సింహస్వప్నం (1989 సినిమా)

1989 భారతీయ తెలుగు సినిమా

సింహస్వప్నం 1989 లో విడుదలైన క్రైమ్ చిత్రం. దీనిని జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించగా, వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణరాజు, జయసుధ, జగపతి బాబు, వాణి విశ్వనాథ్, శాంతిప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం హిందీ చిత్రం ఖత్రోన్ కే ఖిలాడి (1988) కి రీమేక్. ఇది జగపతి బాబు హీరోగా ద్విపాత్రాభినయంతో తొలి చిత్రం.[1][2]

సింహ స్వప్నం
(1989 తెలుగు సినిమా)
Simha Swapnam.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం వి.బి.రాజెండ్ర ప్రసాద్
కథ ఎం.డి.సుందర్
చిత్రానువాదం వి. మధుసూదనరావు
తారాగణం గిరిబాబు ,
జగపతిబాబు
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు డి. ప్రభాకర్
ఛాయాగ్రహణం డి. ప్రసాద్ బాబు
కూర్పు ఎ. శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

కథసవరించు

బలరాం ( కృష్ణంరాజు ) రఘుపతి ( రంగనాథ్ ), రంగపతి ( అహుతి ప్రసాద్ ) ల రవాణా సంస్థలో పనిచేసే లారీ డ్రైవరు. వారి బంగారం అక్రమ రవాణా గురించి బలరాం సోదరుడు తెలుసుకుంటాడు. దాంతో రఘుపతి అతన్ని చంపి ఆ కేసులో బలరాంను ఇరికిస్తాడు, ఈ కారణంగా అతను జైలుకు వెళ్తాడు. బలరాం భార్య అన్నపూర్ణ ( జయసుధ ) కు రాజేష్, హరీష్ ( జగపతి బాబు ) అనే కవలు పుడతారు. ఆమె తన కవలలలో ఒకరిని నమ్మకమైన స్నేహితుడికి ఇచ్చి, వాడిని పెంచే బాధ్యతను అప్పజెబుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ బలరాం వ్యాపారవేత్త అయి తన పేరును కృష్ణార్జున్ గా మార్చుకుంటాడు. కోర్టు నుండి తప్పించుకున్న నేరస్థులను సింహస్వప్నం పేరుతో చంపేస్తూంటాడు. బలరాం తన ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు, కుటుంబం ఎలా ఏకం అవుతుందనేది మిగతా కథ.

తారాగణంసవరించు

పాటలుసవరించు

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "కళ్ళలోన నీవే, గుండెలోన నీవే"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 3:29
2. "చలికి వణికి"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:15
3. "జిగి జిగి"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:26
4. "తొలి కౌగిలింత"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:22
5. "ఉరిమి ఉరిమి"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:52
6. "కళ్ళలోన నీవే" (Sad)ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:23

మూలాలుసవరించు

  1. "Heading". IMDb.
  2. "Heading2". TeluguCinema. Archived from the original on 2015-02-11. Retrieved 2020-08-19.