అంజి వల్గుమాన్ తెలుగు నాటకరంగ, సినిమా నటుడు. బలగం, ఇంటింటి రామాయణ, పరేషాన్, భీమ దేవరపల్లి బ్రాంచి సినిమాలలోని నటనకుగాను మంచి గుర్తింపు అందుకున్నాడు.[1]

అంజి వల్గుమాన్
జననం (1984-07-01) 1984 జూలై 1 (వయసు 39)
విద్యఎంఏ థియేటర్ ఆర్ట్స్ (రంగస్థల కళలు)
విద్యాసంస్థతెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు
వృత్తినాటకరంగ, సినిమా నటుడు
జీవిత భాగస్వామిసరోజ
పిల్లలుహాసిని, అక్షయ
తల్లిదండ్రులుయల్లప్ప, బాలమ్మ

జననం, విద్యాభాస్యం

మార్చు

అంజి వల్గుమాన్ తెలంగాణ రాష్ట్రం, గద్వాల్ జిల్లా, గద్వాల మండలం, జమ్మిచేడ్ గ్రామంలో 1984 జూలై 1న బాలమ్మ, యల్లప్ప దంపతులకు జన్మించాడు.

డిగ్రీ వరకు గద్వాల్ లో పూర్తిచేసిన అంజి, నటనపై ఆసక్తితో ఆ తర్వాత 2006లో హైదరాబాదుకు వెళ్ళి సినిమాల్లో ప్రయత్నం చేస్తూ, 2006లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎంఏ థియేటర్ ఆర్ట్స్ (రంగస్థల కళలు)లో చేరి దాదాపు 300కు పైగా నాటకాల్లో నటించాడు.[2]

కళారంగం

మార్చు

అంజి వల్గుమాన్ స్వయంగా రాసి దర్శకత్వం వహించిన వినాశి, బ్లాక్ అండ్ వైట్ నాటకాలను రవీంద్రభారతిలో ప్రదర్శించాడు. ఆయన 2009లో 'ఈటీవీలో కామెడీ గ్యాంగ్' షోలో పాల్గొని ఉత్తమ ప్రదర్శన ఇచ్చి బెస్ట్ విన్నర్ గా నిలిచి, అనంతరం కొన్ని ధారావాహికల్లో నటించిన 2013లో ఈటీవీ జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర, పటాస్ ప్రకాశ్ టీంలో దాదాపు 80కి పైగా ఎపిసోడ్ లలో కామెడీ స్కిట్లు చేశాడు.

నటించిన సినిమాలు

మార్చు

వెబ్ సిరీస్

మార్చు

మూలాలు

మార్చు
  1. V6 Velugu (28 June 2023). "గద్వాల్ టు భీమదేవరపల్లి..అంజి". Archived from the original on 1 July 2023. Retrieved 1 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (10 February 2023). "చిత్రసీమలో నడిగడ్డ బిడ్డలు". Archived from the original on 1 July 2023. Retrieved 1 July 2023.
  3. Prajasakti. "కడుపుబ్బా నవ్వించే 'పరేషాన్‌'" (in ఇంగ్లీష్). Archived from the original on 1 July 2023. Retrieved 1 July 2023.
  4. Eenadu (21 June 2023). "₹5ల భోజనం తిని.. కలను సాకారం చేసుకుని.. అంజి వల్గమాన్‌ సినీ ప్రయాణమిదీ". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.