సుగుణ పురుషోత్తమన్
సుగుణ పురుషోత్తమన్ (1941–25 ఫిబ్రవరి 2015) ఒక భారతీయ కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, స్వరకర్త, గురువు. ఈమెకు 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
సుగుణ పురుషోత్తమన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
స్థానిక పేరు | சுகுணா புருசோத்தமன் |
జన్మ నామం | సుగుణ సరస చక్రవర్తి |
జననం | 1941 పొన్విలైంతకలత్తూర్, చెంగల్పట్టు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా |
మరణం | 2015, ఫిబ్రవరి 25 (వయసు 74) చెన్నై, తమిళనాడు, భారతదేశం |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | గాయని, స్వరకర్త, గురువు |
వాయిద్యాలు | వీణ, గోటువాయిద్యం |
విశేషాలు
మార్చుఈమె చెంగల్పట్టు సమీపంలోని పొన్విలైంతకలత్తూర్ గ్రామంలో 1941లో జన్మించింది. 1960లలో ఈమె కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనం పొంది ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద శిక్షణ తీసుకుంది. అక్కడ మణి కృష్ణస్వామి, సుగుణా వరదాచారి, పద్మా నారాయణస్వామి, రుక్మిణీ రమణి ఈమె సహాధ్యాయులు.[1][2] ఈమె సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంది. మార్దంగికుడు తిన్నియం వెంకట్రామ అయ్యర్ వద్ద "లయం" నేర్చుకుంది.[2] లలితాబాయి శ్యామణ్ణ వద్ద వీణా వాదన నేర్చుకున్నది.[3]
తిన్నియం వెంకట్రామ అయ్యర్ శిష్యరికంలో ఈమె కష్టతరమైన పల్లవులను అరుదైన తాళాలతో స్వరకల్పన చేసి ఆలపించడం నేర్చుకుంది. ఈమె "ద్వితాళ అవధానం"లో నిష్ణాతురాలు. పల్లవులను ఆలపించేటప్పుడు వేరువేరు గతులలో రెండు విభిన్న తాళాలను ఆ పల్లవికి సరిపోయేవిధంగా రెండు చేతులతో వేయడాన్ని ద్వితాళ అవధానం అంటారు. ఈ ప్రయోగంతో అందరూ ఈమెను "పల్లవి సుగుణ" అంటూ పిలవసాగారు. "శరబంధనం", "సింహబంధనం" వంటి తాళాలతో పల్లవులను ఆలపించడం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈమె సంగీత రచనలన్నీ "కదంబం" పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చి సంగీతలోకానికి అందించింది[3].
కె.గాయత్రి,[4][5]శ్రీనిధి చిదంబరం[6] వంటి సంగీత విద్వాంసులకు ఈమె సంగీత శిక్షణనిచ్చింది.
ఈమె తన 74వ యేట క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ 2015, ఫిబ్రవరి 25వ తేదీన మరణించింది.[2]మరణించే నాటికి ఈమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2] ఒక కుమార్తె కుముద కూడా సంగీత విద్వాంసురాలు.[7]
పురస్కారాలు
మార్చు- 2004 - సంగీత చూడామణి
- 2006 - కళైమామణి
- 2006 - మద్రాసు సంగీత అకాడమీ వారి వాగ్గేయకార పురస్కారం.
- 2010 - కర్ణాటక సంగీత గాత్ర విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డు[8]
- 2012 - వెల్లూర్ గోపాలాచారియర్ అవార్డు[9][10]
మూలాలు
మార్చు- ↑ "Carnatic vocalist and teacher Suguna Purushothaman passes away". Tamilnadudotcom. Archived from the original on 3 జనవరి 2017. Retrieved 2 January 2017.
- ↑ 2.0 2.1 2.2 2.3 Kolappan, B. "Carnatic musician passes away at 74". The Hindu. Retrieved 2 January 2017.
- ↑ 3.0 3.1 శంకరనారాయణ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్ట్. p. 200. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 27 February 2021.
- ↑ Ramadevi, B. "A mixed offering". The Hindu. Retrieved 2 January 2017.
- ↑ "Youngsters uphold Carnatic tradition at Thiruvaiyaru - Times of India". The Times of India. Retrieved 2 January 2017.
- ↑ GAUTAM, SAVITHA. "Shades of devotion". The Hindu. Retrieved 2 January 2017.
- ↑ "Reign of melody". The Hindu. Retrieved 2 January 2017.
- ↑ Jha, Manisha. "Sangeet Natak Akademi fellowship for Girija Devi, T.K. Murthy, Dagar". The Hindu. Retrieved 2 January 2017.
- ↑ Chandran, R. "Sruti pays tribute to its founder-editor". The Hindu. Retrieved 2 January 2017.
- ↑ Reporter, Staff. "30 long years: lyrical journey of Sruti magazine". The Hindu. Retrieved 2 January 2017.