సిట్రోనెల్ల నూనె

సిట్రోనెల్ల నూనె లేదా తెలుగులో నిమ్మక నూనె అనునది ఒక ఆవశ్యక నూనె,, సుగంధ తైలం. అంతియే కాదు ఔషధ గుణాలున్న నూనె. సిట్రోనెల్ల నిమ్మగడ్డి జాతికి చెందిన గడ్డి మొక్క. సిట్రోనెల్ల మొక్క గ్రామీనే (పోయేసి) కుటుంబానికి చెందిన మొక్క.సిట్రోనెల్ల గడ్దిలో రెండు రకాలున్నాయి. ఒకరకం సిట్రోనెల్ల గడ్డి యొక్క వృక్షశాస్త్ర పేరు సింబోపోగొన్ నర్దుస్ (ఆండ్రోపోగొన్ నర్డుస్ అనికూడా అంటారు).సాధారణ వ్యవహారంలో శ్రీలంక సిట్రోనెల్ల లేదా లేనబాటు సిట్రోనెల్ల అనికూడా అంటారు. సిట్రోనెల్ల నూనె ముఖ్యంగా కీటక వికర్షిణిగా (ముఖ్యంగా మలేరియా కల్గించు దోమలను పారద్రోలడం/వికర్షించడం) పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.గదులలో స్ప్రే చెయ్యడం వలన ఈ నూనె వెలువరిచే నూనె మనస్సుకు ప్రశాంతను కల్గించ్చును. నూనెను కొవ్వొత్తులలో, పరిమళ ద్రవ్యాలలో, సబ్బులలో, మఱియు చర్మ లేపనాలలో ఉపయోగిస్తారు.[1]

సిట్రోనెల్ల నూనె
సిట్రోనెల్ల లోని జెరానిఅల్, సిట్రోనెల్లొల్ లు

సిట్రోనెల్ల మొక్క మార్చు

సిట్రోనెల్ల నిమ్మగడ్డి జాతికి చెందిన గడ్డి మొక్క. సిట్రోనెల్ల మొక్క గ్రామీనే (పోయేసి) కుటుంబానికి చెందిన మొక్క.సిట్రోనెల్ల గడ్దిలో రెండు రకాలున్నాయి. ఒకరకం సిట్రోనెల్ల గడ్డి యొక్క వృక్షశాస్త్ర పేరు సింబోపోగొన్ నర్దుస్ (ఆండ్రోపోగొన్ నర్డుస్ అనికూడా అంటారు).సాధారణ వ్యవహారంలో శ్రీలంక సిట్రోనెల్ల లేదా లేనబాటు సిట్రోనెల్ల అనికూడా అంటారు. సిట్రోనెల్ల గడ్డి బహువార్షిక మొక్క.ఒక మీటరు ఎత్తువరకు పెరుగును.

నూనె సంగ్రహణ మార్చు

సిట్రోనెల్ల నూనెను ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను పద్ధతిలో సంగ్రహిస్తారు. గడ్డిని కత్తరించి, ఎండబెట్టి తరువాత నూనెను సంగ్రహిస్తారు. శ్రీలంక, జావాకు చెందిన సిట్రోనెల్ల గడ్డినుండి స్టీము డీస్టీలేసను పద్ధతిలో నూనెను ఉత్పత్తి చేస్తారు.[1] సిట్రోనెల్ల నూనెను ప్రధానంగా రెండు రకాల గడ్డి నుండి తీస్తారు, ఒకటి సింబోపోగొన్ నార్డుస్ (జోవిట్ట్) మరొకటి సింబో పోగొన్ వింటేరియనుస్ (రెండల్). ఈ రెండు నూనెలను రెండు పేర్లలో పిలుస్తారు. సింబోపోగొన్ నార్డుస్ గడ్డి నుండి తీసిన నూనె సిలోన్ సిట్రోనెల్ల నూనె అంటారు. ప్రస్తుతం శ్రీలంక అని పిలవబడే దేశం పేరు ఒకప్పుడు సిలోన్. ఇక జావా సిట్రోనెల్ల నూనె సింబో పోగొన్ వింటేరియనుస్ గడ్డి నుండి తీస్తారు.[2]

నూనె ఉత్పత్తి వివరాలు మార్చు

ప్రస్తుతం (2018నాటికి) సిట్రోనెల్ల నూనె ఉత్పత్తి సంవత్సరానికి 4వేల టన్నులు.ముఖ్యంగా ఈ నూనె ఉత్పత్తి దేశాలు అయిన చైనా, ఇండోనేసియా, ప్రపంచ ఉత్పత్తిలో 40% నూనెను ఉత్పత్తి చేస్తున్నాయి. తైవాన్, గాటెమాలా, హొండురాస్, బ్రెజిల్, శ్రీలంక, ఇండియా, అర్జెంటినా, జమైకా, ఈక్వడార్, మడగాస్కర్, మెక్సికో,, దక్షిణ ఆఫ్రికా దేశాలు కూడా సిట్రోనెల్ల ఆవశ్యక నూనెను ఉత్పత్తి చేస్తున్నవి.సిట్రో నెల్ల నూనెను కృత్రిమంగా కోనిఫర్ చెట్లనుండి తీసిన టెర్పెన్టైన్ నుండి కూడా తయారు చేస్తున్నారు. అయితే పరమళ ద్రవ్య ఉత్పత్తి పరిశ్రమల వారు సహజ నూనెకే ప్రాధాన్యత ఇస్తున్నారు.[3]

సిట్రోనెల్ల నూనె మార్చు

సిట్రోనెల్ల నూనె నిమ్మవంటి వాసనతో కొంచెం తియ్యని గుణాన్ని కల్గి వుండును.[1].గడ్డి నుండి నూనె దిగుబడి1.2-1.4%వరకు ఉండును.

నూనెలోని రసాయన పదార్థాలు మార్చు

నూనెలోని ప్రధాన రసాయన సంయోగ పదార్థాలు సిట్రోనెల్లిక్ ఆమ్లం, బోర్నియోల్, సిట్రోనెల్లోల్, జెరానియోల్, నేరోల్, సిట్రాల్, సిట్రోనెల్లాల్, కాంపేన్, డైపెంటెన్, లేమోనెన్.[1] సిట్రోనెల్ల నూనెను ప్రధానంగా రెండు రకాల గడ్డి నుండి తీస్తారు ఒకటి సింబోపోగొన్ నార్డుస్ (జోవిట్ట్) మరొకటి సింబో పోగొన్ వింటేరియనుస్ (రెండల్). ఈ రెండు నూనెలను రెండు పేర్లలో పిలుస్తారు. సింబోపోగొన్ నార్డుస్ గడ్డి నుండి తీసిన నూనె సిలోన్ సిట్రోనెల్ల నూనె అంటారు. ప్రస్తుతం శ్రీలంక అని పిలవబడే దేశం పేరు ఒకప్పుడు సిలోన్. ఇక జావా సిట్రోనెల్ల నూనె సింబో పోగొన్ వింటేరియనుస్ గడ్డి నుండి తీస్తారు.పైన పెర్కోన్న రెండు రకాల సిట్రోనెల్ల నూనెలో దాదాపు 80 రకాల రసాయనాలు ఉన్నాయి.అందులో 50 వరకు నూనెలో 90శాతం వుండును.అందులో కొన్ని ప్రధాన మైన రసాయన పదార్థాలను పట్టికలో ఇవ్వడమైనది.[2]

రసాయన పదార్థం సిలోన్ సీట్రోనెల్లనూనె జావా సీట్రోనెల్లనూనె
జెరానియోల్ 18-20 21-24
సిట్రోనెల్లాల్ 5-15 32-45
సిట్రోనెల్లోల్ 6.4-8.4 11-15
జెరానైల్ అసిటేట్ 2.0 3-8
లిమోనేన్ 9-11 1.3-3.9
మిథైల్ ఐసో యూజెనోల్ 7.2-11.3 --
ఎలెమోల్, సెస్కిటేరిపెన్ ఆల్కహాలులు -- 2-5

నూనె యొక్క భౌతిక గుణాలు మార్చు

నూనె నీటి కన్న కొద్దిగా తక్కువ సాంద్రత కల్గి ఉంది.నూనె పాలిపోయిన పసుపు లృదా ముదురు పసుపు రంగులో వుండును.

నూనె యొక్క భౌతిక గుణాల పట్టిక[4]

వరుస సంఖ్య భౌతిక ధర్మం మితి విలువ
1 విశిష్ట గురుత్వం,25 °C. 0.85000 to 0.92000
2 వక్రీభవన సూచిక,20 °C. 1.43000 to 1.52000
3 దృశ్య భ్రమణం -7.00 to +7.00
4 బాష్పీభవన స్థానం 215.00 °C.
5 ఫ్లాష్ పాయింట్ 79.44 °C.

నూనె యొక్క వైద్యపరమైన గుణాలు మార్చు

యాంటీ సెప్టిక్, బ్యాక్టరీయాసీడాల్, డియోడరెంట్, పారసిటిక్, ఇన్సెక్టిసైడ్, డైయ ఫోరెటిక్ గుణాలు కల్గి ఉంది.[1]

నూనె వాడకంలో తిసుకోవలసిన జాగ్రత్తలు మార్చు

సున్నితమైన చర్మం కల్గిన వారు వాడిన చర్మంపై వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు.

నూనె ఉపయోగాలు మార్చు

  • సిట్రో నెల్ల నూనె వొంటి పేలను, తలపేలను,, ఈగలను నివారించుటలో సమర్ధ వంతంగా పనిచేయును.[5][6][7]

బయటి వీడియోల లింకులు మార్చు

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Citronella essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-03-31. Retrieved 2018-10-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "Citronella Oil: More Than Just a Bug Repellent". articles.mercola.com:80. Archived from the original on 2017-08-29. Retrieved 2018-10-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. FOODNET, The Association for Strengthening Agricultural research in Eastern and Central Africa "Archived copy". Archived from the original on 2012-08-03. Retrieved 2018-10-17.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "citronella oil". thegoodscentscompany.com. Archived from the original on 2018-03-12. Retrieved 2018-10-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. Mumcuoglu, Kosta Y.; Galun, Rachel; Bach, Uri; Miller, Jacqueline; Magdassi, Shlomo (1996). "Repellency of essential oils and their components to the human body louse, Pediculus humanus humanus". Entomologia Experimentalis et Applicata. 78 (3): 309–14. doi:10.1111/j.1570-7458.1996.tb00795.x.
  6. Mumcuoglu, KY; Magdassi, S; Miller, J; Ben-Ishai, F; Zentner, G; Helbin, V; Friger, M; Kahana, F; Ingber, A (2004). "Repellency of citronella for head lice: Double-blind randomized trial of efficacy and safety". The Israel Medical Association Journal. 6 (12): 756–9. PMID 15609890.
  7. "Dtic.mil" (PDF). Archived from the original (PDF) on 2017-02-21. Retrieved 2018-10-17.