాటలు రాశారు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఇంతే నేనింతే"  విజయ్ తేజేశ్వర్  
2. "సూరీడిలా"  కార్తీక్  
3. "వచ్చేయ్ గాలి"  శ్వేత మోహన్  
4. "కొమ్మపైన కోకిలమ్మా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం  
5. "అల్లరంతా అల్లుకుంది"  శ్వేత  
6. "నీదో నాదో"  కార్తీక్, శ్వేత మోహన్  
7. "ఇప్పసారా"  రంజిత్  
8. "థీమ్ (రుధ్రం భాజై)"  భావన్, సెంథిల్, విజయ్ తేజేశ్వర్  
9. "ఆత్రేయపురం"  రెనైనా రెడ్డి  
10. "గ్రహణం ఏదో"  వి.వి. ప్రసన్న  

మూలాలు మార్చు

  1. "Sarai Veerraju press meet - Telugu cinema function - Ajay". www.idlebrain.com. Retrieved 2020-12-26.
  2. "Dil Raju buys Sarai Veeraju rights". www.bharatwaves.com. Retrieved 2020-12-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Telugu Cinema News | Telugu Movie Reviews | Telugu Movie Trailers - IndiaGlitz Telugu". IndiaGlitz.com. Archived from the original on 2014-08-13. Retrieved 2020-12-26.
  4. "Saarai Veerraju Songs Download". Naa Songs. 2014-03-24. Archived from the original on 2016-11-14. Retrieved 2020-12-26.