ప్రధాన మెనూను తెరువు

చలమాల ధర్మారావు (మార్చి 30, 1934 - మార్చి 19, 2013) తెలుగు భాషోద్యమ నాయకుడు మరియు ప్రముఖ గాంధేయవాది.

విషయ సూచిక

జీవిత విశేషాలుసవరించు

సి ధర్మారావుగా అందరికీ సుపరిచితుడైన ఈయన కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, పెద్ద అవుటపల్లి గ్రామంలో 1934, మార్చి 30వ తేదీన జన్మించాడు. గన్నవరం హైస్కూలు, ఏలూరు కాలేజీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఈయన విద్యాభ్యాసం సాగింది. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేశాడు. అధికార భాషా సంఘం కార్యదర్శిగా పనిచేశాడు. నడుస్తున్న చరిత్ర, ఆవలి తీరం అనే పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. సచివాలయంలో పనిచేసినప్పుడు కళానికేతన్ అనే సంస్థను స్థాపించి, ఎన్నో నాటకాలు, సాహిత్య ప్రదర్శనలు చేశాడు[1]. 'జనహిత’ అనే సంస్థ స్థాపించి దానికి కార్యదర్శిగా పనిచేశాడు.

రచనలుసవరించు

కాలమిస్టుగా, వ్యాసకర్తగా తెలుగు పత్రికా ప్రపంచంలో ఈయన చిరపరిచితుడు. జనహిత సంస్థ తరఫున ఈయన 1990లో 103 మంచి తెలుగు పుస్తకాల జాబితాను రూపొందించాడు. ఈయన ప్రకటించిన గ్రంథాలలో కొన్ని:

  1. రవ్వలుపువ్వులు
  2. ప్రేమించుకుందాం రండి
  3. అధికార భాష తీరు తెన్నులు...
  4. గోరాశాస్త్రి షష్టిపూర్తి ప్రత్యేక సంచిక
  5. ఇస్మాయిల్ షష్టిపూర్తి ప్రత్యేక సంచిక
  6. ఎ ఆర్ కృష్ణ షష్టిపూర్తి ప్రత్యేక సంచిక
  7. మనస్వి చలం శత జయంతి సంఘం ప్రత్యేక సంచిక

నటనారంగంసవరించు

ఇతడు నటుడిగా కూడా రాణించాడు. సినిమా పిచ్చోడు అనే చిత్రంలో హీరోగా నటించాడు. హరివిల్లు అనే సినిమాలో ఒక చిన్నపాత్రను పోషించాడు.

మరణంసవరించు

ఈయన 2013, మార్చి 19న హైదరాబాదులో మరణించాడు[2].

మూలాలుసవరించు