గల్ఫ్ సహకార మండలి

గల్ఫు యొక్క అరబ్బు రాష్ట్రాల సహకార మండలి (Cooperation Council for the Arab States of the Gulf), వ్యవహిరకంగా గల్ఫు సహకార మండలి (GCC, مجلس التعاون الخليجي), అనేది ఇరాక్ తప్పించి పర్షియా అగాధం చుట్టూ ఉన్న అరబ్బు రాష్ట్రాల ప్రాంతీయ, అంతర్ప్రభుత్వ, రాజకీయ మఱియు ఆర్థిక కూటమి. దీని యొక్క సభ్యదేశాలు బహ్రయిన్, కువైట్, ఒమన్, కతర్, సౌదీఅరేబియా మఱియు యు.ఏ.ఈ.

مجلس التعاون لدول الخليج العربية
గల్ఫ్ యొక్క అరబ్బు రాష్ట్రాల సహకార మండలి
Flag of గల్ఫ్ యొక్క అరబ్బు రాష్ట్రాల సహకార మండలి
గల్ఫ్ సహకార మండలి యొక్క స్థానం
సభ్యదేశాలను సూచించు పటము
పాలనా కేంద్రంసౌదీ అరేబియా రియాద్, సౌదీ అరేబియా
అధికార బాషలు అరబ్బీ
Type వాణిజ్య కూటమి
సభ్యత్వం
నేతలు
 -  కార్యదర్శి బహ్రయిన్ ఏ.బిన్ రషీద్ అల్ జయాని
 -  మండల అధ్యక్ష పదవి  కువైట్[1]
స్థాపన
 -  GCC పేరుతో 1981 మే 25; 41 సంవత్సరాల క్రితం (1981-05-25) 
విస్తీర్ణం
 -  మొత్తం 26,73,108 కి.మీ² 
 చ.మై 
 -  జలాలు (%) 0.6
జనాభా
 -  2014 అంచనా 50,761,260 
 -  జన సాంద్రత 17.37 /కి.మీ² 
 /చ.మై
జీడీపీ (nominal) 2013 అంచనా
 -  మొత్తం $1,665 billion 
 -  తలసరి $33,005 
కరెన్సీ ఖలీజి (ప్రతిపాదిత)
6 కరెన్సీలు
వెబ్‌సైటు
http://www.gcc-sg.org

ప్రస్తుత సభ్య రాష్ట్రాలన్నీ రాచిరిక రాజ్యాలు. మూడు రాజ్యాంగబద్ధ రాచరికాలు, రెండు సంపూర్ణ రాజరికాలు, ఒకటి (యు.ఏ.ఈ) సమాఖ్యాస రాచరికం. జోర్డాన్, మొరాకో మఱియు యెమెన్ యొక్క భవిష్యత్తు సభ్యత్వం గూర్చి చర్చలు జరిగాయి. మరింత బలమైన ఆర్థిక, రాజకీయ, సైనిక సమన్వయం కోసం GCCని గల్ఫు సమాఖ్యగా రూపుదిద్దాలని సౌదీఅరేబియా ప్రతిపాదన చేసింది. ఇతర దేశాలు ఈ ప్రతిపాదనకు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

స్థాపనసవరించు

ఈ కూటమి 1981 మే 25న అబూ ధాబీలో స్థాపించబడింది. గల్ఫు సహకార మండల దేశాల మధ్య ఏకీకృత ఆర్థిక ఒప్పందం అబూ ధాబీలో 1981 నవంబరు 11 న కుదిరింది. ఈ దేశాలు తరచూ "GCC రాష్ట్రాలు"గా పిలవబడతాయి.

లక్ష్యాలుసవరించు

పేర్కొనదగ్గ లక్ష్యాలు:

  • మతం, ద్రవ్యం, వాణిజ్య, ఆచారవ్యవహారాలు, పర్యాటక, శాసనం, పరిపాలన వంటి వివిధ రంగాల్లో నిబంధనలు రూపొందించుట
  • పరిశ్రమ, గనులు, వ్యవసాయం, నీరు, జంతు వనరుల యొక్క శాస్త్రీయ, సాంకేతిక పురోగతి
  • శాస్త్రీయ పరిశోధన కేంద్రాలు నెలకొల్పుట
  • జాయింట్ వెంచర్లు అమర్చుట
  • ఐక్య సైనిక బలగాలు
  • ప్రైవేటు రంగం సహకార, ప్రోత్సాహాలు అందించుట
  • వారి ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం చేయుట
  • ఒక సర్వసాధారణ కరెన్సీ స్థాపించటం

ఈ ప్రాంతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. చమురు మఱియు సహజ వాయువుల ఆధారం దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు నిర్మాణ రంగం మఱియు పెట్టుబడి రంగాల ఆదాయం విజృంభణ, దశాబ్దాల ముడిచమురు నిల్వల మద్దతు.

చిహ్నంసవరించు

GCC యొక్క చిహ్నం రెండు కేంద్రక వృత్తాలు కలిగి ఉంటుంది. పెద్ద వృత్తం యొక్క ఎగువ భాగంన, బిస్మిల్లా పదబంధం వ్రాసి ఉంది. క్రింది భాగంలో మండలి పూర్తి పేరు వ్రాసి ఉంది. రెండూ అరబ్బీ భాషలో ఉంటాయి. లోపలి వృత్తం మండలి యొక్క ఆరు సభ్య దేశాలు సూచిస్తూ ఒక చిత్రించబడిన షడ్భుజి ఆకారం కలిగి ఉంటుంది. షడ్భుజి లోపలి అరేబియా ద్వీపకల్పం ఆవరించి ఒక పటం నింపుతుంది. దీనిపై సభ్యదేశాల విస్తరణ గోధుమ రంగులో ఉంటుంది. అత్యంత ఎత్తున దేశ జండాలు ఉంటాయి.

కార్యదర్శులుసవరించు

పదవీకాలం పేరు దేశం
1981 మే 26  - ఏప్రిల్ 1993 అబ్దుల్లా బిషారా కువైట్
ఏప్రిల్ 1993 – ఏప్రిల్ 1996 ఫాహిం బిన్ సుల్తాన్ అల్ కాసిమి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఏప్రిల్ 1996 – 2002 మార్చి 31 జామిల్ ఇబ్రహీం హేజైలిన్ సౌదీ అరేబియా
2002 ఏప్రిల్ 1 – 2011 మార్చి 31 అబ్దుల్ రహ్మాన్ బిన్ హమద్ అల్ అత్తియ కతర్
2011 ఏప్రిల్ 1 – ప్రస్తుతం ఏ. బిన్ రషీద్ అల్ జయాని బహరేన్

సభ్యదేశాలుసవరించు

కూటమిలో ఈ ఆరు దేశాలు:

Flag సాధారణ పేరు Official name ప్రభుత్వ రకం
తెలుగులో అరబ్బీ - తెలుగు లిపిలో
  బహ్రయిన్ బహ్రయిన్ రాజ్యం మంలకత్ అల్-బహ్రయిన్ రాజ్యాంగబద్ధ రాచరికం
  కువైట్ కువైట్ రాష్ట్రం దవ్లాత్ అల్-కువైట్ రాజ్యాంగబద్ధ రాచరికం
  ఒమన్ ఒమన్ సుల్తానేటు సుల్తానేట్ ఔమాన్ సంపూర్ణ రాజరికం
  కతర్ కతర్ రాష్ట్రం దవ్లాత్ కతర్ రాజ్యాంగబద్ధ రాచరికం
  సౌదీఅరేబియా సౌదీఅరేబియా రాజ్యం అల్-మంలక అల్-అరబీయ్య అస్-సు'ఊద్దియా సంపూర్ణ రాజరికం
  యు.ఏ.ఈ సమైక్య అరబ్బు ఏమిరేట్లు అల్-ఎమిరాత్ అల్-‘అరబీయ అల్-ముత్తఃదాః సమాఖ్యాస రాచరికం

సూచికలుసవరించు

  1. "Kuwait hopes emir visit to Iran will boost Gulf peace". Gulf News. Retrieved 23 July 2014.

బయటి లంకెలుసవరించు