చింతపెంట సత్యనారాయణరావు

(సి.ఎస్.రావు (రచయిత) నుండి దారిమార్పు చెందింది)

సి.ఎస్.రావు (డిసెంబరు 20 , 1935 - ఏప్రిల్ 14, 2020) (చింతపెంట సత్యనారాయణరావు) రచయిత, నటుడు, నిర్మాత. ఆయన సుదీర్ఘ కథలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, నవలలు, టి.వి. సీరియళ్ళు, డాక్యుమెంటరీలు, సినిమా వ్యాసాలను రాసాడు.[1]

సి.ఎస్.రావు
సి.ఎస్.రావు
జననం
చింతపెంట సత్యనారాయణరావు

డిసెంబరు 20 , 1935
మరణంఏప్రిల్ 14, 2020
జీవిత భాగస్వామిసూర్యమణి
పిల్లలుఒక కుమార్తె, ఇద్దరు కుమారులు.

జీవిత విషయాలు

మార్చు

రావు 1935, డిసెంబరు 20న ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో జన్మించాడు. నటనలో శిక్షణ కూడా అందించాడు. కొంతకాలంపాటు అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేశాడు. చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గా పనిచేశాడు. రావుకు సూర్యమణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు.

సాహిత్యరంగం

మార్చు

1954లో అగ్నిపర్వతం నవల రాశాడు. 80 కథలు, 8 దృశ్య నాటికలు, 2 నాటికలు, 20 రేడియో నాటకాలు రాయడంతోపాటు 4 సినిమాలకు కథ, 8 సినిమాలకు మాటలు అందించాడు. బుల్లితెర నాటకాలు, 8 ధారావాహికలకు కథలు రాశాడు.[2]

సినిమారంగం

మార్చు

ఎన్టీఆర్ నటించిన సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'సొమ్మొకడిది సోకొకడిది' చిత్రాల్లో రావు నటించాడు.

  1. ఊరుమ్మడి బతుకులు
  2. కమలమ్మ కమతం
  3. ప్రాణం ఖరీదు
  4. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
  5. తరం మారింది.
  6. నాయకుడు వినాయకుడు
  7. మల్లె మొగ్గలు
  8. యజ్ఞం
  9. దీక్ష
  10. సొమ్మొకడిది సోకొకడిది (నటించారు)
  11. సరదా రాముడు (నటించారు)
  12. మట్టి మనుషులు (నటించారు)

కార్యక్రమాలు

మార్చు
  1. యేగూటి చిలక ఆ గూటి పలుకు (ఒకే ఎపిసోడ్ కార్యక్రమం)
  2. రాజశేఖర చరిత్ర
  3. భతృహరి జన్మ వృత్తాంతము
  4. రాజి బుజ్జి
  5. జాతక కథలు
  6. విక్రమార్క విజయం (సంభాషణలు మాత్రం)
  7. కళాపూర్ణోదయం (హిందీ సీరియల్ - నేషనల్ నెట్ వర్క్)
  8. ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలు (హిందీ సీరియల్ - నేషనల్ నెట్ వర్క్)
  9. కర్పూర వసంత రాయలు
  10. మ్యూసిక్ అండ్ డాన్స్ ఇన్ ఎ.ప్ (50 సంవత్సరాల స్వాతంత్ర్య సీరియళ్ళు)
  11. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు (హైదరాబాదు దూరదర్శన్)

సీరియళ్ళు

మార్చు
  1. మీరు ఆలోచించండి
  2. శిఖర దర్శనం (ఒక ఎపిసోడ్)
  3. మిత్రలాభం
  4. వరుడు కావాలి (13 ఎపిసోడ్లు)
  5. డామిడ్ కథ అడ్డం తిరిగింది.
  6. దృష్టి
  7. గణపతి
  8. విద్య
  9. మళ్ళీ తెలవారింది (స్క్రీన్ ప్లే మాత్రమే)

టెలివిజన్ నాటకాలు

మార్చు
  1. క్రెడిట్ కార్డు
  2. తీర్పు (20 విషయాల సూత్రంతో కూడిన నాటకం)
  3. కామమ్మ మొగుడు
  4. ఓరుమ్మడి బతుకులు
  5. కళ్ళు తెరవండ్రా
  6. పెరఫెక్ట్ వైఫ్
  7. రాధా మాధవీయం
  8. సెల్ గోల
  9. లవ్ పాఠాలు
  10. కొత్త దంపతులు
  11. మీరెలా అంటే అలాగే
  12. పుణ్యభూమి (డైలాగులు మాత్రమే)

స్టేజీ నాటకాలు

మార్చు
  1. మళ్ళీ ఎప్పుడొస్తారు [3]
  2. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు [4][5]
  3. ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం [4]
  4. ఊరుమ్మడి బతుకులు[6]

రావు అనారోగ్యంతో 2020, ఏప్రిల్ 14న హైదరాబాదు మెట్టుగూడ రైల్వే ఆసుపత్రిలో మరణించాడు.[7]

మూలాలు

మార్చు
  1. వి6 వెలుగు, టాకీస్ (14 April 2020). "సినీ రచయిత సి.ఎస్.రావు కన్నుమూత". Archived from the original on 15 ఏప్రిల్ 2020. Retrieved 15 April 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ఈనాడు, టాలీవుడ్ (15 April 2020). "ప్రముఖ రచయిత సి.ఎస్‌.రావు కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 15 ఏప్రిల్ 2020. Retrieved 15 April 2020.
  3. "Discover Hyderabad-City Lifestyle". hyderabad-best.com. Archived from the original on 2012-04-07. Retrieved November 23, 2011.
  4. 4.0 4.1 "Display Books of this Author". Avkf.org. Retrieved November 23, 2011.
  5. "Andhra Pradesh / Hyderabad News : Golden Nandi to DD telefilm". The Hindu. March 3, 2010. Archived from the original on 2010-03-07. Retrieved November 23, 2011.
  6. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
  7. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 April 2020). "చిరంజీవి తొలి చిత్రానికి కథ అందించిన సి.ఎస్. రావు ఇక లేరు". www.andhrajyothy.com. Archived from the original on 15 ఏప్రిల్ 2020. Retrieved 15 April 2020.

ఇతర లింకులు

మార్చు