సిద్ధార్థ జాదవ్


సిద్ధార్థ రామచంద్ర జాదవ్ (జననం 1981 అక్టోబర్ 23) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్, రంగస్థల నటుడు. అతను టెలివిజన్, మరాఠీ, హిందీ చిత్రాలలో నటించాడు. గోల్‌మాల్, గోల్‌మాల్ రిటర్న్స్ వంటి అనేక బాలీవుడ్ సినిమాలలో నటించాడు. జాదవ్ మిథున్ చక్రవర్తి హీరోగా అమీ సుభాష్ బోల్చి అనే బెంగాలీ సినిమాలో కూడా నటించాడు. మీడియాలో ఇతని గురించి "మరాఠీ సినిమా కామెడీ కింగ్"గా ప్రస్తావించబడింది.[3]

సిద్ధార్థ జాదవ్
సిద్ధార్థ జాదవ్ (2017)
జననం (1981-10-23) 1981 అక్టోబరు 23 (వయసు 42)[1]
విద్యసెవ్రీ మున్సిపల్ స్కూల్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
తృప్తి
(m. 2007)
పిల్లలు2
పురస్కారాలుయువ బాలగంధర్వ పురస్కారం (2007)[2]

జననం మార్చు

సిద్ధార్థ 1981 అక్టోబర్ 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

సిద్ధార్థకు తృప్తితో వివాహం జరిగింది, వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[4] [5] [6]

కళారంగం మార్చు

అతను డిడి సహ్యాద్రిలో ఏక్ శూన్య బాబూరావు ద్వారా నటనారంగంలోకి ప్రవేశించాడు. హసా చకత్ఫు, ఘడ్లే బిఘడ్లే, అపన్ యన్నా పహిలత్ కా?, మొదలైన వాటిలో సహాయక పాత్రలలో కూడా నటించాడు. 2004లో కేదార్ షిండే తీసిన అగా బాయి అరేచా! సినిమాతో తన సినీరంగంలోకి వచ్చాడు. ఆ తర్వాత జాత్రా సినిమాలో అవకాశం వచ్చింది. 2006లో రోహిత్ శెట్టి తీసిన గోల్‌మాల్: ఫన్ అన్‌లిమిటెడ్ లో నటించి గుర్తింపు పొందాడు. అదే సంవత్సరం లోచ్య జాల రే అనే నాటకం నటించాడు. తర్వాత అతను బకులా నామ్‌దేయో ఘోటాలే, సాడే మాదే తీన్, దే ఢక్కా, మే శివాజీరాజే భోసాలే బోల్టోయ్, ఇంకా చాలా ముఖ్యమైన సినిమాలలో నటించాడు. 2008లో దే ఢక్కా చిత్రానికిగాను మహారాష్ట్ర రాజ్యపాల్ చిత్రపత్ పురస్కార్‌లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును గెలుచుకున్నాడు.[7] బెంగాలీ చిత్రం అమీ శుభాష్ బోల్చిలో కూడా అరంగేట్రం చేశాడు. మహారాష్ట్రచా డ్యాన్సింగ్ సూపర్ స్టార్, డ్యాన్స్ మహారాష్ట్ర డ్యాన్స్‌తో సహా అనేక రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా కూడా ఉన్నాడు. 2016లో గెలా ఉదత్ అనే నాటకం చేశాడు. 2021లో, రాధేలో రంజీత్ మవానీగా కనిపించాడు.[8]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష
2004 అగా బాయి అరేచా! సిద్ధు మరాఠీ
2006 జాతర సిద్ధు
ఔట్ సోర్సింగ్ గోల విక్రేత హిందీ
చంగ్‌భాల్ మరాఠీ
మఝ నవర తుఝి బయ్కో గాంగ్య
గోల్మాల్: ఫన్ అన్‌లిమిటెడ్ సత్తు సుపారీ హిందీ
2007 హ్యంచ కహీ నేమ్ నహీ మరాఠీ
బకుల నామదేయో ఘోతాలే నామ్‌దేవ్
జబర్దస్త్ చోటా డాంబిస్
సాదే మాదే తీన్ బాబాన్
2008 దే ఢక్కా ధనాజీ
గోల్మాల్ రిటర్న్స్ లక్కీ అసిస్టెంట్ హిందీ
ఉలధాల్ సికిందర్ మరాఠీ
పూర్తి 3 ధమాల్ బస్ కండక్టర్
బాప్ రే బాప్ డోక్యాల తాప్ హవాల్దార్ నింబాల్కర్
గల్గలే నిఘాలే అంద్యా బాంజో
2009 సుంబరన్ ఉత్తమ్
సలైన్ కేలా ఘోటాలా దిన్య గద్బడే
గావ్ తస చంగాలా జంగ్యా
నేను శివాజీరాజే భోసలే బోల్టోయ్ ఉస్మాన్ పార్కర్
2010 శిక్షానాచ్యా ఆఇచా ఘో ఇబ్రహీం భాయ్
హుప్పా హుయా హన్మ్య
సిటీ అఫ్ గోల్డ్ గణేష్ 'గన్య'
లాల్‌బాగ్ పరేల్: జాలి ముంబై సోన్యాచి స్పీడ్ బ్రేకర్
క్షణభర్ విశ్రాంతి విష్ణు పంత్ జగ్దాలే మరాఠీ
పరధ్
ఇరడ పక్కా రోహిత్
భైరు పైల్వాన్ కీ జై భైరు పెహల్వాన్
లక్ష్యం సత్తార్
2011 ఫక్త్ లధ్ మ్హానా వెస్ట్ ఇండీస్
సూపర్ స్టార్ రంగా
మమాచ్య రాశిలా భచా కిషన్
భౌచా ఢక్కా
2012 కుటుంబ మాయా మాము
అమీ శుభాష్ బోల్చి ఉస్మాన్ మోండల్ బెంగాలీ
ఇడియట్స్ ఖయ్యూమ్ మరాఠీ
2013 ప్రేమచా జోల్‌ఝాల్ పోపట్ నవ్రే
ఖో- ఖో ఆదిమానవ్
ధామ్ ధూమ్
టైం ప్లీజ్ హిమ్మత్రావు
2014 ప్రియతమా పర్ష
పొడి రఘు వెండి హిందీ
2015 గౌర్ హరి దాస్తాన్: ది ఫ్రీడం ఫైల్ టౌట్
ధోల్కీ లాలా మరాఠీ
రజాకార్ హరి
డ్రీమ్ మాల్ మాల్ సెక్యూరిటీ
మధ్యవర్గ్ విజయ్ రౌత్
శాసన్ మహదేవ్
2016 దునియా గెలి టెల్ లావత్ రాజా
2017 మనుస్ ఏక్ మాతీ విజయ్
ఫాస్టర్ ఫెన్ అంబాదాస్
2018 యే రే యే రే పైసా సన్నీ
షికారి TK
మౌళి కడక్నాథ్
ఘర్ హోతా మేనాచా
సింబా సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్ తవాడే హిందీ
2019 ఖిచిక్ మిథున్ మరాఠీ
సర్వ రేఖ వ్యస్త అహేత్ బేబ్యా
2020 ధురాల హనుమంత ఉభే (సిమెంట్ షెత్)
2021 రాధే రంజీత్ మవానీ హిందీ
సూర్యవంశీ సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్ తవాడే
2022 లోచ్య జాలా రే మానవ్ మరాఠీ
తమాషా లైవ్
దే ఢక్కా 2 ధనాజీ
సర్కస్ హిందీ
బాల్ భారతి TBA మరాఠీ
జాగో మోహన్ ప్యారే TBA
లగ్న కల్లోల్ TBA
జాతర 2 TBA

నాటకం మార్చు

సంవత్సరం నాటకంపేరు పాత్ర భాష మూలాలు
2006 లోచ్య జాలా రే మరాఠీ
2010 మి షారుఖ్ మంజర్సుంభేకర్
2012 జాగో మోహన్ ప్యారే
2016 గెలా ఉదత్ [9] [10]

మూలాలు మార్చు

  1. "Happy Birthday Siddharth Jadhav: 'Bakula Namdeo Ghotale'to 'De Dhakka'; FIVE must-watch comedy movies of actor". The Times of India (in ఇంగ్లీష్). 28 October 2020. Retrieved 18 June 2021.
  2. "जगदीश खेबुडकर यांना 'बालगंधर्व पुरस्कार'". Maharashtra Times (in మరాఠీ). Retrieved 22 September 2020.
  3. "Happy Birthday Siddharth Jadhav: FIVE Career-defining performances of the comedy king - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
  4. Naroji, Samruddhi (12 May 2020). "Siddharth Jadhav Wishes Wife Trupri Jadhav In An Adorable Anniversary Post Celebrating 13 Years Of Togetherness". Spotboye. Retrieved 18 June 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Atulkar, Preeti (13 January 2017). "Siddharth Jadhav has become a daddy again - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 18 June 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Siddharth Jadhav has an adorable birthday wish for wife Trupti Akkalwar along with this throwback picture". Times of India (in ఇంగ్లీష్). 2 July 2019. Retrieved 18 June 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "I have learnt to enjoy failure as much as success: Siddharth Jadhav". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
  8. "Siddharth Jadhav: Working with Prabhudeva is a dream come true - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
  9. "Siddharth Jadhav's play 'Gela Udat' to stage 250th show". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2018-03-31.
  10. "'गेला उडत'चे शतक". loksatta.com (in ఇంగ్లీష్). Retrieved 2017-01-22.