సిడాం శంభు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ నాయకుడు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) వ్యవస్థాపక సభ్యుడు. ఇతను 1970 ఏప్రిల్ 6న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామంలో జన్మించాడు.

సిడాం శంభు పటేల్
జననం06-04-1970
మరణం20-07-2018
ఇతర పేర్లుశంభు దాదా
ప్రసిద్ధిఆదివాసి ఉద్యమా నాయకుడు
తండ్రిసోనెరావు
తల్లిజంగుబాయి

ఆదివాసుల హక్కులు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వారి సమస్యలపై ఉద్యమాలు చేసిన ఆదివాసీ గిరిజనుల ఉద్యమనాయకుడు సిడాం శంభు. ఇతని తల్లితండ్రులు సోనెరావు జంగుబాయి. సిడాం శంభు గిరిజనుల చట్టాలు అమలు కోసం ఎన్నో ఉద్యమాలు చేశాడు, తుడుం దెబ్బ వ్యవస్థాపకులలో అధ్యక్షుడు, తుడుం దెబ్బకు నాయకత్వం వహించాడు.[1]

ప్రారంభ జీవితం మార్చు

సిడాం శంభు చదువు పట్ల ఆసక్తితో 10 వ తరగతి వరకు చదువుకున్నారు. ఇతనికి ఇద్దరు భార్యలు ముయల్ మోతి, కౌసల్య 6గురు కుమారుల సంతానం. చిన్నతనం నుంచే గోండు గిరిజన ప్రజల పై దాడులు, వడ్డి వ్యాపారుల శ్రమ దోపిడీలను చూసి చలించిపోయేవాడు. కుమురం భీం స్ఫూర్తితో జల్ జంగల్ జమీన్ హమర సార్థకతను సాధించాలని గ్రామంలోని ప్రజలు, యువకులను ఉద్యమ చైతన్యం చేస్తూ అక్షరాస్యులు చేయలనే లక్ష్యంతో చిన్న సుద్దగూడ గ్రామంలో ఉపాద్యాయుడిగా పనిచేశాడు

ఉద్యమ జీవితం మార్చు

సీడాం శంభు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) వ్యవస్థాపక సభ్యుడు ముఖ్యంగా ఆదిలాబాద్ (ఉమ్మడి) ఆదివాసీ ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు 5వ షెడ్యూల్ భూభాగం అంతటా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించాడు. 1/70 చట్టాన్ని అమలు చేయాలని పీసా చట్టాన్ని గ్రామ సభలను అమలుకు పూనుకోవాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని ఆచరణలో పెట్టడానికి, రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఆదివాసీ ప్రజల కొరకు గత 25 సం॥రాలుగా అవిరామ కృషి చేశాడు. జిల్లా రాయి సెంటర్ అధ్యక్షుడుగా, తుడుందెబ్బ అధ్యక్షుడుగా, ఆదివాసీ ఐక్యవేదిక, రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా పనిని కొనసాగించాడు.[2][3][4]

1996 లో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో దాదాపు 20 వేల  పెద్ద బహిరంగ సభ జరిగింది. 5వ, 6వ షెడ్యూల్ ప్రకారంగా 1/70 చట్టం అమలుచేయాలని గ్రామాలలో ఆదివాసులపై దాడులు ఆపాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సభ జరిగింది. దానికి సీడాం శంభు నాయకత్వం వహించాడు. జిల్లా నలుమూలల తిరిగి పెద్దఎత్తున ప్రచారం జరిపించాడు. నిర్వాహిత ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నాడు. 2013న హైదరాబాద్లో జరిగిన సభకు అధ్యక్షతను వహించాడు. ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా కవ్వాల్ టైగర్ జోన్కు వ్యతిరేకంగా - ఆదివాసీ ప్రజల పక్షాన గట్టిగా నిలబడి నాయకత్వం వహించాడు. 'రాంచి డిక్లరేషన్' సభలో పాల్గొని ముఖ్య భూమిక వహించాడు.

ఆదివాసీ యువతి, యువకులు, ఉద్యోగులతో 1997 జనవరి 23 ఉట్నూర్లో 2వేల మందితో సదస్సు జరిగింది. 1/70 చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో 5, 6 షెడ్యూల్డ్ అమలుచేయాలి. అటవీ భూమి నరికి సాగు చేస్తున్న ప్రజలకు పట్టాలివ్వాలి. నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. బూటకపు ఎన్ కౌంటర్లను నిలిపివేయాలి. ఆదివాసులపై పోలీసులు అత్యాచారాలను నిలిపివేయాలి. ఆదివాసులపై ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి. ఐ.టి.డి.ఎ. అవినీతిని అరికట్టాలి. అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్య తీసుకోవాలి. తదితర డిమాండ్స్ మీదనే 1997 జనవరి 29న ఉట్నూరు లోని 60 వేల మంది ఆదివాసులతో బ్రహ్మాండమైన ఊరేగింపు,, బహిరంగ సభ జరిగింది. దీనికి కారణం సీడాం శంభు నాయకత్వం వహించాడు.

ఉమ్మడి రాష్ట్రంలో ఇంద్రవెల్లి అమరుల దినోత్సవం నాడు పాలకులు అమరుల స్థూపం వద్దకు నివాలర్పించేందుకు ఎవరిని అనుమతించని స్థితుల్లో తాను ఒక్కడే ప్రతి సంవత్సరం. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని వెళ్లి నివాలర్పించి తన ధైర్యాన్ని చాటుకున్నాడు. 2004లో చర్చల కాలంలో ఇంద్రవెల్లి వద్ద ఏప్రిల్ 20 నాడు భారీ బహిరంగ సభ జరిగింది. దాదాపు జిల్లా అంతటి నుండి ఒక లక్ష మంది ప్రజలు హాజరయ్యారు. ఆ సభను విజయవంతం చేయడంలో కారణం సీడాం శంభు ముఖ్య పాత్ర వహించాడు.

1996 నుండి 2018 వరకు  సీడాం శంభు ఉద్యమ సమయంలో అనేక నిర్బంధాలకు, హింసలకు గురైన నిర్భయంగా తుదిశ్వాస వరకు ప్రజల పక్షన ఉన్నాడు. 2004 డిసెంబరు ఆదిలాబాద్ ఎస్పీ మహేష్ భగవత్, ఎ.ఎస్.పి.స్టిపేన్ రవీంద్ర కలిసి ఆదివాసీ నాయకుల మీద ఒత్తిడి చేసి మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించారు. కానీ  సీడాం శంభు మాత్రం ధైర్యంగా, మానసికంగా ఉండి ప్రకటన ఇవ్వకుండా తిరస్కరించాడు. ఆ విధంగా ఆదివాసీ ప్రజల పక్షాన పీడిత ప్రజల పక్షాన గట్టిగా నిలబడినాడు. 1997లో పార్టీ సభ్యుడిగా గుర్తించడం జరిగింది. పార్టీ పిలుపు వచ్చిన వెంటనే - పార్టీని కలిసి కార్యక్రమం రూపొందించుకొని వెంటనే అందరిని కలుపుకొని అమలుచేయడానికి ప్రత్యక్షంగా ఆచరణలో దిగి కార్యక్రమాన్ని అమలు చేసేవాడు. ఆదిలాబాద్ జిల్లా పార్టీ నాయకులు అమరులైన  రమేష్, సూర్యం, శేషన్నల తోటి చాలా దగ్గర సంబంధాలు కొనసాగించాడు. ఆ కామ్రేడ్స్ యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు. కొంతమంది ఆదివాసీ నాయకులు నిర్బంధానికి భయపడి ప్రభుత్వానికి లొంగిపోయిన - సీడాం శంభు మాత్రం చివరి వరకు ప్రజాపక్షాన నిలబడినాడు.

ఉద్యమ సమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు. కుటుంబపరమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయా రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎంపి టికెట్లు ఇస్తామని చెప్పిన  ఆ మార్గంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావని భావించి పదువులకన్నా ప్రజా ఉద్యమాలకే అంకితమయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ ప్రజా నాయకుడుగా ఎదిగి వచ్చాడు. 'ప్రజాస్వామిక తెలంగాణ' కొరకు ఉద్యమంలో గట్టిగా నిలబడినాడు.

20 యేళ్ల వయస్సు నుంచి ఆదివాసీ గిరిజ నుల హక్కులు, చట్టాలు రక్షణ కోసం కృషి చేశాడు సిడాం శంభు, సాంప్రదా యాలను పాటిస్తూ భావితరాలకు తె తినే విధంగా ఆదివాసీ గిరిజనుల పండుగలను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆదివాసీ గిరిజ హక్కులకోసం రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులు ఏర్పాటు చేసుకున్న తుడుం దెబ్బకు నాయకత్వం వహిస్తు పోరాటాలు నిర్వహించారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కులు కచల్పించాలని పోరాటాలు చేసిన సిడాం శంభు హయాంలోనే రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి మత్తడిగూడ చేరుకోని గిరిజనులకు ఆటవీ హక్కులు కల్పించే కార్యాచరణ మత్తడిగూడ నుంచే ప్రారంభించారు. చదువుకున్నది పదవ తరగతి వరకే అయినా గిరిజనులు అందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకొని అభివృద్ధి పథంలో పయనిం చాలని కోరుకోనే వాడు. అంతే కాకుండా ఆదివాసీ హక్కుల కోసం పెసా చట్టాన్ని అమలు చేయాలంటూ అధికారులను కోరేవాడు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికి ఆటవీ హక్కులు కల్పిస్తేనే గిరిజనుల భూములకు రక్షణ ఉంటుందని కోరుతూ దేశ రాజధానిలో ఆందోళన కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో అటవి హక్కుల కోసం తుపాకులు, కత్తులు. గొడ్డల్లు పట్టుకొని ఆదివాసి లతొ ర్యాలీలు చేపట్టారు, ఇందిర గాంధీ ముందు గుస్సాడి నృత్యా బృందాంతో గుస్సాడి నృత్యాన్ని చేయించి ఇందిర గాంధీకీ గుస్సాడి టోపి నీ బహుమతిగా బహూకరించారు

సిడాం శంభు కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజనుల గురించి మాత్రమే కాకుండా ఆదివాసిల జనాభా ఎక్కువగా వున్నా ఛత్తీస్గడ్, ఈశాన్య రాష్ట్రాల్లో, నేపాల్కి కూడా వెళ్ళి అక్కడ ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలతొ పాటు అక్కడి ఆదివాసిల జీవన స్దితిగతులు అమలు అవుతున్న ఆదివాసి చట్టాల గురించి తెలుసుకునెవాడు.

సాంప్రదాయాలకు వేదిక మత్తడిగూడ మార్చు

 

ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలకు మత్తడిగూడ వేదిక ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజల సాంస్కృతి, సంప్రదాయాలు తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టెవారు సిడాం శంభు యేటా ఆకాడి పండుగ మొదలు కోని హోలి. వేడుకల సందర్భంగా జరుపుకోనే ఆచార పండుగలను నిర్వహించడంతోపాటు భావి తరాలకు తెలిసే విధంగా కృషి చేసే వారు. మత్తడిగూడలో దీపావళి దండారి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడంలో శంభు ఏంతో కృషి చేసే వారు. ఐటీడీఏ పీవోతోపాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి దీపావళి వేడుకలను వారికి చూయించే వారు. ఇంగ్లండ్ ప్రాన్స్ వంటి దేశాల వారు దండారి గుస్సాడి వెడుకలను తిలకించడానికి శంభు గ్రామాము అయిన మత్తడిగూడకు వచ్చే వాళ్ళు.

అమరులకు తొలి నివాళి ఆతనిదే మార్చు

1961 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసు కాల్పుల్లో వందలాది మంది గిరిజనులు చనిపోవడంతో వారి జ్ఞాపకార్ధం ఇంద్రవెల్లిలో నిర్మించిన అమర వీరుల స్తూపానికి యేటా ఏప్రిల్ 20న మొదట నివాళులు సిడాం శంభుతో పాటు కుమ్ర ఈశ్వరిబాయిలు నిర్వహించే వారు. మావోయిస్టులపై ప్రభుత్వం నిషేధం విధించిన సమయంలో పోలీసులు అడ్డుకొనే ప్రయత్నాలు చేసినప్పటికి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులు అర్పించే వారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్పించడానికి అవకాశం కల్పించడంతో గిరిజనులు ఇంద్రవెల్లి మృతుల వీరుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తున్నారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాటాలు చేసి అమరుడైన కుమ్రం భీం ఆశయ సాధన కోసం కెరమెరి మండలం జోడేఘా ట్లో జరిగే కార్యక్రమాన్ని శంభు నిర్వ హిస్తూ ఆదివాసీ గిరిజనుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంలో ముందుండే వారు. సీడాం శంభు 2018 జూలై 19 నాడు అనారోగ్యంతో రాత్రి చివరి శ్వాస వదిలినాడు.

మూలాలు మార్చు

  1. India, The Hans (2018-07-26). "Tributes paid to Adivasi leader Sidam Shambhu". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-13.
  2. NYOOOZ. "Tributes paid to Adivasi leader | Hyderabad NYOOOZ". NYOOOZ (in ఇంగ్లీష్). Retrieved 2023-06-13.
  3. "Adivasi leader Sidam Shambhu dead". The Hindu (in Indian English). 2018-07-20. ISSN 0971-751X. Retrieved 2023-06-13.
  4. "Adivasi leader Sidam Shambhu died at Gandhi hospital". suryaa (in ఇంగ్లీష్). Retrieved 2023-06-13.