సింధూరి, దక్షిణ భారత సినిమా నటి. తమిళ, తెలుగు, మలయాళ సినిమాలలో నటించింది. 2003లో బాయ్స్ సినిమా ద్వారా తమిళ సినిమారంగంలోకి అరంగేట్రం చేసిన తరువాత, 2004లో సూపర్ డా, 2007లో గుండమ్మగారి మనవడు వంటి సినిమాలలో నటించింది.

సింధూరి
జననం
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం

సినిమారంగం మార్చు

2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ (2003) సినిమాలో సహాయక పాత్రను పోషించడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అందులో జెనీలియా నలుగురు స్నేహితులలో ఒకరిగా కనిపించింది. ఆ తరువాత తాతి తవాదు మనసు (2003), ఎన్నవో పుడిచిరుక్కు (2004) సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించింది.[1] సూపర్ డా (2004), ఉనార్చిగల్ (2006) నటించింది. కన్నమపేటై, ఫ్లవర్స్ వంటి ఇతర సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.[2]

2007లో గుండమ్మగారి మనవడు అనే హాస్య తెలుగు సినిమాలో నటించింది. మలయాళ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి, శంబుతో 2004లో తీసిన సినిమా 2008లో థియేట్రికల్ విడుదలైంది.[3] ఆకర్షణీయమైన ఫోటోషూట్లలో పాల్గొంది, ఐటెమ్ పాటల్లో నటించడానికి ఆమె ఆసక్తిని వ్యక్తం చేసింది. [4]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2003 బాయ్స్ అంకిత తమిళం
తాతి తవాధు మనసు అముధ తమిళం
2004 ఎన్నవో పుడిచిరుక్కు సంగీత తమిళం
సూపర్ డా మీనాక్షి తమిళం
2007 గుండమ్మగారి మనవడు మహాలక్ష్మి తెలుగు
నీరం శ్వేత తమిళం
2008 శంబు అపర్ణ మలయాళం
2013 కదల్ కిలుకిలుప్పు ఉమా మహేశ్వరి తమిళం
2019 బూమేరాంగ్ శక్తి స్నేహితురాలు తమిళం
2019 ఎనై నోకి పాయుమ్ తోటా శరణ్య తమిళం

మూలాలు మార్చు

  1. http://www.behindwoods.com/tamil-movie-news/may-06-03/19-05-06-sindhuri.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-17. Retrieved 2021-05-22.
  3. http://www.indiaglitz.com/shambu-malayalam-movie-preview-8759.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-17. Retrieved 2021-05-22.