ఆవశ్యక నూనె

(సుగంధ తైలం నుండి దారిమార్పు చెందింది)

ఆవశ్యక నూనెలు (ఆంగ్లం: Essential Oils) అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు నూనెలు. ఆవశ్యక నూనెలలో అత్యధిక భాగం మొక్కల/చెట్ల భాగాలనుండి అనగా ఆకులు, వేర్లు, కాండం ల బెరడు, కాండం, పూమొగ్గలు, పూలరెమ్మలు, పళ్ల పైనున్న తొక్కలు (peels/skins) వంటి వాటిలో లభించును.[1] అతితక్కువగా కొన్ని రకాల ఆవశ్యక నూనెలను విత్తానాల నుండి తీయుదురు. వీటిని నూనెలని వ్యవహరించినను వీటిలో కొవ్వు ఆమ్లాలు వుండవు. ఆవశ్యక నూనెలు జలవికర్షణ (hydrophobic) లక్షణం కలిగి, నూనెలలో, హైడ్రొకార్బను సాల్వెంట్ లలో కరుగు లక్షణాలు కలిగి వుండును. ఆవశ్యక నూనె లన్నియు సువాసన కలిగిన నూనెలే. ప్రతి ఆవశ్యక నూనె తనకంటూ ఇక ప్రత్యేక వాసన కలిగి వుండును. ఆవశ్యక నూనెలలో ఒకటి రెండు మినగా యించి మిగతా నూనెలన్నియు తక్కువ బాష్పికరణ/మరుగు ఉష్ణోగ్రత వున్న నూనెలే.తక్కువ ఉష్ణోగ్రత వద్దనే బాష్పీకరణ చెందు ద్రవాలను ఒలటైలులు (volatiles) అంటారు. ఆవశ్యకనూనెలను మొక్కల/చెట్ల యొక్క ఎసెన్సు (Essence=సారం) లు అని కూడా అంటారు. ఆవశ్యక నూనెలు సువాసన భరితాలు కావటం వలన అనాదిగా వీటిని సువాసన/సుగంధ ద్రవ్యాలు/నూనెలుగా (perfumes), సౌందర్య లేపనాలలో/నూనెలలో (cosmetics) విరివిగా వాడెవారు. అలాగే సుధూప (incense) ద్రవ్యాలను (అగరుబత్తి, గుగ్గిలం, సాంబ్రాణి, వంటివి) కూడా ఆవశ్యక నూనెల నుండి తయారు చేసెవారు. దేశియ వైద్యవిధానాలలో దేహబాధ నివారణ (కండరాల, కీళ్ళ నొప్పులు) కై మర్ధన నూనెలుగా కొన్ని ఆవశ్యక నూనెలను ఉపయోగించెవారు. కొన్ని రకాల చర్మ వ్యాధులకు ఆవశ్యక నూనెలను వినియోగించెవారు. ఈ మధ్యకాలంలో అరోమ థెరపి (aromatherapy) అనే ప్రత్యాన్యమయ వైద్య విధానం ఒకటి బాగా ప్రాచర్యం పొందినది. ఈ అరోమ థెరపి[2]లో ఆవశ్యక నూనెలను వాడెదరు. క్రీస్తుకు పూర్వం 1800సంవత్సరంనాటీకీ ఆవశ్యకనూనెలను అరోమా థెరఫిలో ఉపయోగించినాట్లు తెలుస్తున్నది.భారతదేశంలో ఆయూర్వేదవైద్యంలోకూడా కొన్నివందలసంవత్సరాలుగా వాడిన దాఖాలాలు కన్పిస్తున్నాయి. క్రీ.పూ.2880నాటికే గ్రీసు, రోములలో పురాతన ఈజిప్టు పాలకుడు ఖుఫు (khufu) పాలనకాలంనాటికే సుగంధద్రవ్యాలలో, అవశ్యకపునూనెలను కలిపి ఉపయోగించినట్లుగా తెలుస్తున్నది[3]

ఒక గాజు నాళంలో చందనపు తైలం.

ఆవశ్యక నూనెలను కలిగి వున్న మొక్కలు/చెట్లు

మార్చు

ఆవశ్యకనూనెలు మొక్కలలో లభించు/వుండు భాగాలను బట్టి వాటిని స్తూలంగా దిగువ విధంగా వర్గికరించ వచ్చును. కొన్ని మొక్కలనుండి ఆవశ్యక నూనెలను వేరు చేసి ఉపయోగించగా, కొన్నింటిని మాత్రం ఘనరూపంలో అనగా మొక్కభాగంగానో, విత్తనాలగా నేరుగా ఆహారంలో లేదా ఇతరాత్ర కూడా ఉపయోగిస్తారు. అల్లం, శొంఠి, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, కర్రివేపాకు, ఎలక్కి, దాల్చినచెక్క వంటి పలు ద్రవ్యాలు ఆవశ్యక నూనెలను కలిగి వున్నవే.[3] వీటిని దంచి లేదా పొడిగా చేసి ఆహారంలో సువాసన కల్గించుటకు, ఆహరానికి రుచిని కల్గించుటకు వాడటం పరిపాటి. అయితే ఆవశ్యక నూనెలు కలిగిన మొక్కభాగాలు, విత్తానాలు అన్నియు అహార యోగ్యం కాదు. కొన్నింటిని మాత్రమే ఆహరపు వంటలలో చేర్చవచ్చును.

పత్రాలలో/ఆకులలో ఆవశ్యక నూనెలు లభించు మొక్కలు[4]

మార్చు
 
గంధపు తైలం డిస్టిల్లేషన్.
  • నీలగిరి చెట్టు/యూకలిప్టస్:యుకలిఫ్టస్ చెట్ల ఆకులనుండి హైడ్రొ డిస్జ్టిలెసన్ పద్ధతిలో నూనెను ఉత్పత్తి చేయుదురు.ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చెయ్యబడుచున్న ఆవశ్యక నూనె యిది.ఈ చెట్టు మిర్టెసి కుటుంబానికి, యుకలిప్టస్ ప్రజాతికి చెందిన మొక్క.సతత హరితం.దాదాపు 700 జాతుల (species) మొక్కలు ఉన్నాయి.ఇవి 10 మీటర్ల ఎత్తు నుండి60 మీటర్ల ఎత్తు వరకు పెరగును.యుకలిప్టస్ నూనెను ఔషదంగా పలు రకాలుగా వాడెదరు.గ్రామీణ ప్రాంతాలలో ఈ నూనె ఒక రకంగా సకలరోగ నివారిణి. తలనొప్పికి, జలుబుకు, కీళ్లనొప్పులకు, ఒంటినొప్పులకు, అజీర్తికి, పంటినొప్పి, ఇలా పలురకంలుగా వినియోగిస్తారు.50-60 సంవత్యరాలక్రితం ప్రతి ఇంటిలో ఈ నీలగిరి/జామాయిల్ నూనె సీసా వుండెది.తలనొప్పికి నుదుటికి కణతలకి పూసేవారు.జలుబు చేసిన వేడి నీటిలో వేసి వాసన చూడటంకాని, లేదా నేరుగా నూనె సీసాను ముక్కు దగ్గర వుంచి వాసన పిల్చెవారు.కడుపు నొప్పికి రెండు, మూడు చుక్కల నీలగిరి తైలాన్ని వేడి నీటిలో వేసి త్రాగేవారు.పంటినొప్పికి నీలగిరి తైలంలో ముంచిన దూదిని పంటి మీద నొక్కి వుంచేవారు.కీళ్లనొప్పులకు, ఒంటినొప్పులకు ఈ నూనెను నేరుగా కాని లేదా కొబ్బరినూనెతో కలిపి రుద్దేవారు.దగ్గు మందు నివారిణిగా కూడా.ఈ నూనె ఒకరకమైన ఘటైన వాసన కలిగిన నూనె.జె ర్మిసైడ్ గా, ఇన్‍సెక్ట్ సైడ్ గాను పనిచేస్తుంది.టూత్ పేస్ట్ లలోదగ్గు మందులలో వినియోగిస్తారు.
  • గోరింట/గోరింటాకుచెట్టు:గోరింట లేదా హెన్నా చెట్టు లైత్రెసియే (lythracea) కుటుంబానికి చెందిన మొక్క.చిన్న చెట్తు.2.5-3.0మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.గోరింటాకును చేతులకు, గోర్లకు, పాదాలకు రంగునిచ్చుటకై పెట్తుకోవటం ఆనాదిగా ఉంది.గోరులకు (nails) పెట్టుకొనే ఆకులవలన గోరింటాకు (గోరు+అంటు+ఆకు) అనేపేరు వచ్చి వుండవచ్చును.గోరింటాకును ముద్దగా చేసి చేతులకు, గోర్లకు పెట్తుకొనెదరు.కొన్ని గంటలతరువాత ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగు వచ్చును.గోరింటాకులనుండి ఆవశ్యకనూనెను మరెదైన నూనె/కొవ్వులో శోషింపచేయ్యడం (absorption or enfleurage) ద్వారా తయారు చేయుదురు.ఈ విధంగా ఉత్పత్తి ఛెసిన నూనెను కేశ తైలంగా ప్రముఖంగా వినియోగిస్తారు.
  • పుదీనా: ఈ మొక్క లామియేసియే కుటుంబానికి చెందిన మొక్క. ప్రజాతి: మెంథ. ఈ మొక్క వృక్షశాస్త్రనామం మెంథ అర్వెన్‍సిస్ (memtha arvensis, ఇది బహువార్షిక మొక్క.పుదీనా ఆకులు, కాండం, వేర్లు కూడా ఉపయోగకరమే. పుదినా ఆకులను ఆహారంలో వాడెదరు.ముఖ్యంగా పచ్చళ్లలో వినియోగం ఎక్కువ . ఈ మొక్క అవశ్యక నూనెలో మెంథల్ అధికం.దాదాపు18 రకాల మొక్కలున్నాయి.మింట్ ను అధికంగా వున్న ఈ కుటుంబానికి చెందిన మరోమొక్క మెంథ లాంగిఫొలియో.

ఈ మొక్కల ఆవశ్యక నూనెను అంటి సెఫ్టిక్ మందులలో, టూత్ పెస్ట్ లతయారిలో, చుయింగ్ గమ్ లలో, డెసెర్టలలో, కెండిస్ (candies) లలో వినియోగిస్తారు.ఈ మొక్క ఆవశ్యక నూనెను కడుపు నొప్పి, ఛాతి నొప్పి, లకు ఆకును నీటిలో మరగించి త్రాగడం గ్రామాలలో సాధారణం.పుదీనా నూనెను అరోమా థెరపి, కాస్మాటిక్సు, పెర్‍ఫ్యుం లలో, మౌత్‍వాష్ లోషన్ లలో వినియోగిస్తారు. తలనొప్పి, జలుపు పూత మందులలో పుదీనా ఆవశ్యక నూనెను వాడెదరు.

  • కొత్తిమీర:కొత్తిమీర అసియెసియే కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క వృక్షశాస్త్రనామం, కరియండం సటివుమ్ (cariandum sativum) . ఈ మొక్క ఏక వార్షికం. ఈ మొక్క ఆకులు కాండాన్ని పచ్చిగా వుండగానే కూరలలో వాసన, రుచిని యిచ్చుటకై వాడెదరు. కూరలలో ఈ మొక్క ఆకును చిన్న ముక్కలుగా తరగి వాడెదరు. ముఖ్యంగా రసం, వారు, సాంబారు లాంతి వాటికి కొత్తిమీరను చేర్చడం వలన ప్రత్యేకమైన రుచి, వాసన వచ్చును. మసాలా దినుసులతో కూడా కలిపి వాడెదరు. ఎందబెట్టిన ఈ మొక్క విత్తనాలను ధనియాలు అంటారు. ధనియాలను కూడా పొడిగా దంచి కూరలలో, మాసాలా లలో వినియోగిస్తారు. ఈ మొక్క నూనెలో టర్పెనులు, లినెలూల్, పినెన్లు అధిక శాతంలో లభ్యం. ఈ మొక్క నూనెను ఆంటి అక్సిడెంట్సుగా, ఆంటి బాక్టిరియల్సుగా ఉపయోగిస్తున్నారు. ధనియాల పొ డిని వాడినచో మధుమేహ వ్యాధిని కొంతమేరకు నియంత్రణలో వుంచవచ్చును. అలాగే ధనియాల నూనెను డియురెటిక్ (diuretic=మూత్రం అధికంగా ఉత్పత్తి అయ్యెలా చెయ్యు) గా కూడా వినియోగిస్తారు.
  • దవనం:దవనం అస్తెరెసియే కుటుంబానికి చెందిన మొక్క. వృక్షశాస్త్రనామం: అర్లెమిసియ పల్లెన్స్ (arlemisia pallens) .ఇళ్లలోని కుండిలలో కూడా పెంచెదరు.ఆకులనుంది, పూలనుంది కూడా ఆవశ్యక నూనెను తీయుదురు.ఈ మొక్క ఆకులు సువాసన భరితంగా పచ్చగా వుండటం వలన పూలతో కలిపి దండలుగా అల్లెదరు.ఈ దవనం నూనె/దవనం ఆవశ్యక నూనెలో మిథైల్ సిన్నమెట్, ఇథైల్ సిన్నమెట్, వార్నెసొల్, లాక్టొనులు, గెర్మెనిల్ అసెటెట్ లున్నాయి.ఈ మొక్క నూనెను శరీర మర్ధననూనెలలో, సువాసన నూనెలలో కలుపుతారు.
  • బిరియాని ఆకు (Bay) : ఈ మొక్క లారియెసియే కుటుంబానికి చెందిన మొక్క.వృక్ష శాస్త్రనామం:లారస్ నొబిలిస్ (laurus nobilis) .ఈ మొక్క ఆకును ఆహారంలో సువాసన కల్గించుటకై వాడెదరు. ముఖ్యంగా బిరియాని/పలావు తయారిలో వాడెదరు.ఈ మొక్క ఆకును పలావు ఆకు అనికూడా అంటారు. ఈ మొక్క నూనెను సుగంధ నూనెలలో, ఆరొమా థెరపి లో, జలుబు, ఫ్లూ మందులలో, నీద్రలేమి నివారణ మందులలో, కీళ్ళ నొప్పుల నివారణ మందులలో వినియోగిస్తారు.
  • లెమన్‍గ్రాస్ ఆయిల్: లెమన్ గ్రాస్ పోయేసి కుటుంబానికి చెందిన గడ్దిజాతి మొక్క.గుబురుగా పొదలా పెరుగుతుంది. లెమన్‍గ్రాస్ మొక్కలు సుమారు 55 రకాల వరకు ఉన్నాయి.ఈ మొక్కల ఆకులను నీటి ఆవిరిద్వారా స్వేదనక్రియకు లోను కావించి ఉత్పత్తి చేయుదురు. ఈ మొక్క ఆకులనూనెలో సిట్రెనెల్లా అధిక శాతంలో ఉంది. ఈ లెమన్ గ్రాస్ ఆవశ్యక నూనెను సబ్బులతయారిలో, కీటక వికర్షణ మందులలో, కొవ్వొత్తులలో, అరోమ థెరపి మందులలో, వినియోగిస్తున్నారు.ఈ లెమన్ గ్రాస్ నూనెలో సిట్రెనెల్లాతో పాటు గెరమియల్ (geramiol) కూడా ఉంది.ఈ నూనె అంటిసెప్తిక్ గా కూడా పనిచేస్తుంది.ఈ నూనెను ఎరువులలో, కీటకనాశిని మందులలో కూడా వాడెదరు.
  • కర్పూరం మొక్క:కర్పూరాన్ని మొక్కలకాందంనుంచి, ఆకులనుండి కూడా తీయుదురు.ఈమొక్క లారెసియే కుటుంబానికి చెందినది.వృక్షశాస్త్రనామం చిన్నమం కంపొర (cinnamomum camphora.) . కర్పూరాన్ని రోజ్‍మరి (rosemarius officinalis) మొక్క ఆకులనుండికూడా తీయుదురు.కర్పూరాన్ని హిందువులు పూజ తరువత హరతిగా వెలుగించెదరు.హిందూదేవాలయాలలో దేవతా విగ్రహాలకు కర్పూర హరతి ఇవ్వడం సంప్రదాయం, ఆచారం.సెంటులలో కూడా కర్పూరాన్ని వాడెదరు.దేశియ వైద్యంలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు.పాములు, ఇతర సరీ సృపాలకు ఘటైన కర్పూర వాసన పడదు.అందుచే వాటిని పారత్రొలుటకు కర్పూరాన్ని పరిసరాలలో వుంచెదరు.కండరాలనొప్పుల నివారణకు, కొబ్బరి నూనెతో కలిపి మర్ధన చేయుదురు.కర్పూరంలోనే మరొ రకం పచ్చ కర్పురాన్ని తీపి తిబండారాలలో వాడెదరు.
  • లవంగం మొక్క (పత్రాలు) :ఈ మొక్క మిర్టెసియే కుటుంబానికి చెందిన మొక్క.మొక్క వృక్షశాస్త్రవామం: సిజియం అరొమటికమ్ (syzygium aromaticum) .లవంగ నూనెను సధారణంగా లవంగ పూవు యొక్క మొగ్గ నుంచి ఉత్పత్తి చేయుదురు.అయితే స్వప్ల ప్రమాణంలో లవంగ ఆకులనుండి కూడా స్వేదనం ద్వారా ఆవశ్యక నూనెను తీయుదురు[5]
  • Bishop weed
  • జామ (Guava) :ఈచెట్టు మిర్టెసియే కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్కలో 100 కి పైగా రకాలున్నాయి. పళ్లను ఆహారంగాను సాలడులలోని వినియోదొస్తారు. గామ ఆకులనుండి టియు నూనెను దేశియ వైద్యంలో వాడెదరు. లేత ఆకులను నీటిలో మరగించి టీని తయారు చేసి త్రాగించినచో విరేచనాలు కట్తును. అతి నీళ్ల విరేచనాలకు కూడా పని చేయును.మధుమేహ వ్యాధిని అదుపులో వుంచును. గామ ఆకు నూనె ఆస్ట్రిజెంట్ గా పనిచేయును. నొప్పులకు పనిచేయును.
  • తులసి ఆకుల నూనెను తులసి ఆకులనుండి తీస్తారు.
  • పుదీనా మొక్కనుండి, ఆకులనుండి పుదీనా నూనె స్టీము డిస్టిలేసను పద్ధతిలో తయారు చేస్తారు.
  • టీ ట్రీ అనేబడే అస్ట్రేలియాకు చెందిన చెట్తు ఆకులనుండిటీ ట్రీ నూనెను ఉత్పత్తి చేస్తారు.
  • సిట్రోనెల్ల గడ్డి నుండి సిట్రోనెల్ల నూనెను స్టీము డిస్టిలేసను పద్ధతిలో తయారు చేస్తారు

విత్తనాలలో/గింజలలో ఆవశ్యక నూనెలున్న మొక్కలు

మార్చు
 
గంధపు తైలం డిస్టిల్లేషన్.
  • మిరియాలు:ఈ మొక్క పిపెరెసియే కుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రవామము;పిపెర్ నిగ్రుం.బహు వార్షికం.ప్రాకుడు (లతా ప్రధానం) మొక్క.మిరియపు మొక్క నుండి రెండు రకాల మిరియాలను ఉత్పత్తి చేయుదురు.1.నల్లమిరియాలు, 2.తెల్ల మిరియాలు.మిరియాలు పూర్తిగా పండకముందే (దోరగా వుండగా) కోసి, వేడి నీళ్లలో వుడికించి, నీడలో ఆర/ఎండ బెట్టిన వాటిని నల్లమిరియాలు అంటారు.వేడి నీళ్లలో వుడికించి ఆరబెట్టటం వలన గింజ వెలుపలి పొర/తొక్క ముడతలు పడి నల్లగా మారును.తెల్ల మిరియాలను పూర్తిగా పండిన మిరియాలనుండి చేయుదురు.పండిన మిరియాలను ఒక వారం రోజులపాటు నీళ్లలో నాన బెట్టెదరు.ఇలా చెయ్యడం వలన గింజ వెలుపలి పొర/తొక్క బాగా మొత్తబడును.ఇప్పుడు గింజలను బాగా రుద్దటం వలన పై తొక్క తొలగి పొయ్యి తెల్లగా వున్న లోపలి గింజ కనిపించును.నల్ల మిరియాలను గ్రామీణ, సంప్రదాయ వైద్యంలో, ఆయూర్వేద వైద్యమందులలో వాడెదరు.వంటలలో మసాలా దినుసుగా కూడా విరివిగా వాడెదరు.నల్ల మిరియాలనుండి స్టీము డిస్టిలేసను విధ్హనంలో మిరియాల నూనెను ఉత్పత్తి చేస్తారు
  • ఏలకులు:ఇది జింజిబెరెసియే కుటుంబానికి చెందిన మొక్క. (అల్లం కూడా ఈ కుటుంబానికి చెందిన మొక్కయే) .రెండు రకాల ప్రజాతులు, 1.జి.ఎలెట్టెరియా. (Z.elettaria) 1.జి.అమొమమ్ (Z.Amomum, ఈ మొక్క పలుచటి పీచు పొరను వెలుపల కల్గి, లోపల నల్లటి విత్తానాని కల్గి వుండును.ఈ మొక్క గింజలు అతి ఖరీదైనవి.పై పొర, గింజ కూడా మంచి సువాసన, ఒక రకమైన ప్రత్యేక రుచి కల్గి వుంన్నాయి. ఎలెట్టెరియా మొక్క గింజలను/కాయలను అసలు ఎలక్కులని, పచ్చ ఎలక్కులని అంటారు.జి.అమొమం మొక్క కాయలను నల్ల ఎలక్కులని అంటారు.ఎలక్కి కాయలు మసాలా టీ నీ తయారుచేయుటకు, జీర్ణశక్తిని పెంచు మందులలో వాడెదరు.ఈ గింజ్లలోని పదార్థాలు అంటి డోట్ (విష విరుగుడు) గుణాలను కల్గి ఉంది. తేలు, పాము కాటు విరుగుడు మందులలో వాడెదరు.అరోమ థెరపిలో కూడా వినియోగిస్తారు.గింజల నుండిఏలకుల నూనెను ఆవిరిస్వేదన క్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు.
  • కారెట్:ఇది దుంప వేరు.ఎపియేసియే కుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్ర నామం:డౌకస్ కరోటా (daucus carota) .కారెట్ దుంపను, దాని ఆకులను కూడా వంటలలో/కూరలలో వాడెదరు.బి.కెరొటెన్ ను కల్గి ఉంది.ఈ దుంప ఆవశ్యక నూనెలో టెర్‍పెనులు, పెనొనులు అధికం.ఆక్సికరణ నిరోధ గుణమున్నది.కారెట్ నుంచి రసం (జ్యూస్) తీసెదరు.ఆరోగ్య కరమైన పానీయం.పాలి అసెటెలైన్ ను కల్గి ఉంది.
  • వేప:వేప చెట్టు మలియెసియే కుటుంబానికి చెందినది.ప్రజాతి అజాడిర క్టా (Azadirachta) .వృక్షశాస్త్ర నామం:అజడిరక్టా ఇండికా.ఈ చెట్టు యొక్క లేత ఆకులు, బేరడు, వేళ్ళు, ఘింజలు అన్నియు ఉపకరమైనవే. గింజలనుండి శాక నూనెను ఉత్పత్తి చేయుదురు.వేపనూనెను సబ్బులతయారి, పంటలనాసించు కీటకాల/పురుగులను నిరోధించు/నివారించు మందులలో వాడెదరు.ఎంద బెట్తిన వేప ఆకులను ధాన్యంతో పాతు నిల్వ చేసినచో, పురుగు పట్టదు.ఆకులరసంలో అంటి భయాతిక్ పదార్థాలున్నాయి.వేపనూనెలో ట్రై టెరెపెనొయిడులు, కాంప్ స్టెరొలు లున్నాయి.వేపనూనెను కీళ్లనొప్పుల వాతనొప్పుల మందులలో వాడెదరు.మలేరియా నివారణ మందులలో, ఆయుర్వేదంలో వాడుచున్నారు
  • ఆవాలు:వ్యవసాయ పంట మొక్క.బ్రాసియెసియే కుటుంబానికి చెందిన మొక్క.ఆవాలు పలురకాలున్నాయి.ఆవాలనుంది శాక నూనెను ఉత్పత్తిచేయుదురు.ఆవ నూనెను వంటలలో, నిల్వ పచ్చళ్ళ (pickles) తయారిలో విరివిగా వాడెదరు, ఆవ నూనెలో అలైల్ ఐసొథియొ చైనెట్ ఉంది.ఆవాలను పోపులో వాడెదరు.ఆవాలను దంచి, నీటిలో కలిపి స్టీం డిస్టిలెసను చెయ్యడం ద్వారా ఆవశ్యక నూనెను తయారు చేయుదురు.ఆయుర్వెద వైద్యంలో ఆవ నూనెను వాడెదరు.
  • జీలకర్ర:జీల కర్ర వ్యవ సాయ పంట. ఏక వార్షికము.జీల కర్ర అపియెసియే కుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రనామము:కుమినం సిమినమ్ (cuminum cyminum) .జీల కర్రను మసాలా దినుసుగా కూరలలో వినియోగిస్తారు.జీలకర్ర టెర్‍పెనులను, పెనొలులను అధికంగా కల్గి ఉంది.
  • కొత్తిమీర (విత్తనాలు, ధనియాలు:ధనియాలను గరం మసాలాలలో పొడిచేసి వాడెదరు.కొత్తిమీర నూనెను ఆకులనుండి, విత్తనాలనుండి తీస్తారు.
  • వాము గింజలనుండివాము నూనెను ఆవిరి స్వేదన క్రియ ద్వారా సంగ్రహిస్తారు.వాము నూనెను వైద్యంలో ఉపయోగిస్తారు.
  • జాజికాయవిత్తనాల నుండి జాజికాయ నూనెను ఆవిరి స్వేదనక్రియ ద్వారా తీస్తారు.
  • మెంతులు:మెంతులనుండి మెంతుల ఆవశ్యక నూనెను స్టీము డిస్టిలేసను ద్వారా ఉత్పత్తి చేస్తారు.
  • పెద్ద జీలకర్ర లేదా తీపి సోపు గింజలనుంది పెద్ద జీలకర్ర నూనెను స్టీము డిస్టిలేసను ద్వారా ఉత్పత్తి చేస్తారు.
  • అనిసె (కుప్పి సోపు) గింజలనుండికుప్పి సోపు నూనె స్టీము డిస్టిలేసను ద్వారా ఉత్పత్తి చేస్తారు.
  • అడవి కారేట్ విత్తనాల నుండి స్టీము డిస్టిలేసను ద్వారాకారేట్ విత్తనాల ఆవశ్యక నూనె ఉత్పత్తి చేయుదురు.

పూలలలో ఆవశ్యక నూనెలున్న మొక్కలు

మార్చు
 
గంధపు తైలం డిస్టిల్లేషన్.

పూమొగ్గలు

మార్చు

కాండం లో ఆవశ్యక నూనెలున్న మొక్కలు

మార్చు

రైజోమ్స్

మార్చు

వేర్లు

మార్చు
  • ఇంగువా
  • ఎంజెలిక (Angelica archangelica)

పళ్ళు,వాటి పైనున్న తొక్కలు (peels)

మార్చు

కాండం బెరడు

మార్చు

ఆవశ్యక నూనెలను ఉత్పత్తి చెయ్యు విధానాలు

మార్చు

మొక్కల నుండి ఆవశ్యక నూనెలను 5-6 విధానాలలో తయారు చేయుదురు.[6]

1. శోషణ (absorption) విధానం

2.ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ/బాష్పికరణ (steam distillation) [7]

3.ఆవశ్యక నూనెల ఉత్పత్తి- సాల్వెంట్ ఎక్సుట్రాక్షనువిధానం (solvent Extraction)

4.ఆవశ్యక నూనెల ఉత్పత్తి- సూపరు క్రిటికల్ ఎక్సుట్రాక్షను (super critical extraction) [8]

5. కోల్డ్ ప్రెస్సింగ్ (cold pressing)

6. ఫ్లొరసోల్స్ ఎక్సుట్రాక్షను (florasols extraction)

శోషన/ణ విధానం

మార్చు
 
లావెండర్ డిస్టిల్లరీ.

ఆవశ్యక నూనెలను కలిగిన మొక్క భాగాలను శాకనూనె/కొవ్వులో కరిగేలా చేసి సంగ్రహించు పద్ధతి. ఆవశ్యక నూనెలను కలిగి వున్న మొక్క భాగాలను మొదట నీడలో ఆరబెట్టెదరు. అధికంగా వున్న తేమ తొలగింపబడిన తరువాత, నూనె కలిగిన భాగాలను చూర్ణం/పొడిగా చేయుదురు. పొడిగా చేసిన మొక్క భాగాలను పాక్షికరణ చేసిన కొబ్బరినూనె, లేదా బాదంనూనె (sweet Almond), లేదా రిపైండ్ పొద్దుతిరుగుడు నూనెలో కలిపి 5-15 రోజుల వరకు వదలివేయుదురు. ఇలా ఉపయోగించు శాకనూనెలను శోషకాలు (absorbents) లేదా వాహకనూనెలు (carrier oils) అంటారు. మొక్కల పొడిలోని ఆవశ్యక నూనెలు క్రమంగా నూనెలోకి వచ్చి చేరును. ఈ విధంగా జరుగుటకు ఆవశ్యకనూనె స్వభావాన్ని బట్టి 5-15 రోజులు పట్టును.ఈ పద్ధతిలో సువాసన నూనెలు (అత్తరులు, సెంటు వంటివి), కేశవర్ధన నూనెలు వంటి ఆవశ్యక నూనెలను తయారు చేయుదురు. గోరింటాకు పొడిని ఇలా పాక్షికరించిన కొబ్బరి నూనెలో (పాక్షీకరణ=అధికమొత్తంలో వున్న సంతృప్త కొవ్వు ఆమ్లాలను కొంతమేర తొలగించడం) నాన బెట్టినచో, ఆకుపచ్చిని రంగులో అవశ్యకనూనెలు కొబ్బరి నూనెలో చేరిపోవును. ఈ నూనెను కేశవర్ధినిగా వాడెదరు. గొరింటాకు నూనెవలన వెండ్రుకలు రాలి పోవడం తగ్గుతుందని, వెండ్రుకలు నల్లబడునని, త్వరగా తెల్లబడవని విశ్వాసం. అలాగే గులాబి, మల్లె, సంపంగి పూల అత్తరులను కూడా ఈ పద్ధతిలో తయారు చేయుదురు. కాని ఈ పద్ధతిలో సమయం ఎక్కువ పట్టుతుంది.

కొల్డ్ ప్రెస్సింగ్

మార్చు

ఆవశ్యక నూనెలను కలిగిన మొక్కభాగాలను స్క్రూప్రెస్సులో లేదా హైడ్రాలిక్ ప్రెస్సులో వత్తిడిని ఉపయోగించి ఉత్పత్తి చెయ్యవచ్చును. కాని సాధారణంగా ఆవశ్యక నూనె మొక్కలలో నూనె శాతం 4-6% మించి వుండదు. అరుదుగా కొన్ని మొక్కలలో 8-9% వరకు వుండును. అందుచే కోల్డ్ ప్రెస్సు విధానంలో మొక్కల నుండి పూర్తి ప్రమాణంలో ఆవశ్యక నూనెలను పొందే అవకాశం తక్కువ. ఈ పద్ధతిలో చాలా అరుదుగా మాత్రమే ఆవశ్యక నూనెలను తయారు చేయుదురు. సాధారణంగా ఈ కొల్డ్ ప్రెస్సింగ్ పద్ధతిలో సిట్రస్ మొక్కలకు/చెట్లకు చెందిన పళ్లనుండి/తొక్కలనుండి ఆవశ్యక నూనెలను సంగ్రహించుటకు అనుకూలం.

ఆవశ్యక నూనెలలో వుండు సమ్మేళనాలు

మార్చు

ఆవశ్యక నూనెలలో ఈ దిగువ పెర్కొన్న సమ్మేళన పదార్థాలు సాధారణంగా వుండును.[9] ఇవి మాత్రమే కాకుండగా ఇతర సమ్మేళనాలు మొక్కల రకాలను బట్టి కూడా వుండును.

  • అల్దిహైడులు (Aldehydes) : ఇవి కార్బొనిల్ గ్రూప్ ను కలిగి వున్న హైడ్రొకార్బన్ సమ్మేళన పదార్థములు. ఇవి ప్రైమరి ఆల్కహల్ ల ఆక్సీకరణ వలన ఏర్పడును. ఆవశ్యక నూనెలకు వాసన కల్గింఛు సమ్మేళనాలలో యివి ప్రముఖ పాత్ర వహించును. తక్కువ అణు భారమున్న ఆల్కహల్ ల నుండి ఏర్పడిన ఆల్డిహైడులు కొద్దిగా ఘాట్రైన వాసన, ఎక్కువ అణు భారమున్న అల్కహల్ ల నుండి ఏర్పడిన ఆల్డిహైడులు సువాసన కల్గి వుండును. ఆవశ్యక నూనెలు ఎక్కువ అణుభారమున్న బెంజాల్డిహైడ్, ఫుర్ఫురల్ లను కల్గి వుండును. అల్డిహైడుల జనరల్ ఫార్ములా RCHO. ఆవశ్యక నూనెలలోని ఆల్డిహైడులు అంటి ఇంఫ్లమటెరి (anti-inflamatory), యాంటి వైరల్, సెడెటెవ్ గుణాలను ప్రదర్శించును.
  • కెటొనులు (ketones) : ఇవి కూడా కార్బొనిల్ గ్రూప్ ను కల్గివున్న హైడ్రొకార్బను సమ్మేళనాలు. ఇవి సెకండరి ఆల్కహల్ ల ఆక్సీకరణ వలన ఉత్పన్నమగును. హైడ్రోకార్బను గొలుసు చివర వుండు కార్బోనిల్ గ్రూప్ రెండు అల్కైల్ (Alkyl) గ్రూప్ లను కల్గివుండును. కెటొనులు విష గుణమున్న పదార్థం. తక్కువ స్దాయిలో వుపయోగించిన చిక్సిత్యా (theoretical) లక్షణాలు కల్గివున్నది. జనరల్ ఫార్ములా: R2C=O.
  • ఆల్కహలులు (Alcohols) : ఇవి హైడ్రొ కార్బను సమ్మేళన ద్రవాలు.హైడ్రొకార్బను గొలుసు చివర ఒక హైడ్రొక్సిల్ ఫంక్షనల్ గ్రూప్ (-OH) ను కల్గి వుండును. జనరల్ ఫార్ములా CnH2nO. ఆల్కహల్ లు 3రకాలు. ప్రైమరి, సెకండరి, టెర్‍టియరి (tertiary) . హైడ్రొక్సిల్ తో బంధమున్న కార్బను కేవలం మరొక కార్బనుతో మాత్రమే బంధం కల్గివున్న ప్రైమరి అల్కహల్ లని, రెండు కార్బనులతో బంధం కల్గివున్న సెకండరి అల్కహల్ లని, మూడు కార్బనులతో బంధమున్న టెర్‍టియరి ఆల్కహల్ లని అంటారు. ఆవశ్యక నూనెలలోని ఆల్దిహైడులు, కెటొనులు ఒక విధంగా ఈ ఆల్కహల్ లు ఆక్సీకరణ చెందటం వలన ఏర్పడును. ప్రైమరి ఆల్కహల్ ల ఆక్సీకరణ వలన ఆల్డిహఈడులు, సెకండరి ఆల్కహల్ ల ఆక్సీకరణ వలన కెటొనులు ఏర్పడును. ఆల్కహల్ లు ఒక రకమైన వాసన కల్గి వుండును. సాల్వెంట్ లక్షణాలు కల్గి ఉన్నాయి. ఆవశ్యక నూనెలలోని ఆల్కహల్ లు యాంటి వైరల్, స్టిములెంట్, డైయిరుటిక్ లక్షణాలను కల్గి ఉన్నాయి. రోజ్, రోజ్‍వుడ్, పెప్పెర్‍మెంట్, సాండిల్‍వుడ్, అల్లం నూనెలలో లభ్యం.
  • పెనొలులు (phenols) : పెనొలులు అనేవి అరొమాటిక్ వలయం (బెంజెనొయిడ్ రింగ్) ను కల్గి వున్న హైడ్రొకార్బన్ సమ్మేళన పదార్థము. అరొమాటిక్ వలయంతో పాటు హైడ్రొక్సిల్ (OH) ను కల్గి వుండటం ఈ పెనొల్స్ లక్షణం. లవంగనూనె, జీలకర్ర, దాల్చిన చెక్క, థైం, నూనెలలో ఉన్నాయి. పెనొలులు ఇమ్యూన్ సిష్టం బూస్టింగ్, అంటి బాక్టిరియల్ లక్షణాలు కల్గి ఉన్నాయి. దగ్గు మందులో అత్యంత స్వల్ప ప్రమాణంలో వాడెదరు. నొప్పి నివారణ పైపూత మందులలో వాడెదరు.
  • టెర్పెనులు (Terpenes) : టెర్పెనులు అనేవి హైడ్రొకార్బన్ సమ్మేలన పదార్థాలు.టెర్పెనులు ఐసోప్రెన్ (Isoprene) లనుండి ఏర్పడును.ఐసొప్రెన్ ల అణుఫార్ములా:C5H8.ఐసోప్రెన్‍లు ఒకదానితో మరొకటి కలసి బంధమేర్పరచుకొనటం వలన టెర్పెనులు ఏర్పడును.టెర్పెనుల జనరల్ ఫార్ములా (C2H5) n.ఇక్కడ 'n'అనగా సమ్మేళనం లోని ఐసోప్రెన్‍ల సంఖ్య.టెర్పెనులలో వున్న ఐసోప్రెన్‍ల సంఖ్యను బట్టి టెర్పెనులపేర్లు వుండును.తొమ్మిది రకాల టెర్పెనులు ఉన్నాయి.
  • హెమిటెర్పెన్: ఒక ఐసొప్రొపెన్ ను మాత్రమే కల్గి వుండును.సాధారణంగా ఒక అక్సిజన్‍ అణువుతో కలసి వున్న్ ఐసొప్రెన్‍లను హెమిటెర్పెన్ లందురు.ఉదా:ప్రెనొల్ (prenol, ఐసొవలెరిక్‍అసిడ్ (isovaleric acid),
  • మోనొటెర్పెనులు:[9] రెండు ఐసొప్రెన్‍ల కలయిక వలన ఏర్పడును.అణుఫార్ములా:C10H16.ఉదా:గెరనియోల్ (geraniol, లిమొనెన్ (limonene, టెర్పినొల్ (Terpinol) .మోనో టెర్పెనులు ఇంచుమించు అన్ని అవశ్యక నూనెలలో అంతో యింతో వుండును.మోనో టెర్పెనులు బాక్టెరెసిడల్ (bactericidal, అంటి సెప్టిక్, ఎక్సొపెక్టొరెంట్ (expectorant), స్టిములెటింగ్ గుణాలను కల్గి ఉంది.
  • సెస్క్వుటెర్పెనులు:[9] మూడు ఐసోప్రెనులను కల్గి వుండును.అణుఫార్ములా:C15H24.ఉదా: ఫర్నెసెనెస్ (farnesenes, ఫర్నెసొల్ (farnesol) .
  • డైటెర్పెనులు: నాలుగు ఐసోప్రెనుల కలయక వలన ఏర్పడినసమ్మేళనం. అణుఫార్ములా:C20H32.ఇవి యాంటి ఇంఫ్లమెటరి గుణాన్ని ప్రదర్శించును.ఉదా:cafestol, kahweol, cembrane.
  • సెస్టరు టెర్పెనులు.: ఐదు ఐసొప్రెన్‍ల సమ్మేళనం.అణుఫార్ములా:C25H40.ఉదా:Geranylfarnesol
  • ట్రై టెర్పెనులు:ఆరు ఐసోప్రెనుల సమ్మేళన పదార్థము.అణుఫార్ములా:C30H48.ఉదా:స్క్వాలెన్ (squalene) .
  • సెస్క్వార్‍టెర్పెనులు (sesquarterpenes) :ఏడు ఐసొప్రెనులను కల్గివున్న హైడ్రొకార్బన్ సమ్మేళనం.అణుఫార్ములా:C35H56.ఉదా: ferugicadiol, tetraprenyl curcumene.
  • టెట్రాటెర్పెనులు:ఎనిమిది ఐసొప్రెనుల కలయిక వలన ఏర్పడిన కార్బన సమ్మేళనం.అణుఫార్ములా:C40H64.
  • పొలిటెర్పెనులు:ఒకటి కన్న ఎక్కువ ఐసొ ప్రెపొనులు పొడవైన గొలుసుగా ఏర్పడి, ఆ గొలుసు ఐసొప్రెపెనుల సమ్మేలనం వలన ఏర్పడు టెర్పెనులను పొలిటెర్పెనులందురు.పొలి ఐసొప్రొపెనుల ద్విబంధలు సిస్ (cis) అమరిక కల్గివుండును.కొన్ని ఆవశ్యక నూనెలలో పొలిటెర్పెనుల ద్విబంధాలు ట్రాన్స్ (Trans) అమరిక కల్గి వుండును.
  • ఈస్టరులు (Esters) :ఈస్తరులు సాధారణంగా ఆల్కహల్, కార్బొలిక్ ఆసిడ్ లనుండి ఏర్పడును.వీటిలోని ఒక హైడ్రొక్సిల్ (hydroxyl-OH) గ్రూప్ ఒక -O (alkyl) గ్రూప్ చే తొలగింపబడటం వలన ఏస్టరులు ఏర్పడును.ఈథరు (CH2) లింకుకు పక్కగా కార్బొనిల్ గ్రూప్ ను కల్గి వుండును.ఆసిడ్, ఆల్కహల్ చర్య వలన ఈస్టరులు ఏర్పడును.ఆవశ్యక నూనెలకు సువాసన కారకాలలో ఈస్టరు కూడా కారణం.ఈ స్టరులు ఈథరు లకన్న ఎక్కువ పొలారు (polar) లక్షణం ప్రదర్శించును.కాని ఆల్కహల్ లకన్న తక్కువ గుణం కల్గి వుండును.చాలా పళ్ళు సువాసన కల్గి వుండుటకు మూల కారణం అవి ఈస్టరులను కల్గి వుండటమే.
  • లాక్టొనులు (Lactones) :లాక్టొనులు చక్రియుత ఈస్టరులు (cyclic esters) .కార్బక్షిలిక్ ఆసిడ్, అల్కహల్ లచర్య వలన తయారగును.లాక్టొనులలోని మూసి వున్న వలయంలోరెందు లేదా అంతకన్న ఎక్కువ కార్బనులుండును.
  • ఈథరులు (ethers) :హైడ్రొకార్బన్ సమ్మేళనంలోని గొలుసులోని ఇథరు గ్రూప్ లోని అక్సిజన్ తో రెండు అల్కైల్ (alkyl or aryl) లు సంయోగ బంధం ఏర్పరచడం ద్వారా ఈథరులు ఏర్పడును.జనరల్ ఫార్ములా:R-O-R'.
  • కొన్ని రకాల ఆక్సైడులు (Oxides) :అతి కొద్ది ఆవశ్యక నూనెలు మాత్రమే ఆక్సైడులను కల్గి ఉన్నాయి.అందులో ముఖ్యంగా యుకలిప్టస్ నూనె.
  • కొన్ని రకాల ఆమ్లాలు (acids) :ఇవి కూడా చాలా స్వల్ప ప్రమాణంలో మాత్రమే కొన్ని నూనెలలో లభ్యం.నూనెలలోని యితర రసాయనాలలో ఆల్కహల్ రసాయనిక చర్య ఫలియంగా ఈ సెంద్రియ ఆమ్లాలు ఏర్పడును.

మూలాలు-ఆధారాలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-07. Retrieved 2013-10-27.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-06-05. Retrieved 2013-10-27.
  3. 3.0 3.1 http://voices.yahoo.com/history-essential-oils-their-medical-847407.html?cat=5[permanent dead link]
  4. essential oils present in leaves
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-23. Retrieved 2013-10-27.
  6. http://www.nematfragrances.com/learn_about/various_extraction_methods.htm
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-24. Retrieved 2013-10-27.
  8. http://pubs.acs.org/doi/abs/10.1021/ie990015%2B?journalCode=iecred
  9. 9.0 9.1 9.2 http://www.experience-essential-oils.com/chemistry-of-essential-oil.html