సీతాకళ్యాణం (1934 సినిమా)
సీతాకళ్యాణం తెలుగు పౌరాణిక చలన చిత్రం,1934 అక్టోబర్ 6 న విడుదల.వేల్ పిక్చర్స్ పతాకంపై పినపాల వెంకటదాసు నిర్మించిన ఈ చిత్రంలో బెజవాడ రాజారత్నం, వేమూరి గగ్గయ్య, కన్నాంబ మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం గాలి పెంచల నరసింహారావు అందించారు.
సీతాకళ్యాణం (1934 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్రపు నరసింహారావు |
---|---|
నిర్మాణం | పినపాల వెంకటదాసు |
రచన | రమణమూర్తి |
తారాగణం | బెజవాడ రాజారత్నం, వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య, కన్నాంబ, టి.వెంకటేశ్వర్లు, యడవల్లి సూర్యనారాయణ, కొచ్చర్లకోట సత్యనారాయణ, కళ్యాణి |
సంగీతం | గాలిపెంచల నరసింహారావు |
ఛాయాగ్రహణం | కె.రామనాథ్ |
కళ | ఎ.కె.శేఖర్ |
నిర్మాణ సంస్థ | వేల్ పిక్చర్స్ |
నిడివి | 133 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సీత కథతో రూపొందిన తొలి తెలుగు సినిమా 'సీతా కల్యాణం'. మచిలీపట్నంలోని 'మినర్వా సినిమా' థియేటర్ యజమాని అయిన పినపాల వెంకటదాసు మద్రాసులో వేల్ పిక్చర్స్ బేనర్ ని నెలకొల్పి దానిపై సినిమాలు నిర్మించారు. దక్షిణభారత సాంకేతిక నిపుణులతో తయారైన తొలి తెలుగు సినిమాగా 'సీతా కల్యాణం' పేరు తెచ్చుకొంది.[1] ఈ సినిమా విడుదలయ్యాకా బాగా ప్రజాదరణ పొంది విజయవంతమైంది.[2]
తారాగణం
మార్చు- మాస్టర్ కల్యాణి -శ్రీరాముడు
- రాజారత్నం -సీత
- మాధవపెద్ది వెంకట్రామయ్య -విశ్వామిత్రుడు
- నెల్లూరు నాగ రాజారావు -దశరథుడు
- గోవిందరాజుల వెంకట్రామయ్య -జనకుడు
- తీగల వెంకటేశ్వర్లు -రావణుడు
- నాగేశ్వరరావు -లక్ష్మణుడు
- కమలకుమారి -అహల్య
- సూరిబాబు -గౌతముడు
- కృత్తివెంటి వెంకట సుబ్బారావు -మారీచుడు
- లంక కృష్ణమూర్తి -సుబాహుడు
- శ్రీహరి -కౌసల్య
- రామతిలకం -కైకేయి
- కోకిలామణి -సుమిత్ర
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: చిత్రపు నరసింహారావు
సంగీతం: గాలి పెంచల నరసింహారావు
నిర్మాత: పినపాల వెంకటదాసు
నిర్మాణ సంస్థ: వేల్ పిక్చర్స్
ఛాయాగ్రహణం: కె.రామనాద్
కళ: ఎ.కె.శేఖర్
రచన: రమణమూర్తి
నేపథ్య గానం: బెజవాడ రాజారత్నం, కళ్యాణి, శ్రీహరి, కమలకుమారి, కె.వి.సుబ్బారావు, లంకా కృష్ణమూర్తి, రామతిలకo, పి.సూరిబాబు, కోకిలామణీ,
విడుదల:06:10:1934.
పాటలు_ పద్యాలు
మార్చు1.అరిజన విజయులమై అరుదెంతుము సెలవు నొసగుము,
2.ఆనందమై యలరారుచుండెన్ ఘనతరులపై , గానం.బెజవాడ రాజారత్నం
3.చెలియా పరిమెళిత సుమములచే విలసితమౌ డోలిక,గానం.బెజవాడ రాజారత్నం.
4.చోద్యమేమి స్వామీ యీ కాననంబు గనగన్, గానం.కళ్యాణి
5.జయ జయ మహేశా జయ పార్వతీశ జయ జయ,
6. నిరాదరణయేలా అంబా వరాలోసగి పరిపాలింప వేల, గానం.శ్రీహరి
7.పరబ్రహ్మ సచ్చిదానంద పరమ పురుష పతిత పావన, గానం.కమలకుమారి
8.ప్రళయకాల బైరవాకృతులమై విలయంబుగ , గానం.కె.వి.సుబ్బారావు, లంకా కృష్ణమూర్తి
9.ప్రాణనాథా యేటికిటులన్ చింతనొందగన్, గానం.రామతిలకo
10.ప్రేమా మహిమన్ తెలియగన్ తరమగునా జగతిన్, గానం.కల్యాణి
11.భక్త పోషిణె శక్తి ప్రదాయనే ముక్తి సంధాయనే దీనావనా,
12మానస చోరా సుధీర కనులారగా నినుగాంచి, గానం.బెజవాడ రాజారత్నం
13.మౌనీంద్రానాదు పూర్వపుణ్యమున మీసేవ లభించెన్, గానం.కల్యాణి
14.రఘురామ నామ స్మరణమృత పానమే కామిత, గానం. పి.సూరిబాబు
15.రామ జయతు జయారాజిత శ్యామ,
16.వనసుమ పరిమలంబు వర్ణింపగా తరంబే, గానం.శ్రీహరి, కోకిలమణి, రామతిలకo,
17.వివిధ పరిమిళిత సుమములగాంచుమ అవిరళమగు, గానం.రామాతిలకం
18.శివదీక్షా పరురాలనురా నే శీలమెంతైన విడువజాలనురా,
19.శ్రీనాధా తరించితి నీ కృపచేతనే గాదా శ్రీనాథ, గానం.బెజవాడ రాజారత్నం
20.సర్వేశ్వరా నను బ్రోవగ రావా నిర్వికారా గుణ, గానం.కమలకుమారి .
మూలాలు
మార్చు- ↑ అలనాటి చిత్రం: సీతా కల్యాణం (1934) - ఇండియా గ్లిట్జ్
- ↑ "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 జనవరి 2007. Archived from the original on 10 జూన్ 2017. Retrieved 7 June 2017.
. 3. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.