సుందర్‌ సి. మీనన్‌ (జననం 1962 మార్చి 8) కేరళకు చెందిన భారతీయ వ్యాపారవేత్త. గల్ఫ్ సహకార మండలి (GCC) ఆధారిత వ్యవస్థాపకుడు, ది సన్ గ్రూప్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు కూడా.

సుందర్ మీనన్
జననం (1962-03-08) 1962 మార్చి 8 (వయసు 62)
త్రిస్సూర్, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిసన్ గ్రూప్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సిఈఓ
పిల్లలు2
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం

ప్రారంభ జీవితం

మార్చు

సుందర్ మీనన్ 1962లో జన్మించాడు. ఆయన ఎకనామిక్స్‌లో పట్టభద్రుడయ్యాడు, ఎంబిఎ పూర్తి చేసాడు. యూరోపియన్ కాంటినెంటల్ యూనివర్శిటీ (EUC-USA) 2015లో జిసిసి ఆర్థికాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. [1]

కెరీర్

మార్చు

సుందర్ మీనన్ 1986లో ఖతార్ చేరుకున్నాడు. అక్కడ వివిధ సంస్థలలో పనిచేసాడు. 1990ల ప్రారంభంలో, అతను దోహాలో ఉన్న బ్రిటిష్ ఆయిల్ ఫీల్డ్ సర్వీస్ కంపెనీలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు.

ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దాని మొదటి కంపెనీతో 1999లో సన్ గ్రూప్ ఇంటర్నేషనల్‌ను స్థాపించాడు. దీని సమూహం యుఎఇ తో పాటు, ఖతార్, పనామా, భారతదేశంలలో కార్యకలాపాలను విస్తరించి ఉంది. సన్ గ్రూప్ అనుబంధ సంస్థల ప్రధాన వ్యాపార ప్రయోజనాలలో పెట్రోకెమికల్స్, సహజ వనరులు, రవాణా, రియల్ ఎస్టేట్ వంటివి ఉన్నాయి.[2]

సోషల్ వర్క్ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2016లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[3][4][5]

ఆర్థిక మోసం ఆరోపణ

మార్చు

సుందర్‌ మీనన్‌తో పాటు మరి కొందరు తమ సంస్థల పేరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తూ 62 మందికి పైగా ఇన్వెస్టర్ల నుంచి రూ.7.78కోట్ల డిపాజిట్లు చేయించారు. స్కీమ్‌ మెచ్యూరిటీ వ్యవధి తర్వాత కూడా ఆ డబ్బులు లబ్దిదారులకు చెల్లించలేదు. దీంతో, ఆర్థిక మోసం కేసులో వివిధ సెక్షన్ల కింద ఆయనపై 18 కేసులు నమోదయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆయనను రిస్సూర్ లో 2024 ఆగస్టు 4న అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపర్చిన తర్వాత రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు ఆయనను తరలించారు.[6]

అవార్డులు

మార్చు
  • 2016 మార్చి 31న భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు.[7]
  • 2015లో ఆసియా పసిఫిక్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డు.[8]
  • అరబ్ వరల్డ్ 2013 అరేబియన్ బిజినెస్ మ్యాగజైన్‌లో ఫోర్బ్స్ టాప్ 100 భారతీయ వ్యాపార నాయకులలో ఒకడుగా నమోదు.[9]
  • గల్ఫ్ 2012లో అత్యంత శక్తివంతమైన 100 మంది భారతీయులలో ఒకడు.[10]
  • ఇండో బ్రిటిష్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు.[11]
  • ఫోర్బ్స్ మ్యాగజైన్ మిడిల్ ఈస్ట్, యుఎఈలో అగ్రశ్రేణి భారతీయ నాయకుల జాబితాలో చేరాడు.[12]
  • మారిటైమ్ సొల్యూషన్స్, ఫిలాంత్రోపీ-అమ్మ అవార్డ్ 2015 కొరకు టిజిఎమ్ అవార్డు.[13]
  • 2012లో అరేబియన్ బిజినెస్ అవార్డు.[14]
  • కేరళ రాష్ట్ర వ్యాపారి వ్యవసాయి సమితి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు.[15]

మూలాలు

మార్చు
  1. "T A Sundar Menon conferred with a honorary doctorate by European Continental University (ECU-USA)". The Peninsula. 9 February 2015.
  2. "Padmashri Dr. Sundar Menon is a prominent figure among the NRI businessmen in the Gulf region". UAE malayali Directory. 18 November 2015.
  3. "Kerala-born NRI Businessman Dr Sundar Menon Receives Padma Shri for Social Work". Indian Eagle. 17 July 2016. Archived from the original on 19 మే 2023. Retrieved December 28, 2016.
  4. "Padma Awards 2016, UAE". Ministry of Home Affairs. 26 January 2016. Archived from the original on 11 అక్టోబరు 2020. Retrieved 26 January 2016.
  5. "Indian Expat Awarded Padma Shri For Social Work". The Gulf News. 28 January 2016.
  6. "Kerala: పద్మశ్రీ అవార్డు గ్రహీత అరెస్ట్‌..ఎందుకంటే..? | padma-shri-awardee-arrested-in-kerala". web.archive.org. 2024-08-07. Archived from the original on 2024-08-07. Retrieved 2024-08-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Padma Awards 2016, UAE". Ministry of Home Affairs. 26 January 2016. Archived from the original on 11 అక్టోబరు 2020. Retrieved 26 January 2016.
  8. "Asia Pacific Entrepreneurship Award". asianentrepreneur.org. Archived from the original on 2021-01-27. Retrieved 2024-08-07.
  9. "Forbes Top 100 Indian Business Leaders in the Arab World". Forbes Middle East.
  10. "100 most powerful Indians in the Gulf 2012". Arabian Business.
  11. PTI (20 November 2015). "M K Muneer, PTM Sunish bag Indo-British award". Retrieved 16 May 2018.
  12. "profile section". forbesmiddleeast.com. Archived from the original on 2016-06-07. Retrieved 2024-08-07.
  13. "AMMA Award 2015". ammafoundation.com.my.
  14. "REVEALED: The Gulf's 100 most powerful Indians". arabianbusiness.com.
  15. "Padmashri Dr. Sundar Menon". uae.malayali.directory. 18 November 2015.