ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. సినిమా దర్శకుడు పి.వాసు మిత్రుడు భారతితో కలిసి భారతీ వాసు పేరుతో దర్శకత్వం వహించిన సినిమా. గజలక్ష్మి కంబైన్స్ పతాకంపై విమల్ కుమార్, విజయలక్ష్మి నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజ్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎన్‌టి రామారావు లేకుండా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం. [1] [2] [3]

సాహసమే జీవితం
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం భారతీ,వాసు (పి.వాసు)
నిర్మాణం విమల్ కుమార్,
విజయలక్ష్మి
కథ భారతీ వాసు
చిత్రానువాదం భారతీ వాసు
తారాగణం బాలకృష్ణ,
విజ్జీ,
కొంగర జగ్గయ్య
సంగీతం ఇళయరాజా
సంభాషణలు గణేష్‌ పాత్రో
ఛాయాగ్రహణం ఎం.సి.శేకర్
కూర్పు లెనిన్, విజయన్
నిర్మాణ సంస్థ గజలక్ష్మీ కంబైన్స్
విడుదల తేదీ జనవరి 6,1984
భాష తెలుగు

చిత్రకథసవరించు

రవి (నందమూరి బాలకృష్ణ) మధ్యతరగతి లెక్చరర్ సత్యం (ప్రభాకర్ రెడ్డి) కుమారుడు. ఛాయ (విజ్జి) గుప్తా (జగ్గయ్య) అనే లక్షాధికారి కుమార్తె. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతారు, ప్రేమలో పడతారు. ఎప్పటిలాగే, గుప్తా అంతస్తుల అంతరాన్ని తెచ్చి వారిని విడదీయడానికి ప్రయత్నిస్తాడు. వీరి ప్రేమను మిగతావిద్యార్థులు ఎలా సఫలంచేశారన్నిది చిత్రకథనం.

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు ఇలయరాజా సంగీతం సమకూర్చాడు. ఎకో ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.

ఎస్. పాట గాయనీ గాయకులు నిడివి
1 "సాగాలి మన యాత్ర" కెజె యేసుదాస్ 4:01
2 "బాదలోమే చంద్రమా" కెజె యేసుదాస్ 1:18
3 "ప్రేమ నిధికి విరాళము" కెజె యేసుదాస్ 4:26
4 "మబ్బుల్లో చందమామ" కెజె యేసుదాస్ 3:40
5 "వెయ్యండి బాగా వెయ్యండి" ఎస్పీ బాలు 4:28
6 "బ్రేక్ వేస్తే" కె.జె. యేసుదాస్, ఎస్.జానకి 4:18

మూలాలుసవరించు

  1. Heading. gomolo.
  2. Heading-2. Nth Wall.
  3. Heading-3. smarttakies.com.