సీతా రామం 2022లో తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానున్న సినిమా. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నాదత్ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.[1] దుల్కర్ సల్మాన్, రష్మికా మందన్న, మృణాళిని ఠాకూర్‌, సుమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి పాట ‘ఓ సీత హే రామ’ ‪ని మే 9న విడుదల చేసి[2] ఆగష్టు 5న విడుదల చేశారు.[3] ఈ చిత్రం టాలీవుడ్‌లో మృణాళిని ఠాకూర్‌కు తొలి చిత్రం. 1964 నాటి నేపథ్యంలో, లెఫ్టినెంట్ రామ్, కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న అనాథ ఆర్మీ అధికారి, సీతా మహాలక్ష్మి నుండి అనామక ప్రేమ లేఖలను పొందాడు, ఆ తర్వాత రాముడు సీతను కనుగొని తన ప్రేమను ప్రతిపాదించే పనిలో ఉన్నాడు.

సీతా రామం
దర్శకత్వంహను రాఘవపూడి
రచనహను రాఘవపూడి
కథహను రాఘవపూడి
నిర్మాతఅశ్వినీదత్, స్వప్నాదత్
ఛాయాగ్రహణంపి. ఎస్. వినోద్
శ్రేయాస్ కృష్ణ
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంవిశాల్ చంద్రశేఖర్
పాటల రచయిత: అనంత్ శ్రీరామ్
నిర్మాణ
సంస్థలు
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్
విడుదల తేదీ
2022 ఆగష్టు 5
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్30 కోట్లు
బాక్సాఫీసుest. ₹91.4 - 98.1 crore

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్
  • నిర్మాత: అశ్వినీదత్, స్వప్నాదత్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి
  • సంగీతం: విశాల్ చంద్రశేఖర్‌
  • సినిమాటోగ్రఫీ: పి. ఎస్. వినోద్ , శ్రేయాస్ కృష్ణ
  • ఆర్ట్ డైరెక్టర్ : వైష్ణవి రెడ్డి, ఫైసల్ అలీ ఖాన్
  • పాటలు: అనంత్ శ్రీరామ్, కృష్ణ కాంత్

పాటల జాబితా మార్చు

1:ఓ సీతా హే రామా , రచన:అనంత శ్రీరామ్, గానం. ఎస్ పి చరణ్, రమ్య బెహరా

2: ఇంతందం దారి మళ్ళిందా , రచన: కృష్ణకాంత్, గానం.ఎస్ పి.చరన్

3: కానున్న కళ్యాణం ఏమన్నది , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.అనురాగ్ కులకర్ణి , సింధూరి . ఎస్

4: కన్నుల ముందర , రచన: కృష్ణకాంత్, గానం.సునీత ఉపద్రష్ట

5: ఎవరిని అడిగాను ఏమైందని , రచన: కృష్ణకాంత్, గానం. యాజిన్ నజీర్

6: వస్తా నే వెంటనే ఉంటా నీ వెంటనే, రచన: కృష్ణకాంత్ , గానం.కపిల్ కపిలాన్, చిన్మయి శ్రీపాద.

మూలాలు మార్చు

  1. Zee Cinemalu (11 April 2022). "యుద్ధంతో రాసిన ప్రేమకథ" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  2. Sakshi (8 May 2022). "దుల్కర్‌ సల్మాన్‌-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్‌డేట్‌." Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  3. Sakshi (5 August 2022). "'సీతారామం' మూవీ రివ్యూ". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  4. 10TV (28 July 2020). "'యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌'.. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్." (in telugu). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=సీతా_రామం&oldid=4155016" నుండి వెలికితీశారు