సింగూర్ డ్యాంతెలంగాణలోనిసంగారెడ్డి జిల్లా పట్టణానికి సమీపంలోని సింగూర్ గ్రామంలో ఉంది.[1][2] ఇది నీటిపారుదల, జలవిద్యుత్, తాగునీటి ప్రాజెక్ట్ గా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరానికి త్రాగునీరు సింగూర్ డ్యాం నుండే వస్తుంది.[3][4] సింగూర్ డ్యాం మంజీరా నదిపై నిర్మించబడింది. 1989లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ డ్యాం 29 Mcftల నీటి నిల్వ సామర్థ్యం కలిగివుంది.