నర్రా వెంకటేశ్వర రావు

సినీ నటుడు
(నర్రా వెంకటేశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)

నర్రా వెంకటేశ్వర రావు తెలుగు నటుడు.[1] ఎక్కువగా సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రలలో నటించాడు. ముప్ఫై సంవత్సరాలకి పైగా నటనానుభవం కలిగిన ఆయన సుమారు 500 సినిమాలకు పైగా నటించాడు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా, అగ్రహారం గ్రామం.

నర్రా వెంకటేశ్వర రావు
జననం1947
మరణం2009 డిసెంబరు 27(2009-12-27) (వయసు 62)
హైదరాబాద్
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1974-2009
జీవిత భాగస్వామిసుశీల
పిల్లలుమురళి, వసంతలక్ష్మి

జీవిత విశేషాలుసవరించు

నర్రా వెంకటేశ్వర రావు 1947లో ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే నాటకాలలో నటించిన అనుభం ఆయనకుంది. ఆయన భార్య పేరు సుశీల. వారికి ఒక కొడుకు మురళి, ఒక కూతురు వసంతలక్ష్మి.

కెరీర్సవరించు

ఆయన 1974లో చదువు సంస్కారం అనే సినిమా తో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆయన చివరి సినిమా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన మేస్త్రి.

మరణంసవరించు

ఆయన డిసెంబరు 27, 2009న 62 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు.

నటించిన సినిమాల పాక్షిక జాబితాసవరించు

మూలాలుసవరించు

  1. "Telugu Movie Actor Narra Venkateswara Rao". nettv4u.com. Retrieved 13 September 2016.
  2. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.