సి.పార్థసారథి 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన తెలంగాణ విశ్వవిద్యాయం, కొండా లక్ష్మణ్‌ ఉద్యానవర్సిటీ, అంబేద్కర్‌ విశ్వవిద్యాలయాలకు ఇంచార్జ్‌ వైస్‌ చాన్సలర్‌గా, నాబార్డు పాలకమండలి సభ్యునిగా పని చేశాడు. పార్థసారథి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌‌గా పనిచేసాడు.

సి.పార్థసారథి
జననం
సి.పార్థసారథి

1960
వృత్తి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌‌
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఎ.ఎస్ ఆఫీసర్

జననం, విద్యాభాస్యం

మార్చు

సి.పార్థసారథి 1960లో తెలంగాణ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన బీఎస్సీ (అగ్రికల్చర్‌), ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్‌) – ఆగ్రోనమి పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

మార్చు
 
అంతర్జాతీయ విత్తన సదస్సు (ఇష్టా), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాదులోని హైటెక్స్ లో నిర్వహించిన 32వ విత్తన రైతుల సమావేశంలో 2019 జూన్ 25న లో పాల్గొన్న సి. పార్థసారథి

పార్థసారథి 1988 డిసెంబర్‌ 4న విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టాడు. అతను 1993లో ఐఏఎస్‌ అధికారిగా ఎంపికై మొదట ఐఏఎస్‌గా ఆదిలాబాద్‌ జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన తరువాత అనంతపురం, వరంగల్‌ జిల్లాల జాయింట్ కలెక్టర్ కలెక్టర్‌గా విధులు నిర్వహించాడు. పార్థసారథి 19 జూన్‌ 2004 నుండి వరకు 5 జూన్‌ 2006 వరకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేశాడు.

పార్థసారథి 2006 జూన్‌ 6న మార్క్‌ఫెడ్‌ ఎండీగా, తర్వాత ఐఅండ్‌పీఆర్‌ (ప్రజాసంబంధాల) కమిషనర్‌గా, ఏ.పి. ఫిల్మ్‌, టీవీ, ధియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా, 2011 జూన్‌ 18న ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ పీడీగా, 2014 జూన్‌ 2న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2015 ఏప్రిల్‌ 15 నుండి 2020 ఫిబ్రవరి 4వ తేదీ వరకు వ్యవసాయశాఖ కమిషనర్‌గా పని చేశాడు. ఆయన వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో రైతుబంధు పథకం అముకు సంబంధించి ప్రతిష్టాత్మక స్కోచ్‌ పురస్కారాన్ని అందుకున్నాడు. అతను ఫిబ్రవరి 2020 నుండి ఏప్రిల్‌ 30 వరకు ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేశాడు.

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ పార్థసారథిని 2020 సెప్టెంబరు 8న రాష్ట్ర ఎన్నిక సంఘం కమిషనర్‌గా నియమించింది. [1] 2020 సెప్టెంబరు 9న రాష్ట్ర ఎన్నిక సంఘం కమిషనర్‌గా భాద్యతలు చేపట్టాడు.[2][3] మూడేళ్ళ తరువాత పదవీ కాలాన్ని మరో సంవత్సరంపాటు పొడిగిస్తూ 2023 సెప్టెంబరు 8న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానీయా ఆదేశాలు జారీ చేశాడు.[4]

మూలాలు

మార్చు
  1. Sakshi (9 September 2020). "రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  2. Sakshi (10 September 2020). "ఈసీ‌గా బాధ్యతలు చేపట్టిన పార్థసారథి". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  3. Suryaa (8 September 2020). "తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా పార్థసారథి నియామకం". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.
  4. Namasthe Telangana (8 September 2023). "రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి ప‌ద‌వీకాలం పొడిగింపు". Archived from the original on 8 September 2023. Retrieved 8 September 2023.