జోగి నాయుడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జోగి నాయుడు ఒక తెలుగు సినీ నటుడు. 100 సినిమాలకు పైగా ఎక్కువగా సహాయ పాత్రలలో నటించాడు. 1998 లో జెమిని టీవీలో ప్రసారమైన జోగి బ్రదర్స్ అనే కార్యక్రమంతో పేరు తెచ్చుకున్నాడు. ఈ కార్యక్రమంలో మరో వ్యాఖ్యాత కృష్ణంరాజుతో కలిసి సినిమాల గురించి ఉత్తరాంధ్ర యాసతో మాట్లాడుతూ సమీక్షించేవారు[1]
జోగి నాయుడు | |
---|---|
వృత్తి | నటుడు, వ్యాఖ్యాత, స్క్రిప్టు రచయిత |
జీవిత భాగస్వామి | ఝాన్సీ (2001-1014) |
2001 లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది సినిమాతో వెండితెరపై కనిపించాడు. స్వామిరారా సినిమాతో జోగి బ్రదర్స్ మంచి గుర్తింపు వచ్చింది.[2]
దర్శకుడు అవుదామని హైదరాబాదుకు వచ్చిన జోగి నాయుడు టీవీ రంగంలో ప్రవేశించాడు. కొద్ది రోజులు పూరీ జగన్నాథ్, కృష్ణవంశీతో కలిసి పనిచేశాడు. ఒక రికార్డింగు స్టూడియో కూడా ప్రారంభించాడు. ప్రముఖ వ్యాఖ్యాత, నటి యైన ఝాన్సీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ధన్య అనే కుమార్తె జన్మించింది. తరువాత వీరు మే 2014 లో విడాకులు తీసుకున్నారు.
నటించిన సినిమాలుసవరించు
- మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది
- అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
- సుబ్బు
- ఠాగూర్
- సారాయి వీర్రాజు
- టైం పాస్
- వాసు
- స్వామిరారా
- చల్ చల్ గుర్రం
- కార్తికేయ
- సారాయి వీర్రాజు (2009)
- జలక్ (2011)
మూలాలుసవరించు
- ↑ సురేష్, కవిరాయని. "No regrets about life, says Jogi Naidu". deccanchronicle.com. వెంకట్రామి రెడ్డి. Retrieved 24 September 2016.
- ↑ విలేఖరి. "అప్పుడూ ఇప్పుడూ వాళ్లే నాకు అండ!". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 24 September 2016.