సుంకర సత్యనారాయణ

సుంకర సత్యనారాయణ (1909 మార్చి 23 - 1975 సెప్టెంబరు 9) ప్రజా రచయిత[1]. అతడు అనేక పాటలను, నాటకాలను రచించాడు[2]. చంచలనం సృష్టించిన "మాభూమి" నాటకం వాసిరెడ్డి భాస్కరరావు తో కలసి రచించాడు.[3] అనేక బుర్రకథలు, నాటకాలు రాసాడు.

జీవిత విశేషాలు

మార్చు

సుంకర కృష్ణా జిల్లా ఈడుపుగల్లు గ్రామానికి చెందిన వాడు.

ప్రజానాట్యమండలి అధ్వర్యంలో ప్రజలకు రాజకీయ సందేశాలను అందించడానికి జానపద రూపంలో జరిగే ఉద్యమ నాటకాలను రచించాడు. [4] ప్రజలలో చైతన్యం కలిగించే అనేక బుర్రకథలను రాసాడు. వాటిలో కష్టజీవి, అమరజీవి, రుద్రమదేవి, కందుకూరి వీరేశలింగం, మహారథి కామ వంటివి ముఖ్యమైనవి. అనేక కథలను కూడా రాసాడు.[5] అతడు వాసిరెడ్డి భాస్కరరావు తో కలసి 1945లో "ముందడుగు", 1947లో "మా భూమి" నాటకాలను రంచించాడు. ఈ నాటకాలలో జమీందారీ వ్యవస్థలో కుల వివక్ష, హైదరాబాదు నిజాం నియంతృత్వ పోకడలను తెలియజేసారు. వారిచ్చిన సందేశాన్ని ప్రజలకు చేరువ కావడానికి బుర్రకథల రూపంలో కూడా రాసారు.[6] వారిద్దరూ "సుంకర-వాసిరెడ్డి ద్వయం" గా పేరొందారు. వారు తెలుసు సినిమా కథలు, సంభాషణలు, పాటలు రచించారు.[7] వీరిద్దరూ 1952 లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో విడుదలైన పల్లెటూరు, 1954 లో పరివర్తన సినిమాలకు సంభాషణలు రాసారు. సత్యనారాయణ 1956లో "ఇది నిజం" సినిమాకు కథను రాసాడు. 1959లో నమ్మిన బంటు సినిమాకు కథ, సంభాషణలు రాసాడు.[8]

మూలాలు

మార్చు
  1. "ప్రస్థానం | సుంకర సత్యనారాయణ". www.prasthanam.com. Retrieved 2018-04-14.
  2. Koteswaramma, Kondapalli (2015-11-12). The Sharp Knife of Memory. Zubaan. ISBN 9789384757885.
  3. "Maa Bhoomi By Sunkara Satyanarayana, Vasireddy Bhaskararao - DRAMAS - paataka.com". paataka.com. Archived from the original on 2020-12-05. Retrieved 2018-04-14.
  4. Downing, John D. H.; Downing, John Derek Hall (2011). Encyclopedia of Social Movement Media. SAGE Publications. ISBN 9780761926887.
  5. MUKHOPADHYAY, DURGADAS (2017-06-20). Folk Arts and Social Communication. Publications Division Ministry of Information & Broadcasting. ISBN 9788123024882.
  6. Natarajan, Nalini; Nelson, Emmanuel Sampath (1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. ISBN 9780313287787.
  7. Narasimham, M. L.; Narasimham, M. L. (2013-05-12). "PALLETOORU (1952)". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-04-14.
  8. "Satyanarayana Sunkara". IMDb. Retrieved 2018-04-14.

ఇతర లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుంకర సత్యనారాయణ పేజీ