గుండమ్మగారి మనవడు

బి.జయ దర్శకత్వంలో 2007లో విడుదలైన తెలుగు సినిమా

గుండమ్మగారి మనవడు, 2007 ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బ్యానరులో వెంకట్ నిర్మాణ సారథ్యంలో బి.జయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలీ, సింధూరి, నికోల్ నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1]

గుండమ్మగారి మనవడు
దర్శకత్వంబి. జయ
దృశ్య రచయితబి. జయ
వెలిగొండ శ్రీనివాస్ (మాటలు)
కథబి. జయ
నిర్మాతఆర్.ఆర్.వెంకట్
తారాగణంఅలీ
సింధూరి
నికోల్
ఛాయాగ్రహణంపూర్ణ కాండ్రు
కూర్పుఅవుల వెంకటేష్
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
ఆర్.ఆర్. మూవీ మేకర్స్
విడుదల తేదీ
28 ఏప్రిల్, 2007
సినిమా నిడివి
134 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశంసవరించు

ఇది అమ్మమ్మ-మనవడు అనుబంధాన్ని సూచించే సినిమా. ఏడుకొండలు (అలీ) తల్లి మరణించిన తరువాత అతని అమ్మమ్మ గుండమ్మ (వడివక్కరసి ) చూసుకుంటుంది. అతని తండ్రి శ్రీశైలం (తనికెళ్ళ భరణి) మద్యపానంకి అలవాటు పడుతాడు. ఏడుకొండలు ఆ ఊరి అమ్మాయి మహాలక్ష్మి (సింధూరి) ని ప్రేమిస్తుంటాడు. కాని ఆమె తండ్రి నీలకంఠ (కోట శ్రీనివాసరావు) అత్యాశగల వ్యక్తి, అతని అల్లుడు ఒక హోటల్ కలిగి ఉండాలని కోరుకుంటాడు. దాంతో, తన అమ్మమ్మ సహాయంతో (ఆమె తన ఆభరణాలను అమ్ముతుంది) ఏడుకొండలు ఒక హోటల్ ఏర్పాటు చేస్తాడు.

నీలకంఠ అయిష్టంగానే పెళ్ళికి అంగీకరిస్తాడు, కాని తరువాత తన కుమార్తెకు మంచి సంబంధం రావడంతో ఈ పెళ్ళిని విరమించుకుంటాడు. ఏడుకొండలును కొట్టి రైల్వే ట్రాక్‌పై పడవేస్తారు. గాయపడిన అతను ట్రాక్స్‌పై కారులో ఇరుక్కున్న అమ్మాయి (నికోల్) ను రక్షిస్తాడు. పెద్ద హోటల్ చేయడానికి వారు సహాయం చేస్తాడు. అప్పుడు ఏడుకొండలు మహాలక్ష్మి నుండి దూరం అవుతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[2]

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. తనికెళ్ళ భరణి, కలువకృష్ణసాయి, పైడిశెట్టి రాము, బాలాదిత్య పాటలు రాశారు.[3][4][5]

 1. భలే భలేటి మందు - తనికెళ్ళ భరణి
 2. బ్రహ్మే ఎదురుగ వచ్చి - కారుణ్య
 3. చంగావి రంగు చీర - రఘు కుంచే, సునీత
 4. మాలచ్చిమి - జెస్సీగిప్ట్
 5. ఒక్కసారి ఒక్కసారి - జెస్సీగిప్ట్, కల్పన
 6. ఓరోరి ఏడుకొండలు -
 7. ఏ దేవుని -

మూలాలుసవరించు

 1. "Gundamma Gari Manavadu - Movie Review - Chalanachithram.com - The Biggest Telugu Movie Database". www.chalanachithram.com. Retrieved 2021-05-22.
 2. "The Hindu : Friday Review Hyderabad / On Location : Humour and sentiment". web.archive.org. 2007-05-15. Retrieved 2021-05-22.
 3. "Gundamma Gaari Manavadu 2007 Telugu Movie Songs Mp3 Download Free Naasongs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-22.
 4. admin. "Gundamma Gaari Manavadu (2007) Telugu Songs Download | Naa Songs" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-22.
 5. "Gundammagari Manavadu Music review songs lyrics". IndiaGlitz.com. Retrieved 2021-05-22.