సిద్ధివినాయక మహావినాయక దేవాలయం

మహారాష్ట్రలోని ఒక వినాయక దేవాలయం

సిద్ధివినాయక మహావినాయక దేవాలయం, మహారాష్ట్ర, థానే జిల్లా, కళ్యాణ్ తాలూకాలోని టిట్వాలా పట్టణంలో ఉన్న వినాయక దేవాలయం. టిట్వాలాలోని ఈ ప్రాంతం పూర్వకాలంలో కణ్వ ఋషి ఆశ్రయమని ఇక్కడి భక్తుల నమ్మకం. ఋషి కణ్వ ఆదేశానుసారం శకుంతల ఈ దేవాలయాన్ని నిర్మించిందని ప్రతీతి. ఇక్కడి వినాయకుడి ప్రతిమను పూజిస్తే విడిపోయిన వివాహిత జంటలు ఒక్కటవుతారని, కోరుకున్న వ్యక్తుల వివాహాలు సులువుగా జరుగుతాయని నమ్మకం కారణంగా ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మంగళవారం ఇక్కడ అధిక రద్దీ ఉంటుంది.[1][2]

సిద్ధివినాయక మహావినాయక దేవాలయం
మహారాష్ట్రలోని టిట్వాలాలో ఉన్న సిద్ధివినాయక మహావినాయక దేవాలయం
సిద్ధివినాయక మహావినాయక దేవాలయం is located in Maharashtra
సిద్ధివినాయక మహావినాయక దేవాలయం
మహారాష్ట్ర దేవాలయ ప్రాంతం
భౌగోళికం
భౌగోళికాంశాలు19°18′02″N 73°13′18″E / 19.30056°N 73.22167°E / 19.30056; 73.22167
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
ప్రదేశంటిట్వాలా
సంస్కృతి
దైవంవినాయకుడు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుఉత్తర భారత వాస్తుశైలీ
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీఅసలు నిర్మాణం: పురాతన (తెలియదు)
ప్రస్తుత నిర్మాణం: 1965–66
సృష్టికర్తఋషి కణ్వ ఆదేశానుసారం శకుంతల

చరిత్ర

మార్చు

పురాణాల ప్రకారం.. శకుంతల నిర్మించిన సిద్ధివినాయక మహాగణపతి దేవాలయం చెరువు నీటి ప్రవాహం వలన మునిగిపోయింది. మొదటి పీష్వా మాధవరావు హయాంలో పట్టణంలోని కరువును పరిష్కరించడానికి, పట్టణానికి తాగునీరు అందించడానికి చెరువులో పూడిక తీసివేస్తుండగా, దేవాలయ శిథిలాలు, వినాయకుడి విగ్రహం బయటపడ్డాయి. అప్పుడు రాతితో దేవాలయ పునర్నిర్మాణం చేపట్టారు. పీష్వా మాధవరావు I వసాయి కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ కొత్త దేవాలయంలో పురాతన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ప్రారంభంలో, ఈ దేవాలయం చాలా చిన్నదిగా, ఒక చెక్క సభా మండపంతో ఉండేది. కాలక్రమేణా పీష్వా దేవాలయం కూడా శిథిలమవడంతో, 1965-66లో, పునర్నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభించి, 2,00,000 (US$2,500) ఖర్చుతో కొత్త దేవాలయాన్ని నిర్మించారు.[3][4][5][6][7]

పేష్వాలు విరాళంగా ఇచ్చిన భూమి 3–5 ఎకరం (1–2 హె.)లకు అదనంగా 12 ఎకరాలు (4.9 హె.) ) భూమిని సేకరించి ప్రస్తుత దేవాయం నిర్మించబడింది. ప్రధాన ద్వారం కుడివైపున శివలింగంతో కూడిన మరో గుడి ఉంది. దేవాలయానికి ఎదురుగా దీప గోపురం కూడా ఉంది. దేవాలయ (శిఖరం) అష్టవినాయకుని శిల్పాలతో అలంకరించబడింది.

ఇతర వివరాలు

మార్చు

మంగళవారం, చంద్రపక్షంలోని నాల్గవ రోజు వినాయకుడిని పూజించడానికి అనుకూలమైన రోజులుగా పరిగణించబడతాయి. వినాయక చవితి, వినాయక జయంతి మొదలైన పండుగలు ఇక్కడ జరుపుకుంటారు. ఆ పండుగల సందర్భాలలో పూజల కోసం 500,000 కంటే ఎక్కువ మంది భక్తులు హజరవుతారు.[8][9][10] తరచుగా ఈ దేవాలయానికి ముంబై నుండి భక్తులు వస్తుంటారు.[11]

మూలాలు

మార్చు
  1. "Find out which day of the week is dedicated to which Lord!". Zee News (in ఇంగ్లీష్). 2016-06-25. Archived from the original on 2021-09-24. Retrieved 2022-08-18.
  2. "TITWALA GANESH MANDIR". TripAdvisor.
  3. "Places:Titvala". Maharashtra Gazetteer. Retrieved 2022-08-18.
  4. "Titvala". Kalyan Dombivali Municipal Corporation (KDMC). Archived from the original on 2011-09-27. Retrieved 2022-08-18.
  5. "Famous Temples in Greater Mumbai". iv) Shree Mahaganpati (Titwala). Archived from the original on 2008-12-27. Retrieved 2022-08-18.
  6. "Titwala". Retrieved 2022-08-18.
  7. Masurkar, Alpita. "Siddhivinayak Temple at Titwala gets a makeover". Mumbai Mirror. Archived from the original on 2012-02-23. Retrieved 2022-08-18.
  8. "Maharashtra: Titwala". Archived from the original on 2010-01-15. Retrieved 2022-08-18.
  9. "Titwala". Archived from the original on 6 September 2007. Retrieved 2022-08-18.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  10. "Maghi Ganeshotsav celebrated with reverence". The Times of India. 7 February 2003. Retrieved 2022-08-18.
  11. "Ganapatipujana". Maharashtra State Gazetteer – Greater Bombay District. Retrieved 2022-08-18.