కొఠారి సుబ్బన్న నాయుడు (1914 ఏప్రిల్ 18 - 2002 నవంబరు 22) 1934 నుండి 1952 వరకు పదకొండు టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. అతను ఆల్‌రౌండర్. 1931-32, 1961-62 మధ్య విశిష్టమైన రంజీ ట్రోఫీ కెరీర్‌ ఉంది. అతను క్రికెటర్ సికె నాయుడుకి తమ్ముడు. [1] [2]

సి.ఎస్. నాయుడు
ఎడమ నుండి: సి.కె.,సి.ఎస్., సి.ఎల్. నాయుడు
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1914-04-18)1914 ఏప్రిల్ 18
నాగపూర్, మహారాష్ట్ర
మరణించిన తేదీ2002 నవంబరు 22(2002-11-22) (వయసు 88)
ఇండోర్, మధ్య ప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్ బ్రేక్ గూగ్లీ
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 20)1934 జనవరి 5 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1952 జనవరి 12 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫ.క్లా
మ్యాచ్‌లు 11 174
చేసిన పరుగులు 147 5,786
బ్యాటింగు సగటు 9.18 23.90
100లు/50లు 0/0 4/33
అత్యధిక స్కోరు 36 127
వేసిన బంతులు 522 30,961
వికెట్లు 2 647
బౌలింగు సగటు 179.50 26.54
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 50
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 13
అత్యుత్తమ బౌలింగు 1/19 8/93
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 144/–
మూలం: ESPNCricinfo, 2020 మే 24

జీవితం తొలి దశలో

మార్చు

కొఠారి సుబ్బన్న నాయుడు 18 ఏప్రిల్ 1914 [1]నాగ్‌పూర్‌లో తెలుగు మాట్లాడే కాపు కుటుంబంలో జన్మించాడు. [3] [4] [5] ఇతని తల్లిదండ్రులు కొఠారి సూర్య ప్రకాశరావునాయుడు, మహాలక్ష్మి. [6] సిఎస్ నాయుడు పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పట్టణానికి చెందినవారు. [7] [8] CS నాయుడు అన్నయ్య CK నాయుడు భారత జాతీయ క్రికెట్ జట్టుకు మొదటి కెప్టెన్. [1]

కెరీర్

మార్చు

CS నాయుడు 1932లో 17 సంవత్సరాల వయస్సులో తన మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ని, 1961లో 46 సంవత్సరాల వయస్సులో చివరి మ్యాచ్‌నీ ఆడాడు.[9] 56 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో ఎనిమిది జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వాటిలో నాలుగింటికి కెప్టెన్‌గా ఉన్నాడు. [10] 1942-43 రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో, అతను భారతదేశంలో ఒక సీజన్‌లో నలభై వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. [2] 1944-45 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో, అతను ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 917 బంతులు బౌలింగ్ చేసి రికార్డు సృష్టించాడు. [2]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

నాయుడు 1934 జనవరి 5-8 లో కలకత్తాలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో తన తొలి ఆట ఆడాడు. 1952 జనవరి 12-14 లో కాన్పూర్‌లో ఇంగ్లాండ్‌తో తన చివరి టెస్టు ఆడాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "C. S. Nayudu". ESPN Cricinfo. Retrieved 24 May 2020.
  2. 2.0 2.1 2.2 "The IPL is born". ESPN Cricinfo. Retrieved 18 April 2018.
  3. M. L. Kantha Rao (July 1999), A Study of the Socio-Political Mobility of the Kapu Caste in Modern Andhra. University of Hyderabad. Chapter 6. p. 301–303. hdl:10603/25437
  4. A. Vijaya Kumari; Sepuri Bhaskar (1998). Social Change Among Balijas: Majority Community of Andhra Pradesh (in ఇంగ్లీష్). M.D. Publications. p. 14. ISBN 978-81-7533-072-6.
  5. Mukherji, Raju (2005). Cricket in India: Origin and Heroes (in ఇంగ్లీష్). UBS Publishers' Distributors. p. 13. ISBN 978-81-7476-508-6.
  6. Nayudu, Chandra (1995). C.K. Nayudu, a Daughter Remembers (in ఇంగ్లీష్). Rupa. p. 3. ISBN 978-81-7167-283-7.
  7. Nayudu, Chandra (1995). C.K. Nayudu, a Daughter Remembers (in ఇంగ్లీష్). Rupa. p. 3. ISBN 978-81-7167-283-7.
  8. Naidu, T. Appala (2018-06-29). "Row over C.K. Nayudu's statue". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-04-11.
  9. "First-Class Matches played by C.S. Nayudu". CricketArchive. Retrieved 16 September 2017.
  10. Wisden Cricketers' Almanack 2003, pp. 1643–44.